ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జనవరి నెలలో: సంఘంలో స్టాకున్న ఏదైనా 192 పేజీల పాత పుస్తకం. కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకము స్టాకున్న సంఘాలు దానిని కూడా ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరి నెలలో: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం), ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, లేదా సంఘపు స్టాకులో ఉన్న 192 పేజీల పాత పుస్తకాలలో దేన్నైనా సరే అందించవచ్చు. మార్చి నెలలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు అధ్యయనాలు చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్ నెలలో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరచిన చోట పత్రికా మార్గాలను ఏర్పరచడానికి పునర్దర్శనాలను చేయండి. పత్రికా మార్గం ఆచరణాత్మకం కానప్పుడు చందాను ప్రతిపాదించవచ్చు. బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే ఉద్దేశంతో దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.
◼ జనవరి 14తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సేవా కూటానికి హాజరయ్యే, బాప్తిస్మం పొందిన ప్రచారకులందరూ అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డులను, తమ పిల్లల కోసం ఐడెంటిటీ కార్డులను పొందవచ్చు.
◼ ఫిబ్రవరి మొదలుకొని ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇచ్చే క్రొత్త బహిరంగ ప్రసంగాంశం, “ప్రమాదకరమైన ప్రపంచంలో భద్రతను పొందడం.” ఈ ప్రసంగాన్ని మార్చి 3కల్లా ఇవ్వడం ప్రారంభించాలి.
◼ ఈ సంవత్సరం మార్చి 28 గురువారం సూర్యాస్తమయం తర్వాత జ్ఞాపకార్థాన్ని జరుపుకునేందుకు సంఘాలు తగిన ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రసంగం ముందే ప్రారంభించినప్పటికీ జ్ఞాపకార్థ చిహ్నాలను సూర్యాస్తమయం అయ్యేంతవరకు అందించడం ప్రారంభించకూడదు. మీ ప్రాంతంలో ఎప్పుడు సూర్యాస్తమయమౌతుందో స్థానికాధికారులను అడిగి తెలుసుకోండి. ప్రతి సంఘమూ జ్ఞాపకార్థాన్ని తమకు తాముగా జరుపుకోవాలనుకోవడం కోరుకోదగినదే, కానీ అన్నివేళలా అది సాధ్యంకాకపోవచ్చు. సాధారణంగా అనేక సంఘాలు ఒకే రాజ్యమందిరాన్ని ఉపయోగించుకుంటున్న ప్రాంతాల్లో, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సంఘాలు ఆ సాయంత్రానికి మరో స్థలాన్ని సిద్ధం చేసుకోవచ్చు. సందర్శకులను పలకరించడానికి, ఆసక్తిగల క్రొత్త వారిని ప్రోత్సహించడానికి వీలయ్యేందుకు, అందరూ ఆ ఆచరణ నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు, సాధ్యమైతే కూటానికి కూటానికి మధ్య కనీసం 40 నిమిషాల వ్యవధి ఉండాలని మేము సూచిస్తున్నాము. స్థానికంగా ఏ ఏర్పాట్లు ప్రయోజనకరంగా ఉంటాయో పెద్దల సభ నిర్ణయించాలి.
◼ సంఘ పైవిచారణకర్త ప్రతి నెలా షిప్పింగ్ ఎక్నాలెడ్జ్‌మెంట్లను అందుకున్నప్పుడు, రాజ్య మందిరాల కోసము, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి విరాళాలిచ్చిన ఎక్నాలెడ్జ్‌మెంట్లనన్నీ సంఘంలో, తర్వాతి ఎక్కౌంటు రిపోర్టుతోపాటు చదివేలా చూడాలి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు II—ఆంగ్లం, కన్నడ, తమిళం, మలయాళం
జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (చిన్న సైజు) —తమిళం
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?—ఆంగ్లం, తమిళం, మరాఠీ, మలయాళం, హిందీ
బైబిలును మీరెందుకు నమ్మవచ్చును? (కరపత్రం నం.13)—నికోబారీస్
యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు? (కరపత్రం నం. 14) —నికోబారీస్
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నం. 15)—నికోబారీస్
మీకు అమర్త్యమైన ఒక ఆత్మ ఉందా? (కరపత్రం నం. 25)—ఆంగ్లం, తమిళం, మిజో
◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:
జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (చిన్న సైజు)—మలయాళం
యెహోవా స్తుతి గీతములు (29 పాటలు)—హిందీ
భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!—తమిళం, తెలుగు, నేపాలీ
బైబిలును మీరెందుకు నమ్మవచ్చును? (కరపత్రం నం.13)—బెంగాలీ
యెహోవాసాక్షుల ఏమి నమ్ముతారు? (కరపత్రం నం. 14)—బెంగాలీ
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నం. 15)—అస్సామీ, ఆంగ్లం, ఒరియా, కన్నడ, గుజరాతీ, నేపాలీ, పంజాబి, బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ
కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం నం. 21)—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, నేపాలీ, పంజాబి, బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ
లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (కరపత్రం నం. 22)—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, నేపాలీ, పంజాబి, బెంగాలీ, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ
◼ పైన పేర్కొన్న సాహిత్యాల కోసం మీ లిటరేచర్ రిక్వెస్ట్‌లను(S-14)పంపించడానికి ముందు, పెండింగులో ఉన్న ఇంతకు ముందటి మీ రిక్వెస్టుల్లోనివి మీ సంఘానికి పంపిస్తామని దృష్టిలో పెట్టుకోండి.