ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనచోట్ల ఈ బ్రోషూర్లను అంటే సర్వమానవాళి కొరకైన గ్రంథము, మన సమస్యలు— వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), అనే వాటిని ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు: జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం). అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! విడిప్రతులనూ, పునర్దర్శనాలలో ఆసక్తిని కనబరచిన చోట చందాలను ప్రతిపాదించవచ్చు.
◼ సెప్టెంబరు నెల ఆరంభం నుంచి “మానవ పరిపాలన త్రాసులో తూచబడింది” అన్న అంశంపై ప్రాంతీయ పైవిచారణ కర్తలు బహిరంగ ప్రసంగం ఇస్తారు.
◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:
ఖుదా మనల్ని బాధ్యులనుగా ఎంచుతాడా? లేక తక్దీర్ మన జీవితాల్ని ఏలుతోందా? (కరపత్రం సంఖ్య. 71); మహాగొప్ప నామము (కరపత్రం సంఖ్య. 72); యెహోవా సాక్షులు ఎవరు? (కరపత్రం సంఖ్య. 73); జహన్నమ్ దైవిక నీతిలో ఒక భాగమా? (కరపత్రం సంఖ్య. 74)—ఒరియా
◼ నెలలో ఒకే ఒక లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14) ను సంస్థకు పంపించాలని సంఘాలను కోరుతున్నాము. ఫారమ్‌ను సంస్థకు పంపించిన తర్వాత సంఘంలోని వ్యక్తులనుంచి పొందిన ఏ రిక్వెస్ట్‌లనైనా తర్వాతి నెల లిటరేచర్ రిక్వెస్ట్‌తో పాటు వాటిని చేర్చాలి.
◼ సర్వీస్ ఫారాలు కావాల్సిన సంఘాలు తమ రిక్వెస్టును సాహిత్య రిక్వెస్ట్‌తోపాటు లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్ (S-14) లోనే చేర్చాలి.