కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/00 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2000
మన రాజ్య పరిచర్య—2000
km 3/00 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. ఏప్రిల్‌, మే: కావలికోట, తేజరిల్లు! విడిపత్రికలు. ఆసక్తిగల వారికి అందించటానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్లను, కూడా ఉంచుకుని గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రయత్నం చేయాలి. జూన్‌లో: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? గృహ బైబిలు పఠనాలు ప్రారంభించటంపై దృష్టినిలపాలి.

◼ ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీరింగ్‌ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలను వేసుకుని, తమ దరఖాస్తులను ముందుగా ఇవ్వాలి. ఇలా చేయటం క్షేత్రసేవకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి, తగినన్ని పత్రికలు, ఇతర సాహిత్యం అందుబాటులో ఉంచేందుకు పెద్దలకు వీలు కలుగజేస్తుంది. సహాయ పయినీరింగ్‌ చేయటానికి ఆమోదం పొందిన వారి పేర్లను ప్రతి నెలలోనూ సంఘంలో ప్రకటించాలి.

◼ దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తక పఠనపు పూర్తి షెడ్యూలు మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలో ఉంది. దాన్ని మీరు జిరాక్స్‌ తీసుకుని, అవసరమైనప్పుడు చూసుకునేందుకు వీలుగా మీ సొంత పుస్తకంలో దాన్ని ఉంచుకోవచ్చు.

◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ మార్చి 1న లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్‌ చేయాలి. ఇలా ఆడిట్‌ చేసిన తర్వాత, తరువాతి అక్కౌంట్స్‌ నివేదిక చదివిన తర్వాత సంఘానికి ప్రకటించాలి.

◼ జ్ఞాపకార్థదినం ఏప్రిల్‌ 19, 2000 బుధవారంనాడు జరుగుతుంది. మీ సంఘ కూటాలు బుధవారంనాడు జరుగుతున్నట్లైతే, రాజ్యమందిరం అందుబాటులో ఉంటే వాటిని మీరు వారంలో మరో రోజుకు మార్చుకోవచ్చు. అది సాధ్యంకాక, మీ సేవకూటానికి భంగం కల్గుతున్నట్లైతే, మీ సంఘానికి ప్రాముఖ్యంగా అన్వయించే భాగాలను మరో సేవా కూటంలో చేర్చవచ్చు.

◼ ఒక సంఘంతో సహవసించే వారు కావలికోట, తేజరిల్లు! పత్రికలకు తమ వ్యక్తిగత చందాలతో సహా క్రొత్త చందాలనూ, నవీకరించబడిన చందాలనూ సంఘం ద్వారానే పంపించాలి.

◼ సాహిత్యాల్ని పంపించమని ప్రచారకులు వ్యక్తిగతంగా చేసుకొన్న రిక్వెస్ట్‌లను సంస్థ అంగీకరించదు. సాహిత్యాల కోసం సంఘం చేసే నెలసరి రిక్వెస్ట్‌లను సొసైటీకి పంపించే ముందు ప్రతి నెలా దాన్ని గురించి సంఘంలో ప్రకటన చేసేలా సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, వ్యక్తిగతంగా కావల్సిన సాహిత్యాల్ని తెప్పించుకోవాలని ఇష్టపడుతున్న వారందరూ సాహిత్యాల విషయం చూసుకుంటున్న సహోదరునికి తెలియజేయవచ్చు. సాహిత్యాల్లో ఏవి స్పెషల్‌ రిక్వెస్ట్‌ ఐటమ్‌కు చెందుతాయో దయచేసి గుర్తుంచుకోండి.

◼ “దేవుని ప్రవచన వాక్యము” జిల్లా సమావేశాలు ఇటీవల ముగిశాయి. ఈ సమావేశాల్లోని పూర్తి హాజరు 30,462. క్రితం సంవత్సరపు హాజరుతో పోలిస్తే ఇది ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్య, అలాగే 10 శాతం పెరుగుదల కూడాను. ఈ ఇరవై ఏడు జిల్లా సమావేశాల్లో బాప్తిస్మం పొందినవారి సంఖ్య 881.

◼ లభ్యమయ్యే కొత్త ప్రచురణలు:

చర్చనీయ బైబిలు అంశములు, బైబిలు ప్రాథమిక బోధనలు—మిజో భాషలో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి