కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/99 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1999
మన రాజ్య పరిచర్య—1999
km 12/99 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరులో: న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌తో పాటు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జనవరిలో: సంఘంలో స్టాకు ఉన్న 192 పేజీల పాత పుస్తకం ఏదైనా సరే. అలాంటి పుస్తకాలు అందుబాటులో లేని సంఘాలు లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌? ఆర్‌ బై క్రియేషన్‌? లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు వంటివాటిని అందజేయవచ్చు. ఫిబ్రవరిలో: కుటుంబ సంతోషానికిగల రహస్యము. మార్చిలో: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. బైబిలు పఠనాలు ప్రారంభించటానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.

◼ ప్రిసైడింగ్‌ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వేరొకరు సంఘ లెక్కలను డిసెంబరు 1న లేక ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా ఆడిట్‌ చేయాలి. అలా చేసిన తర్వాతివారం అక్కౌంట్‌ రిపోర్టు చదివాక దాన్ని సంఘానికి ప్రకటించండి.

◼ 2001 సంవత్సరపు జ్ఞాపకార్థదినం ఏప్రిల్‌ 8, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత. ఇంత ముందుగా తెలియజేస్తున్నది, ఒకే రాజ్యమందిరాన్ని దాని సదుపాయాల్ని అనేక సంఘాలు ఉపయోగిస్తున్నచోట సహోదరులు అందుబాటులో ఉన్న హాళ్లకు అవసరమైన రిజర్వేషన్లు లేక కాంట్రాక్టులు చేసుకోవటానికే. జ్ఞాపకార్థ ఆచరణ పద్ధతిగానూ, ప్రశాంతంగానూ జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాల వల్ల భంగం కలుగకుండ ఉండేలా పెద్దలు హాలు యాజమాన్యంతో ఒక అంగీకారానికి రావాలి. ఎందుకంటే ఆ సందర్భం యొక్క ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జ్ఞాపకార్థదిన ప్రసంగీకుణ్ని నియమిస్తున్నప్పుడు పెద్దలసభ ప్రతి సంవత్సరం అదే సహోదరుణ్ని ఊరక ఉపయోగించుకునే బదులు లేక తాము వంతులు తీసుకునే బదులు, మరింత యోగ్యుడైన పెద్దనే ఎన్నుకోవాలి. ప్రసంగం ఇవ్వగల, అభిషిక్తుడైన సమర్థుడైన పెద్ద ఉంటే మినహాయింపు ఉంటుంది.

◼ 1999 ఆగస్టు నెలలో ఇండియాలోని ప్రచారకులు కొత్త శిఖరాగ్ర సంఖ్యను చేరుకోవటం మనకు ఎంతో ఆనందకరమైన విషయం. ప్రచారకులు తమ క్షేత్రసేవా రిపోర్టులను సరైన సమయానికి ఇవ్వడంలో చూపిన శ్రద్ధ ఫలితమే ఇది. సంఘ రిపోర్టులను సేకరించి సొసైటీకి పంపించడానికి సంఘ పుస్తక పఠన నిర్వాహకులు, సెక్రటరీలు చేసిన కృషి కూడా దానికి కారణం. ప్రతి నెలా మీరిలాగే చేస్తారని నిరీక్షిస్తూ మీకందరికీ మా హృదయపూర్వక అభినందనను తెలియజేస్తున్నాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి