పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—కార్యదర్శి
1 “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ”డానికి సంఘంలో కార్యదర్శి ఒక ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తాడు. (1 కొరిం. 14:40) సంఘ సర్వీసు కమిటీ సభ్యుడిగా అతడు సంఘ ఉత్తరప్రత్యుత్తరాలు, ముఖ్యమైన రికార్డుల విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. ఇతర పెద్దలవలె ఆయన బాధ్యతలు పైకి కనిపించక పోయినప్పటికీ ఆయన చేసే సేవలు ఎంతో అవసరం మరెంతో అభినందనీయం.
2 ఇతరుల నుండి లేదా సొసైటీ నుండి ఉత్తరాలు వచ్చినప్పుడు వాటిని అందుకుని అవసరమైన వాటికి ప్రత్యుత్తరం ఇస్తాడు. అలా అందుకున్న వాటిని పెద్దలందరికీ పంపించి, తర్వాత వాటిని ఒక ఫైల్లో భద్రపరుస్తాడు. పత్రికల, సాహిత్యపు ఆర్డరు ఫామ్స్‌ను పరిశీలించి వాటిని సొసైటీకి పంపిస్తాడు. సంఘ లెక్కలను, చందాలను చూసేవారిని నేరుగా పర్యవేక్షించడమే కాక సమావేశానికి సంబంధించిన విషయాలను కూడా చూసుకుంటాడు.
3 కార్యదర్శి సంఘపు నెలసరి క్షేత్ర పరిచర్య నివేదికను నెలలో ఆరవ తేదీలోపు తప్పనిసరిగా సొసైటీకి పంపిస్తాడు. అందుకు మనమందరమూ ప్రతినెల చివరా మన పరిచర్యను గూర్చిన రిపోర్టును తప్పనిసరిగా ఇవ్వాలి. సంఘ ప్రచారకుల రికార్డులో ఆయన వాటిని నమోదు చేస్తాడు. ఏ ప్రచారకుడైనా తన పరిచర్య కార్యకలాపాలు ఎలా ఉన్నాయో చూసుకునేందుకు అలా నమోదు చేయబడిన వ్యక్తిగత రికార్డును అడుగవచ్చు.
4 ఒక ప్రచారకుడు సంఘంలోకి వచ్చినపుడు లేదా మారినప్పుడు సంఘ ప్రచారకుల రికార్డు కార్డుల కోసం ఆయా సంఘపు పెద్దలను పరిచయలేఖలను అడుగుతాడు లేదా పంపిస్తాడు.—మన పరిచర్య, పేజీలు 104-5.
5 కార్యదర్శి పయినీర్ల కార్యకాలాపాల్ని సమీక్షిస్తాడు, వారేమైనా సమస్యలను ఎదుర్కుంటున్నట్లయితే సంఘ పెద్దలకు ప్రాముఖ్యంగా సర్వీస్ ఓవర్సీయర్కు తెలియజేస్తాడు. పరిచర్యకు క్రమంగారాని ప్రచారకుల విషయంలో ఆయా పుస్తక పఠన నిర్వాహకులను ఆయత్తపరుస్తాడు. క్రియాశీలంగా లేనివారి గురించి శ్రద్ధ తీసుకునే విషయంలో కార్యదర్శీ, సర్వీస్ ఓవర్సీయరూ ఇద్దరూ నాయకత్వం తీసుకుంటారు.—మన రాజ్య పరిచర్య, డిసెంబరు 1987 (ఆంగ్లం), పేజీ 1.
6 కార్యదర్శి కార్యకలాపాల పట్ల మనం మంచి ప్రశంసను కలిగి ఉండడం ద్వారా, ఆయన తన గృహనిర్వాహకత్వపు బాధ్యతలను సుళువుగా సంపూర్తి చేయడానికి మనం సహాయం చేసిన వారమౌతాము.—1 కొరిం. 4:2.