కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/98 పేజీలు 3-5
  • కావలెను—మరిన్ని బైబిలు పఠనాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కావలెను—మరిన్ని బైబిలు పఠనాలు
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—1997
  • పునర్దర్శనాలు బైబిలు అధ్యయనాలకు నడిపిస్తాయి
    మన రాజ్య పరిచర్య—2003
  • నిశ్చయముగా తిరిగివెళ్లి మాట్లాడుము
    మన రాజ్య పరిచర్య—1992
  • మీరు బైబిలు పఠనములుచేయుటకు ఆహ్వానమిస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 5/98 పేజీలు 3-5

కావలెను—మరిన్ని బైబిలు పఠనాలు

1 యెహోవా దేవుడు తన సంస్థను ఎడతెగని పురోభివృద్ధితో ఆశీర్వదిస్తున్నాడు. గత సేవా సంవత్సరంలో, ప్రపంచవ్యాప్తంగా 3,75,923 మంది అంటే ప్రతీరోజూ సగటున 1,000కన్నా ఎక్కువమంది చొప్పున లేదా, ప్రతీ గంటకూ దాదాపు 43మంది చొప్పున క్రొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకొన్నారు! ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, రాజ్యపని వర్ధిల్లుతోంది. మన సహోదరులు దశాబ్దాల తరబడి కష్టాల్ని ఎదుర్కొన్నా, మనం విశిష్టమైన అభివృద్ధిని చూస్తున్నాం. సువార్తను వ్యాపింపచేయడంలో జరుగుతున్న పురోభివృద్ధిని గురించి చదవడం ఉత్తేజకరమైనది!

2 ఇండియా బ్రాంచిలో, గత సేవా సంవత్సరమందు, సగటున మొత్తం ప్రచారకుల విషయంలో, సహాయ పయినీర్ల విషయంలో, ప్రకటనా పనిలో గడిపిన గంటల విషయంలో, అందించబడిన పుస్తకాల, చిన్న పుస్తకాల, బ్రోషూర్ల, పత్రికల సంఖ్య విషయంలో మనం కూడా అభివృద్ధిని చూశాం. బాప్తిస్మాన్ని తీసుకొన్న వ్యక్తుల సంఖ్యలో పెరుగుదల ఉంది. జ్ఞాపకార్థ కూటపు హాజరు ఎప్పటికన్నా శిఖరాగ్రస్థాయిలో ఉంది. పునర్దర్శనాల, బైబిలు పఠనాల విషయమేమిటి? ప్రచారకులు ఎనిమిది శాతం పురోభివృద్ధిచెందినా, పునర్దర్శనాల శాతం బొటాబొటిగా మాత్రమే అంటే కేవలం 0.5 శాతమే పెరిగింది, మరి బైబిలు పఠనాలు నాలుగు శాతం వరకూ తగ్గిపోయాయి. కానీ, శిష్యుల్ని చేసేపనిలో పరిచర్యలోని ఈ రంగాలు అత్యవసరం. పునర్దర్శనాల, బైబిలు పఠనాల విషయంలో ఈ ప్రతికూల వైఖరిని మార్చడానికి మనలో ప్రతి ఒక్కరమూ ఏం చేయగలం?

3 పఠనాన్ని నిర్వహించాలనే కోరికను బలపర్చుకోండి: ఆధ్యాత్మికంగా బలంగానూ, చురుకుగానూ ఉండడంపై మనకుగా మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు నిజమైన అనుచరులు “సత్‌క్రియలయందాసక్తి” కల్గివుంటారు. (తీతు 2:14) మనం మన పరిచర్యను పునఃసమీక్షించినప్పుడు, ప్రాంతీయ పరిచర్యలో మనం సాహిత్యాన్ని అందించిన ప్రతీచోటా పునర్దర్శనాన్ని చేయడానికి ఎంతో ఆసక్తి కల్గివున్నామని చెప్పగలమా? ఆసక్తిని చూపించిన వారందరికీ గృహ బైబిలు పఠనాల్ని ప్రతిపాదించడం విషయంలో మనం ఉత్సాహం కల్గివున్నామా? (రోమా. 12:11) లేదా పునర్దర్శనాల్ని చేయడం విషయంలోనూ, గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించడం విషయంలోనూ మనం మరింత అభిలాషను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందా?

4 వ్యక్తిగత బైబిలు పఠనమూ, క్రమంగా కూటాలకు హాజరవ్వడమూ, ప్రచురణల్ని అధ్యయనం చేయడమూ మనల్ని ఆధ్యాత్మికంగా సజీవంగా ఉంచి, దేవుని ఆత్మ వలన శక్తిమంతుల్ని చేస్తాయి. (ఎఫె. 3:15-19) ఇది యెహోవాయందు మనకు గల విశ్వాసాన్నీ, నమ్మకాన్నీ, మన తోటి మానవుల ఎడల మనకు గల ప్రేమనూ బలపరుస్తుంది. మరొకరికి సత్యాన్ని బోధించేందుకు మనం ప్రేరేపించబడతాం, మరి ఆ విధంగా మనం మన పరిచర్యను ఆసక్తికరమైందిగానూ, సఫలీకృతమైందిగానూ, ఉత్తేజకరమైందిగానూ చేసుకుంటాం. అవును, మనకు మరిన్ని బైబిలు పఠనాలు కావాలనే అభిలాష ఉండాలి!

5 మొదట కుటుంబంతో పఠించండి: ఇంట్లో పిల్లలున్న క్రైస్తవ తల్లిదండ్రులు క్రమమైన కుటుంబ బైబిలు పఠన కార్యక్రమం ఎడల శ్రద్ధ కల్గివుండాలి. (ద్వితీ. 31:12; కీర్త. 148:12, 13; సామె. 22:6) బాప్తిస్మం పొందని ప్రచారకులుగా అర్హతను సంపాదించుకునేందుకూ, సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునేందుకూ తమ పిల్లల్ని సిద్ధపర్చడానికి వారితో దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరు నుండీ ఆపై జ్ఞానము పుస్తకం నుండీ పఠించడం తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల వయస్సుపైనా, వారి అవసరాలపైనా ఆధారపడి అదనపు సమాచారాన్ని కూడా పరిశీలించవచ్చనుకోండి. మే 1987 మన రాజ్య పరిచర్యలో ప్రశ్నాభాగమందు క్లుప్తంగా ఇవ్వబడినట్లుగా, బాప్తిస్మం పొందని పిల్లవానితో పఠిస్తున్న తల్లి/తండ్రి దాన్ని బైబిలు పఠనంగా పరిగణించి, వెచ్చించిన సమయాన్నీ, పునర్దర్శనాల్నీ లెక్కించవచ్చు.

6 వ్యక్తిగత సంస్థీకరణను మెరుగుపర్చుకోండి: అందించిన పత్రికల, బ్రోషూర్ల, పుస్తకాల సంఖ్యను పరిగణనలోనికి తీసుకుంటే, పెద్ద మొత్తంలో విత్తనాలు వెదజల్లబడ్డాయనడంలో సందేహమేమీ లేదు. క్రొత్త శిష్యుల్ని ఉత్పన్నంచేసే సాధ్యత ఎక్కువగా విత్తబడిన ఆ సత్యవిత్తనాలకు ఉంది. కానీ ఎడతెరిపి లేకుండా విత్తనాల్ని నాటి, తాను చేయాల్సిన కృషినంతటినీ చేసిన తర్వాత, కోత కోయడానికి సమయాన్ని అస్సలు వెచ్చించకపోతే రైతు గానీ లేక తోటమాలిగానీ నిజంగా సంతృప్తి చెందుతాడంటారా? అదే విధంగా, పరిచర్యలో పునర్దర్శనాలు కూడా అవసరం.

7 పునర్దర్శనాల్ని చేయడానికి మీరు మీ షెడ్యూల్‌లో క్రమంగా సమయాన్ని కేటాయిస్తున్నారా? ఆసక్తి ఉందనిపించిన వారందర్నీ సత్వరమే పునర్దర్శించండి. బైబిలు పఠనాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో పునర్దర్శనాల్ని చేయండి. మీ పునర్దర్శనాల రికార్డును నీటుగానూ, అప్‌-టు-డేటుగానూ, బాగా వ్యవస్థీకరించబడినదిగానూ ఉంచుతున్నారా? ఇంటి యజమాని పేరు, చిరునామాలతోపాటూ, ప్రారంభ సందర్శన తారీఖునీ, అందించిన సాహిత్యాన్నీ, చర్చించినదాన్ని గూర్చిన క్లుప్తమైన వివరణనూ, తర్వాతి సందర్శనంలో మాట్లాడబోయే అంశాన్నీ తప్పక రాసి ఉంచుకోండి. చేయబోయే ప్రతీ పునర్దర్శనం తర్వాత చేర్చబోయే అదనపు సమాచారం కొరకు మీ రికార్డులో స్థలాన్ని విడిచిపెట్టండి.

8 పునర్దర్శనాన్ని ఎలా చేయాలో విశ్లేషించుకోండి: ఆసక్తివున్న వ్యక్తిని పునర్దర్శించేటప్పుడు మనస్సులో ఉంచుకొనాల్సిన కొన్ని విషయాలేవి? (1) స్నేహపూర్వకంగానూ, ఉత్తేజవంతంగానూ, వాత్సల్యపూరితంగానూ, గంభీరంగా గాక మామూలుగానూ ఉండండి. (2) అతనికి ఆసక్తికరంగా ఉండే విషయాంశాల్నిగానీ లేక ప్రశ్నల్నిగానీ చర్చించండి. (3) చర్చను సరళంగానూ, ఆసక్తికరంగానూ, లేఖనాధారంగానూ చేయండి. (4) చేసే ప్రతి సందర్శనంలో, ఇంటి యజమాని తనకు వ్యక్తిగతంగా విలువైందని గుర్తించే విషయాన్నే ఆయనకు బోధించడానికి కృషిచేయండి. (5) తర్వాతి సందర్శనంలో చర్చించబోయే విషయాంశం ఎడల ఉత్సుకతను పెంపొందించండి. (6) మరీ ఎక్కువసేపు ఉండకండి. (7) ఇంటి యజమానిని కలతపర్చే ప్రశ్నల్నిగానీ లేక ఆయనను ఇరకాటంలో పడవేసే ప్రశ్నల్నిగానీ అడగకండి. (8) ఆధ్యాత్మిక ప్రశంస అలవడకముందే ఇంటి యజమాని తప్పుడు దృక్పథాల్నిగానీ లేక చెడు అలవాట్లనుగానీ ఖండించకుండా ఉండేలా వివేచనను ఉపయోగించండి.—పునర్దర్శనాల్ని చేయడంలో, బైబిలు పఠనాల్ని ప్రారంభించడంలో ఎలా సఫలీకృతులవ్వగలమనే విషయంపై అదనపు సహాయం కొరకు మన రాజ్య పరిచర్య మార్చి 1997లోని ఇన్సర్ట్‌ను చూడండి.

9 ప్రతి సాధ్యతను పరిశీలించండి: ఒక సంఘంలో, హై సెక్యూరిటీ హౌసింగ్‌ కాలనీలో నివసించే వారందరి పేర్లనూ, వాళ్లుండే ఫ్లాటు నెంబర్లనూ పొందడం సాధ్యమైంది. అందులో ఉండే ప్రతి ఒక్కరికీ రెండు కరపత్రాలు జోడించబడిన ఒక వ్యక్తిగత ఉత్తరాన్ని రాయడం జరిగింది. ఉత్తరాన్ని చదివిన వ్యక్తి తిరిగి జవాబివ్వ గలిగేలా, ఉత్తరం చివరలో గృహ బైబిలు పఠనం ప్రతిపాదించబడి, లోకల్‌ ఫోన్‌ నెంబరు కూడా ఇవ్వబడింది. కొన్ని రోజుల్లోనే, బైబిలు పఠనాన్ని కోరుతూ ఒక యౌవనుడు ఫోన్‌ చేశాడు. మరుసటి రోజునే పునర్దర్శనం చేయడం జరిగింది, జ్ఞానము పుస్తకంలో బైబిలు పఠనాన్ని ప్రారంభించడం జరిగింది. అదే రోజు రాత్రి ఆయన సంఘ పుస్తక పఠనానికి హాజరయ్యాడు, అలాగే అన్ని కూటాలకూ హాజరవుతూనే ఉన్నాడు. దాదాపుగా అదే సమయంలో వెంటనే, అనుదినమూ క్రమంగా బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. బాప్తిస్మం తీసుకొనే దిశగా అతడు పురోభివృద్ధి సాధించాడు.

10 ప్రచారకుల గుంపొకటి గుంపుగా కొన్ని పునర్దర్శనాల్ని చేయడానికి ఏర్పాటు చేసుకుంది. ఒక సహోదరి తను పునర్దర్శించేవారిలో ఒకరిని సందర్శించినప్పుడు, తాను ఏ వ్యక్తి కోసమైతే వెళ్లిందో ఆ వ్యక్తి ఇంట్లో లేదు గానీ, మరొక యౌవన స్త్రీ తలుపు తెరచి “నేను మీ కోసమే ఎదురు చూస్తున్నాను” అని చెప్పింది. ఒక పరిచయస్థురాలి నుండి ఆ ఇంటి యజమానురాలు మునుపెప్పుడో జ్ఞానము పుస్తకాన్ని తీసుకొంది. ఆ సహోదరీలు ఆ ఇంటిని సందర్శించేటప్పటికి, ఆమె ఆ పుస్తకాన్ని రెండుసార్లు చదివి, దానిలో ఉన్న సమాచారానికి ఆమె ఎంతగానో ముగ్దురాలైంది. ఆ రోజు తనను సందర్శించడానికి సాక్షులు రావడం చూసి తాను ఆశ్చర్యపోలేదని ఆమె చెప్పింది ఎందుకంటే వాళ్లు వచ్చి, తనకు బైబిలు పఠనం చేయాలని ఆమె ప్రార్థిస్తూ ఉంది. పఠనం ప్రారంభించబడింది, ఆమె సంఘ కూటాలకు హాజరవ్వడం ప్రారంభించింది, ఆమె త్వరత్వరగా పురోభివృద్ధి సాధించింది.

11 దాదాపుగా 25 సంవత్సరాల క్రిందట బాప్తిస్మం తీసుకొన్న ఓ సహోదరి, ఇటీవలెనే వాళ్ల అమ్మగారికి జ్ఞానము పుస్తకాన్నిచ్చింది. చర్చి సభ్యురాలైన వాళ్లమ్మగారు, ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించారు. రెండు అధ్యాయాల్ని చదవడం పూర్తిచేసిన తర్వాత, ఆమె తన కుమార్తెను పిలిచి ఆమె ఆశ్చర్యచకితురాలయ్యేలా, “నేనూ ఒక యెహోవాసాక్షిని కావాలనుకుంటున్నాను” అని చెప్పారు. వాళ్లమ్మ బైబిలు పఠనాన్ని తీసుకొనడం ఆరంభించింది, మరిప్పుడామె బాప్తిస్మం తీసుకొంది.

12 ఈ సలహాల్ని ప్రయత్నించండి: పఠనాల్ని ప్రారంభించడానికి మీరెప్పుడైనా ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగించారా? మీరిలా సరళంగా చెప్పవచ్చు: “మీరు ఉచిత గృహ బైబిలు పఠనాన్ని ఇష్టపడితే, దాన్ని ఎలా చేస్తామో మీకు కొన్ని నిమిషాల్లో చేసి చూపించగలను. మీకు ఇష్టమైతే, కొనసాగించవచ్చు.” మీరు అలా చెప్పినట్లైతే, అనేకమంది ఆ ప్రతిపాదనను అంగీకరించి, బైబిలు పఠన ప్రదర్శనను గమనించడానికి సంశయించకపోవచ్చు.

13 పఠనారంభంలో, ఉల్లేఖించబడని లేఖనాల్ని చదవడం ద్వారా, ముద్రిత ప్రశ్నలకు జవాబివ్వడంలో కీలక పదాల క్రింద గీతగీయడం ద్వారా, ముందుగా ఎలా సిద్ధపడాలో విద్యార్థికి చూపించండి. ప్రధానాంశాలపై మాత్రమే కేంద్రీకరించండి. బహుశా పఠనం చేస్తున్న మొదటి కొన్నిసార్లు పట్టువిడుపులు అవసరమైనా, బైబిలు పఠనాన్ని క్రమంగా నిర్వహించడం ప్రాముఖ్యం. పఠనంలో ప్రాముఖ్యమైన భాగంగా ప్రార్థనను మీరెలా పరిచయం చేస్తారనే విషయాన్నీ, వ్యతిరేకత విషయమై విద్యార్థిని మీరు లేఖనాధారంగా ఎలా సిద్ధపరుస్తారనే విషయాన్నీ మనస్సునందుంచుకోండి. మొత్తంమీద, పఠనాన్ని ఆసక్తికరంగా చేయండి.

14 ప్రతీ బైబిలు విద్యార్థీ ఒకే వేగంతో పురోభివృద్ధి చెందకపోవచ్చనుకోండి. కొంతమంది ఆధ్యాత్మికంగా ఇతరులు మొగ్గుచూపించినంతగా చూపించకపోవచ్చు, లేక బోధించబడిన విషయాల్ని ఇతరులు అర్థంచేసుకొన్నంత త్వరగా అర్థంచేసుకోకపోవచ్చు. ఇతరులు ఎంతో బిజీగా ఉండి, వారానికొక అధ్యాయాన్ని పూర్తి చేయడానికి అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. కాబట్టి, కొందరి విషయంలో కొన్ని అధ్యాయాల్ని పూర్తి చేయడానికి ఒకటికన్నా మరెక్కువ పఠనాలు చేయాల్సిన అవసరముండవచ్చు, పుస్తకాన్ని పూర్తిచేయడానికి అదనంగా కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో మొదట మనం దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును పఠించి, ఆపై జ్ఞానము పుస్తకం ద్వారా పురోభివృద్ధి సాధించవచ్చు; ఇతరుల విషయంలోనైతే, జ్ఞానము పుస్తకాన్ని పూర్తిచేసిన తర్వాత, దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును పఠించడం సముచితంగా ఉన్నట్టు మనం కనుగొనవచ్చు. ప్రతీ విద్యార్థి సత్యంలో బలమైన పునాదిని వేసుకోవడానికి సంఘకూటాలకు హాజరవ్వడంతో పాటు అది కూడా సహాయపడుతుంది.

15 అన్నింటికంటే పైగా, బైబిలు పఠనం కొరకు ప్రార్థించండి! (1 యోహా. 3:22) ఒక క్రైస్తవునికి అత్యంత ప్రతిఫలదాయకమైన అనుభవాల్లో ఒకటేమిటంటే, యేసుక్రీస్తు శిష్యునిగా తయారయ్యేలా ఒకరికి సహాయపడేందుకు యెహోవా దేవునిచే ఉపయోగించుకోబడడమే. (అపొ. 20:35; 1 కొరిం. 3:6-9; 1 థెస్స. 2:8) మరిన్ని పఠనాల్ని ప్రారంభించేందుకైన మన ప్రయత్నాలపై యెహోవా గొప్ప ఆశీర్వాదం ఉంటుందని పూర్తి నమ్మకాన్ని కల్గివుండండి, బైబిలు పఠన పనిలో గొప్ప ఆసక్తిని చూపించేందుకిదే సమయం!

[3వ పేజీలోని బ్లర్బ్‌]

మీరొక క్రొత్త బైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు ప్రార్థన చేస్తున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి