కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/02 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 6/02 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్‌ నెలలో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? లేక నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ఈ ప్రచురణలు స్టాకులో లేకపోతే, మరింత సాహిత్యం కోసం క్రొత్త రిక్వెస్టులను పంపించే బదులు సంఘంలో పోగైపోయి ఉన్న పత్రికల పాత సంచికలను, సాహిత్యాన్ని ప్రతిపాదించడానికి కృషి చేయాలి. జూలై మరియు ఆగస్టు నెలల్లో: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి​—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అనే 32-పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. సముచితమనుకున్న చోట్ల, సర్వమానవాళి కొరకైన గ్రంథం, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషుర్లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు నెలలో: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) లేదా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకాలను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించవచ్చు.

◼ జిల్లా సమావేశ తేదీలలో మార్పు: మే 2002 మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడినట్లు సికింద్రాబాద్‌లో జరగడానికి షెడ్యూలు చేయబడిన 2002వ సంవత్సరపు “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశ తేదీలలో మార్పు చేయడం జరిగింది. క్రొత్త తేదీలు: 1) సికింద్రాబాద్‌ (ఇంగ్లీషు) నవంబరు 8-10, మరియు 2) సికింద్రాబాద్‌ (తెలుగు) నవంబరు 15-17.

◼ బెంగుళూరులోని క్రొత్త బ్రాంచి కార్యాలయ భవనాలను సందర్శించడానికి పథకం వేసుకుంటున్నవారు, అంటే 10 మంది లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్న గుంపులు మొదట ఈ చిరునామాకు ఉత్తరం వ్రాయాలి: Bethel Office, Post Box No. 6441, Yelahanka, Bangalore 560 064, Karnataka. బెంగుళూరులోని అద్దెవిశ్వనాథపురలో ఉన్న బేతేలు భవనాలను సందర్శించే గుంపుల అవసరాలను బేతేలు ఆఫీసు చూసుకుంటుంది. మీరు సందర్శించాలనుకుంటే దయచేసి చాలా ముందుగానే ఉత్తరం వ్రాసి ఎంతమంది వస్తున్నారు, ఏ తేదీలలో వస్తున్నారు, బేతేలును ఏ సమయంలో సందర్శిస్తారు అన్న సమాచారాన్ని తెలియజేయండి. అగస్టు 1, 2002కు ముందు టూర్లు ఏర్పాటుచేయబడవని దయచేసి గమనించండి. మీరు సందర్శించబోయే ముందు మన రాజ్య పరిచర్యలోని ఈ సంచికలో, బేతేలు గృహాలను సందర్శించేటప్పుడు ఎలాంటి వస్త్రధారణ మరియు కేశాలంకరణ సముచితమైనవనే దానికి సంబంధించిన ప్రశ్నా భాగాన్ని దయచేసి సమీక్షించండి.

◼ ఏప్రిల్‌-జూన్‌ 2002 సంచిక మొదలుకొని ఉర్దూ భాషలోని తేజరిల్లు! మాసపత్రిక, త్రైమాసిక పత్రికగా మార్చబడుతుంది.

◼ FAB:FAC 2001 జనవరి 24వ తేదీన పంపిన మా ఉత్తరంలో ఉపదేశించబడినట్లు, సంఘాలు తమ గ్రంథాలయాల కోసం కేవలం ఒక సెట్టు వీడియో కాసెట్లను మాత్రమే రిక్వెస్టు చేయవచ్చని దయచేసి గమనించండి. దీన్ని లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌లో (S-14) “For Cong. Use.” అని పేర్కొనబడిన స్థలంలో సూచించాలి.

◼ బ్రాంచి కార్యాలయం వద్ద స్టాకులో ఉన్న ప్రచురణలను తెలియజేసే క్వార్టర్లీ లిస్టును అన్ని సంఘాలు అందుకుంటాయి. అప్‌డేట్‌ చేయబడిన లిస్టు అన్ని సంఘాలకు మూడు నెలలకు ఒకసారి పంపబడుతుంది. ఈ లిస్టును ఒక ప్లాస్టిక్‌ ఫోల్డర్‌లో పెట్టి లిటరేచర్‌ కౌంటర్‌ దగ్గర ఉంచండి. ప్రచురణల క్రొత్త లిస్టులో చూపబడిన ప్రచురణలు మాత్రమే రిక్వెస్టు చేయబడేలా సేవా పైవిచారణకర్త, కార్యదర్శి నిశ్చయపర్చుకోవాలి. బ్రాంచి కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తరంలో గానీ మన రాజ్య పరిచర్యలో గానీ ప్రకటించబడితే తప్ప ఇతర ఐటమ్‌లను దయచేసి రిక్వెస్టు చేయకండి.

◼ లభ్యమవుతున్న క్రొత్త ప్రచురణలు:

యెషయా ప్రవచనం​—సర్వమానవాళికి వెలుగు II​—తెలుగు, హిందీ

◼ తిరిగి లభ్యమవుతున్న ప్రచురణలు:

మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము​—ఆంగ్లం

సర్వమానవాళి కొరకైన గ్రంథం​—⁠నేపాలీ

యెహోవా​—ఆయన ఎవరు? (ట్రాక్ట్‌ నం. 23)​—ఉర్దూ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి