దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2005 ఏప్రిల్ 25వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2005 మార్చి 7 నుండి ఏప్రిల్ 25 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. ఒక ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు మనం మనకు నియమించబడిన సమాచారాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు, అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం? [be 234వ పేజీ 1-3 పేరాలు, బాక్సులు]
2. ప్రసంగమిచ్చేటప్పుడు మనకు నియమించబడిన సమాచారంలో ఎంత భాగాన్ని చర్చించడానికి ప్రయత్నించాలి? [be 234వ పేజీ 4వ పేరా-235వ పేజీ 1వ పేరా]
3. క్షేత్ర పరిచర్యలో సంభాషణను పురికొల్పేందుకు మనం ప్రశ్నలను ఎలా ఉపయోగించవచ్చు? (అపొ. 8:30) [be 236వ పేజీ 2-5 పేరాలు]
4. బైబిలు విద్యార్థులు ‘సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములను’ ఉపయోగించుకునేందుకు సహాయం చేయడానికి మనం ప్రశ్నలను ఎలా ఉపయోగించవచ్చు? (హెబ్రీ. 5:14) [be 238వ పేజీ 1వ పేరా]
5. రోమీయులు 8:31, 32 లో, యెషయా 14:27 లో వేయబడిన ప్రశ్నలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? [be 239వ పేజీ 1-2 పేరాలు]
ఒకటవ నియామకం
6. శిష్యులను చేసే మన పనిలో మనం ‘క్రీస్తును పునాదిగా’ ఎలా వేస్తాము? (1 కొరిం. 3:11) [be 278వ పేజీ 1-2 పేరాలు]
7. యెహోవా 1914లో తన కుమారునికి పూర్తి పరిపాలనా అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి, మనం “నీ రాజ్యము వచ్చు గాక” అని ప్రార్థించడంలో మన ఉద్దేశమేమిటి? (మత్త. 6:9, 10) [be 279వ పేజీ 4వ పేరా]
8. క్రైస్తవులందరూ చదివే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపించాలి, ఈ విషయంలో యేసు ఎలా మాదిరినుంచాడు? [w03 3/15 10వ పేజీ 5వ పేరా; 12వ పేజీ 2వ పేరా]
9. యోషీయా యేసుల ఉదాహరణలు, యౌవనులు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి ఎలా సహాయం చేస్తాయి? [w03 4/1 8వ పేజీ 3-4 పేరాలు; 10వ పేజీ 3వ పేరా]
10. మనం దేవుణ్ణి ఎందుకు నమ్మవచ్చు? (సామె. 3:5, 6) [w03 11/1 4వ పేజీ 6వ పేరా-5వ పేజీ 1వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. ఇశ్రాయేలును పరిపాలించడానికి మానవ రాజులెవ్వరూ లేనప్పుడు, “తాను నియమించిన రాజునకు ఆయన [యెహోవా] బలమిచ్చును” అని హన్నా ఎందుకు ప్రార్థించింది? (1 సమూ. 2:10)
12. ఇశ్రాయేలీయుల మధ్య నిబంధన మందసము ఉన్నా వారు ఓడించబడ్డారనే వాస్తవంనుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 సమూ. 4:3, 4, 10)
13. మొదటి సమూయేలు 16:10, 11 వచనాలు దావీదు యెష్షయి ఎనిమిదవ కుమారుడని సూచిస్తుంటే, 1 దినవృత్తాంతములు 2:13-15 వచనాలు ఆయన యెష్షయి ఏడవ కుమారుడని ఎందుకు చెబుతున్నాయి?
14. సౌలును ఏ “దురాత్మ” భయపెట్టింది? (1 సమూ. 16:14)
15. ఎన్దోరులో ఆత్మల ద్వారా “సమూయేలు” చెప్పిన భవిష్యవాణి ఖచ్చితమైనదా? (1 సమూ. 28:16-19)