ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటంపై దృష్టి నిలపాలి. జూలై, ఆగస్టు: ఈ క్రింద ఇవ్వబడిన 32-పేజీల బ్రోషూర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, నిరంతరము నిలిచే దైవిక నామము (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే. సముచితమైనచోట్ల ఈ బ్రోషూర్లను అంటే మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం), సర్వమానవాళి కొరకైన గ్రంథము అనే వాటిని ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు: జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం).
◼ స్వభాషలో హ్యాండ్ బిల్లులు కావాలని కోరుతున్నప్పుడు సంఘం పేరును, కూటాలు జరిగే స్థలం యొక్క పూర్తి చిరునామాను ఆ భాషలోనే హ్యాండ్ బిల్ రిక్వెస్ట్ ఫారమ్‌లో (S(d)-16) ఇవ్వబడిన బాక్స్‌లో వ్రాయాలి. ఫారమ్‌ను పూర్తి చేసే ముందు జ్ఞాపకముంచుకోవలసిన విషయాలు జాగ్రత్తగా చదవాలి.
◼ సంఘాలు సాహిత్యం కోసం జూన్ నెలలో చేసే రిక్వెస్ట్‌లతో పాటు కావలికోట, తేజరిల్లు! 1999 బౌండ్ వాల్యూమ్‌లను కూడా రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. బౌండ్ వాల్యూమ్‌లు తయారయ్యి వాటిని సంఘాలకు రవాణా చేసేంతవరకూ ఇవి సంఘ ప్యాకింగ్ లిస్ట్‌లపై “పెండింగ్” అని కనిపిస్తాయి. బౌండ్ వాల్యూమ్‌లు స్పెషల్ రిక్వెస్ట్ ఐటమ్‌లు.
◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచిక మొదలుకొని కన్నడ, గుజరాతి, తెలుగు, మరాఠి, హిందీ భాషల్లోని సంచికలలో ఆ భాషల్లోని పాటల బ్రోషూర్ల నుండే పాట సంఖ్యలు ఇవ్వబడతాయి, ఇది కావలికోట 2000 జూన్ 1 సంచిక మొదలుకొని కావలికోటకు కూడా వర్తిస్తుంది. బ్రాకెట్లలో ఉన్న సంఖ్యలు ఇంగ్లీషు పాటల పుస్తకంలోని పాటల సంఖ్యలు.
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
చర్చనీయ బైబిలు అంశములు—తమిళం, మలయాళం