కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/98 పేజీ 2
  • మన బ్రోషూర్లను పఠించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన బ్రోషూర్లను పఠించడం
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 4/98 పేజీ 2

మన బ్రోషూర్లను పఠించడం

ఫిబ్రవరి 1998 మన రాజ్య పరిచర్యలో ప్రకటించినట్లుగానే మే 4 మొదలుకొని సెప్టెంబరు 14, 1998 వారం వరకూ మూడు బ్రోషూర్లను ఒకదాని తర్వాత ఒకటి మన సంఘ పుస్తక పఠనంలో అధ్యయనం చేస్తాం. మన రాజ్య పరిచర్యలో పుస్తక పఠనం కొరకు ప్రతీ నెలా ఇవ్వబడే షెడ్యూల్‌ను చూస్తే, సర్వమానవాళి కొరకైన గ్రంథం, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్లలోని సమాచారాన్ని చెప్పుకోదగినంత వేగంగానే చర్చించాల్సి ఉంటుందని మీరు గమనిస్తారు. దీనికి పఠన నిర్వాహకులూ హాజరైన వారూ చక్కగా సిద్ధపడడమూ, వెంటవెంటనే వ్యాఖ్యానించడమూ అవసరం. సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూరులో ముద్రిత ప్రశ్నల్లేవు గనుక ప్రతీ పఠన నిర్వాహకుడూ పేరాలోని కీలకాంశాల్ని వెలికితీస్తూ తన సొంత ప్రశ్నల్ని సిద్ధపర్చు కోవాలి. షెడ్యూలు వేయబడిన పేరాలన్నింటినీ చదవడం అన్ని వేళలా సాధ్యంకాక పోవొచ్చు, అయితే ముఖ్యమైన పేరాలు చదువబడేలా పఠన నిర్వాహకుడు శ్రద్ధ తీసుకోవాలి. త్వరత్వరగా బ్రోషూర్లను ఆమూలాగ్రం చర్చించడం వాటిలో ఉన్న విషయాలతో మనం మంచి పరిచయాన్ని కల్గివుండేలా చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏదొక విషయాంశాన్ని పరిశోధిస్తున్నప్పుడు ఎక్కడ చూడాలో మనకు తెలుస్తుంది.

మరో వైపున, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు నుండి వారానికి మూడు పాఠాలను మాత్రమే షెడ్యూలు వేయడం జరిగింది. దాని ఫలితంగా, వాటిలో ఉన్న అన్ని పేరాలను చదవడానికీ, ఉల్లేఖించబడని లేఖనాలన్నింటినిగానీ లేక ఆ లేఖనాల్లో చాలావరకు గానీ చదివి చర్చించడానికీ, ఆలోచనాపూర్వక వ్యాఖ్యానాల్ని చేయడానికీ తగినంత సమయం తప్పక ఉంటుంది. దీనికి కూడా అందరు చక్కగా సిద్ధపడడం అవసరం. బైబిలు విద్యార్థులతో మనం తరుచూ ఈ బ్రోషూరులో నుండి పఠనం చేస్తాం గనుక, కొద్దిగాగానీ లేక అస్సలుగానీ బైబిలు జ్ఞానంలేని వ్యక్తులతో ఈ బ్రోషూరును ఎలా పఠించవచ్చో, అనవసరమైన సమాచారాన్ని చేర్చకుండా లేఖనాధార అంశాల్ని ఎలా స్పష్టంగా తర్కించవచ్చో, యెహోవా ప్రమాణాల ఎడల హృదయపూర్వకమైన ప్రశంసను పెంపొందించుకోవడానికి క్రొత్తవారికి ఎలా సహాయపడవచ్చో పఠన నిర్వాహకుడు ఈ బ్రోషూరును ఉపయోగిస్తూ చూపించాలి. 16వ పాఠాన్ని పఠించిన తర్వాత బ్రోషూరు మొత్తాన్ని పునఃసమీక్షిస్తున్నప్పుడు, బైబిలు పఠనపనిలో ఉపయోగించబడగల బోధనాంశాల్ని పఠననిర్వాహకుడు విశేషంగా పునఃసమీక్షించవచ్చు. అలాంటి చర్చ, దేవుని వాక్య బోధకులుగా మన నైపుణ్యాల్ని మెరుగుపరుస్తుంది, అలాగే దేవుడు మన నుండి కోరేవాటన్నింటినీ చేయాలనే మన తీర్మానాన్ని కూడా బలపరుస్తుంది.—కీర్త. 143:10; యెష. 50:4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి