అందరూ తప్పనిసరిగా ‘వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి’!
1 లక్షలాది మంది ప్రజలు యెహోవాసాక్షులతో బైబిలు పఠిస్తున్నారు. నిత్యజీవానికి అర్హత పొందేందుకు, సా.శ. 33 పెంతెకొస్తు రోజున మారుమనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న 3,000 మందిలాగే, వాళ్ళూ తప్పనిసరిగా ‘వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి.’ (అపొ. 2:41, NW) ఇది నేడు మనపై ఏ బాధ్యతను ఉంచుతుంది?
2 యెహోవా ఎడల భక్తిని పెంపొందించుకునేందుకు మన బైబిలు విద్యార్థులకు మనం సహాయం చేయవలసిన అవసరం ఉంది. (1 తిమో. 4:7-10) ఆ అవసరాన్ని నెరవేర్చేందుకే, “పఠనమంతటిలో, యెహోవా లక్షణాల ఎడల మెప్పుదలను పెంపొందింపజేయడానికి అవకాశాల కొరకు చూడండి. దేవుని ఎడల మీకుగల మీ స్వంత లోతైన భావాలను వెలిబుచ్చండి. యెహోవాతో అనురాగపూరితమైన, వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకునే విషయాన్ని గురించి ఆలోచించేలా విద్యార్థికి సహాయపడండి” అని జూన్ 1996 మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్ 20 పేరా సూచిస్తుంది.
3 మనకెదురయ్యే సవాలు: చాలా మంది ప్రజలు అబద్ధ మతంచేత ప్రభావితులై, తమ జీవిత విధానంలో నిజమైన ఏ మార్పూ అవసరంలేని, అతి స్వల్పమైన సమయమూ, ప్రయత్నమూ మాత్రమే అవసరమయ్యే ఆరాధనా పద్ధతితో సంతృప్తులుగా ఉన్నారు. (2 తిమో. 3:5) సత్యారాధనలో దేవుడి వాక్యాన్ని వినడం కన్నా ఎక్కువే ఇమిడి ఉందని గ్రహించేలా మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయాలన్నదే మనకు ఎదురయ్యే సవాలు. వాళ్ళు తాము తెలుసుకున్నవాటిని తమ జీవితాల్లో తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలి. (యాకో. 1:22-25) తమ వ్యక్తిగత ప్రవర్తనలో, దేవుడు అంగీకరించలేనిదేదైనా ఉంటే, తాము “మారుమనస్సునొంది” ఆయనను ప్రీతిపరచేందుకు సరైనది ఏదో దానిని చేయడానికి బద్ధులై ఉన్నామని వాళ్ళు గుర్తించవలసి ఉంది. (అపొ. 3:19) నిత్యజీవాన్ని పొందేందుకు, వాళ్ళు తప్పనిసరిగా ‘పోరాడాలి [“తీవ్ర ప్రయత్నం చేయాలి,” NW],’ సత్యం కోసం స్థిరంగా నిలబడాలి.—లూకా 13:24, 25.
4 నైతికతలోని వివిధ ముఖాలను గురించి చర్చించిన తర్వాత, తను ఈ విషయాలను నిజానికి ఎలా దృష్టిస్తున్నాడు, తన జీవితంలో మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని తను గ్రహిస్తే తను ఏమి చేయాలి అని మీ బైబిలు విద్యార్థిని అడగండి. తాను సత్యాన్ని దేని ద్వారా తెలుసుకుంటున్నాడో ఆ సంస్థవైపుకు ఆయన అవధానాన్ని మళ్ళించి, సంఘ కూటాలకు క్రమంగా హాజరు కమ్మని ఆయనను ప్రోత్సహించండి.—హెబ్రీ. 10:24.
5 మన బోధ ద్వారా మన విద్యార్థి హృదయాన్ని చేరుకోవాలన్నది మన లక్ష్యంగా చేసుకుందాం. క్రొత్తవారు దేవుడి వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి, బాప్తిస్మం పొందేందుకు మనం పురికొల్పునిస్తుండగా మనం ఆనందిస్తాం.—1 థెస్స. 2:13.