విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వంను మనం ప్రేమించడానికి గల కారణం
నేటి ప్రేమరహిత లోకంలో, మనం మన ఆధ్యాత్మిక సహోదరులపట్ల ప్రగాఢమైన ప్రేమను ప్రదర్శించడంలో ఎలా కొనసాగవచ్చు? (1 పేతు. 2:17) మన యథార్థమైన, భూవ్యాప్త సహోదరత్వం నిజంగా ఉనికిలో ఉందని ఇతరులకు మనం ఎలా చూపించవచ్చు? (మత్త. 23:8) విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం) అనే వీడియోను ఉపయోగించడం ద్వారా మనం అలా చేయవచ్చు. మనం ఒకరినొకరం ఎందుకు ప్రేమిస్తాము అన్నదానికి కారణాలను అది చూపిస్తుంది. మీరు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరేమో చూడండి:
(1) ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరత్వంతో మనం కలిసి చేసే మూడు కార్యాలు ఏవి? (2) మన సహోదరులు (ఎ) అలాస్కాలోని మారుమూల ప్రాంతాలలో, (బి) ఐరోపాలోని విస్తారమైన ఓడరేవులలో, (సి) పెరూలోని దట్టమైన అడవులలో ప్రకటించాలన్న తమ నిశ్చయతను ఎలా చూపిస్తున్నారు? (3) సాక్ష్యమివ్వడానికి ప్రాముఖ్యంగా ప్రభావవంతమైన ఉపకరణం ఏది? (4) ప్రకటనా పని కేవలం సాధారణమైన పని అని మనం ఎన్నడూ ఎందుకు భావించకూడదు? (5) భూకంపాలు, తుఫానులు, అంతర్యుద్ధాలు వంటివి సంభవించిన ఆందోళనకరమైన సమయాల్లో యెహోవాసాక్షులు ఒకరినొకరు ఎలా ఓదార్చుకున్నారో, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకున్నారో ఉదాహరణలు ఇవ్వండి. (తేజరిల్లు! సెప్టెంబరు 8, 1995, 13వ పేజీలో టకావో చేసిన వ్యాఖ్యానాలను, తేజరిల్లు! నవంబరు 8, 1996, 14వ పేజీలో కోటొయో చేసిన వ్యాఖ్యానాలను చూడండి.) (6) మన క్రైస్తవ సహోదరత్వపు గొప్ప గుర్తింపు చిహ్నాన్ని మనమందరం ఏ ఆచరణాత్మకమైన విధాల్లో ప్రదర్శించవచ్చు? (యోహా. 13:35) (7) మన సంఘ కూటాలను మనం ఎంత విలువైనవిగా ఎంచాలి? (8) సమకూడడానికి, ముందు రాజ్యమందిరం లేనివారికి ఇప్పుడు రాజ్యమందిరం ఉండడం, వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? (9) తూర్పు ఐరోపాలో, రష్యాలో మన పని నిషేధించబడినప్పుడు, మన సహోదరులు ఆధ్యాత్మికంగా తట్టుకుని ఎలా నిలవగలిగారు? (10) ఇప్పుడు కూడా, సమావేశాలకు హాజరవ్వడానికి చాలామంది సాక్షులు ఎలాంటి అసాధారణమైన కృషి చేస్తున్నారు, ఎందుకు? ఇది మిమ్మల్ని ఎలా ప్రోత్సహించింది? (11) ఐకమత్యంతో ఆరాధించడానికీ, అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికీ, మీకు సాధ్యమైనప్పుడల్లా సాధ్యమైన విధంగా నమ్మకంగా ప్రకటించడానికీ మీరు ఎందుకు నిశ్చయత కలిగి ఉన్నారు? (12) సాధ్యమైనంత ఎక్కువమంది ఆసక్తిగలవారికి ఈ వీడియోను చూపించడం ఎందుకు మంచిది?