ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూన్: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. జూలై, ఆగస్టు: ఈ క్రింది 32-పేజీల బ్రోషూర్‌లలో వేటినైనా ఉపయోగించవచ్చు: జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . వీలైన చోట్ల మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? మృతుల ఆత్మలు అవి మీకు సహాయం చేయగలవా లేక హాని చేయగలవా? అవి నిజానికి ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధం లేని లోకం ఎప్పటికైనా వస్తుందా?, సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూర్‌లను ప్రతిపాదించండి. సెప్టెంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము.
◼ సంఘ పైవిచారణకర్త గానీ లేక ఆయన నియమించిన మరొకరు గానీ జూన్ 1వ తారీఖున లేక అటు తర్వాత సాధ్యమైనంత త్వరలో సంఘ లెక్కల్ని ఆడిట్ చేయాలి. ఇలా ఆడిట్ చేసిన తర్వాత సంఘానికి తర్వాత అక్కౌంట్స్ రిపోర్టు చదువుతున్నప్పుడు ప్రకటించాలి.
◼ ఆర్డరు చేసిన సాహిత్యాలు, పత్రికలు అందకపోయినా, తక్కువగా అందినా, నష్టంవాటిల్లినా ఇరవై ఎనిమిది రోజుల్లోగా వాటి విషయమై సొసైటీకి వ్రాస్తున్నప్పుడు, అవి ఏ ఐటమ్‌కు, ఏ భాషకు చెందినవి, అందులో ఎన్ని పోయాయి, లేక ఎన్నింటికి నష్టంవాటిల్లింది, వచ్చినప్పుడు అవివున్న పేకెట్లు లేక కార్టన్లు మంచి స్థితిలో వున్నాయా లేవా వంటి వాటిని గూర్చిన పూర్తి వివరాలను సంస్థకు అందించాలని సంఘాలు కోరబడుతున్నాయి. ఇది, సంఘాలకు మంచి సేవ అందించేందుకు సొసైటీకీ సహాయపడుతుంది.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
అప్లై యువర్‌సెల్ఫ్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్-(ఆంగ్లం)
ఈ 64 పేజీల బ్రోషూరు, ఇప్పుడు లెర్న్ టు రీడ్ అండ్ రైట్ (ఆర్‌ఎ) అనే చిన్న పుస్తకం స్థానంలో ఉపయోగించబడుతుంది. ఈ బ్రోషూరు ఖరీదు పయినీర్లకు రూ. 8.00, ప్రచారకులకు, బయటి వాళ్ళకు రూ. 12.00.
కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (ట్రాక్ట్ నెం.21) లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు? (ట్రాక్ట్ నెం.22)-ఒరియా
◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:
చర్చనీయ బైబిలు అంశములు-తమిళం, నేపాలి, మలయాళం