కుటుంబ సంతోషం పుస్తకాన్ని అన్ని వయస్కుల వారికీ ప్రతిపాదించండి
1 కాలిఫోర్నియా నుండి ఒక 11 సంవత్సరాల పిల్లవాడు కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం విషయమై తనకు గల మెప్పుదలను వ్యక్తపర్చాడు. ఆ పిల్లవాడు ఇలా వ్రాశాడు: “దానికి నేను చాలా కృతజ్ఞుడను. ఇది విశిష్టమైన పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని చదవమని నేను ఇతర కుటుంబాలను కూడా ప్రోత్సహిస్తున్నాను. ఇది మా ఇంట్లో . . . మేము శాంతి సంతోషాలను కనుగొనడానికి మాకు సహాయపడుతుంది.” ఈ చిన్నపిల్లవాడి అనుభవం కుటుంబ సంతోషం పుస్తకాన్ని అన్ని వయస్కుల వారికీ ప్రతిపాదించడానికి మనల్ని ప్రోత్సహించాలి. ఇక్కడ కొన్ని సలహాలివ్వబడ్డాయి, ఫిబ్రవరి నెలలో బహుశా మీరు వాటిని మీ పరిచర్యలో ఉపయోగించాలనుకోవచ్చు.
2 ఒక యువకుడ్ని/యువతిని కలిసినప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “మీ వయస్సులో ఉన్న చాలామంది వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయంపై నమ్మదగిన సమాచారాన్ని మీరు ఎక్కడ కనుగొనగలరు? [ప్రతిస్పందించనివ్వండి.] చాలా మంది యౌవనులు తాము వివాహానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది తమకు ఖచ్చితంగా తెలియదని తరచూ చెబుతారు. ఆ విషయాన్ని గూర్చి ఈ పుస్తకం ఏమి చెప్తుందో చూద్దాం.” కుటుంబ సంతోషం పుస్తకాన్ని 14వ పేజీకి తిప్పి 3వ పేరాను చదవండి. తర్వాత అధ్యాయంలో ఉన్న ప్రతీ ఉపశీర్షికను చూపించండి. పుస్తకాన్ని ప్రతిపాదించి పునర్దర్శనం కొరకు ఏర్పాటు చేయండి.
3 ఒక తల్లి/తండ్రితో మాట్లాడుతున్నప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “పిల్లల్ని పెంచడంలో నిజంగా పనిచేసే కొన్ని ఆచరణాత్మక మార్గదర్శక సూత్రాలను మేము తల్లిదండ్రులతో పంచుకుంటున్నాము. అవి కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి.” 55వ పేజీకి తిప్పి, 10వ పేరానూ ఆ తర్వాత 11వ పేరాలో ఎత్తివ్రాయబడిన ద్వితీయోపదేశకాండము 6:6, 7 వచనాలనూ చదవండి. ఆ తర్వాత 12 నుండి 16 పేరాల్లో ఇటాలిక్కుల్లో ఉన్న వాక్యాలను సూచించండి. తర్వాత ఇలా కొనసాగించండి: “తల్లిదండ్రులుగా గొప్ప సఫలతను సాధించేందుకు అనేకమందికి ఈ పుస్తకం సహాయం చేసింది. మీరు దీన్ని చదవడానికి ఇష్టపడితే ఈ ప్రతిని మీకివ్వడానికి సంతోషిస్తాను.”
4 ఒక పెద్ద వయస్కునితో మాట్లాడేటప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “నేను ఈ చిన్న వ్యాఖ్యానాన్ని చదివిన తర్వాత దయచేసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి” అని, కుటుంబ సంతోషం పుస్తకం లోని 169వ పేజీలో 17వ పేరాలోని మొదటి రెండు వాక్యాలను చదవండి. వాళ్ళెలా ప్రతిస్పందిస్తున్నారో అడగండి. వాళ్ళిచ్చే సమాధానాన్ని బట్టి ఈ పుస్తకాన్ని ప్రతిపాదించడానికి ముందు దీంట్లోనుండి మరికొన్ని భాగాలను చదవవచ్చు.
5 కుటుంబ సంతోషం పుస్తకాన్ని అందించిన చోటికి తిరిగి వెళ్ళేటప్పుడు, బైబిలు పఠనాలను ప్రారంభించడానికి ప్రయత్నించాలనే విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్లో 8వ పాఠముతో లేదా జ్ఞానము పుస్తకంలో 15వ అధ్యాయంతో పఠనం ప్రారంభించడం సముచితంగా ఉండవచ్చు. ఈలోగా సంతోషకరమైన క్రైస్తవ కుటుంబజీవితాన్ని నిర్మించుకొనేందుకు అన్ని వయస్కుల ప్రజలకు సహాయపడేందుకు మనం కృషిచేద్దాం.