ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరు నెలలో: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) దీనికి ప్రత్యామ్నాయంగా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. అక్టోబరు నెలలో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. పునర్దర్శనాలు చేయడం ప్రారంభించిన చోట, యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అనే బ్రోషుర్‌ను అందించండి. ప్రారంభం నుండే గృహస్థులను మన సంఘ కూటాలకు ఆహ్వానిస్తూ ఉండండి. నవంబరు నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ప్రజల దగ్గర ఈ ప్రచురణలు ఇప్పటికే ఉంటే, ఏదైనా పాత ప్రచురణను ప్రతిపాదించవచ్చు. డిసెంబరు నెలలో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. దీనికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకం, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా?, లేదా పరదైసు భూమిపై మీరు నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలను ప్రతిపాదించవచ్చు.
◼ బహిష్కరించబడిన వారెవరైనా లేక తమకు తాముగా సంఘం నుండి వేరైపోయిన వారెవరైనా తిరిగి రావడానికి మొగ్గు చూపిస్తున్నట్లయితే ఫిబ్రవరి 1, 1992, కావలికోట 16-23 పేజీల్లోని సూచనల ప్రకారం వ్యవహరించాలని పెద్దలకు గుర్తు చేయబడుతోంది.
◼ సాహిత్యాలను పంపించమని ప్రచారకులు స్వయంగా చేసే రిక్వెస్ట్‌లను బ్రాంచి కార్యాలయం అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను బ్రాంచికి పంపించే ముందు ప్రతి నెలా దాని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, తమ కోసం సాహిత్యాలను తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల విషయం చూసుకుంటున్న సహోదరునికి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్ రిక్వెస్ట్ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.
◼ 2003 జ్ఞాపకార్థ ఆచరణ కాలం కోసం ప్రత్యేక ప్రసంగం ఏప్రిల్ 27 ఆదివారం నాడు ఇవ్వబడుతుంది. ప్రసంగ అంశము, ఔట్‌లైను తర్వాత అందజేయబడతాయి. ఆ వారాంతంలో ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం గానీ సమావేశం గానీ ఉన్న సంఘాల్లో తర్వాతి వారంలో ఆ ప్రసంగం ఇవ్వబడుతుంది. ఏ సంఘంలోనూ ఏప్రిల్ 27, 2003కు ముందు ప్రత్యేక ప్రసంగం ఇవ్వబడకూడదు.