కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/98 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 2/98 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) లేదా సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ లిస్ట్‌ చేసిన 192 పేజీల పుస్తకాల్లో దేనినైనా ప్రతిపాదించవచ్చు. స్థానిక భాషల్లో ఆ పుస్తకాలు లభించనప్పుడు జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదాన్ని రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకము రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. గృహ బైబిలు పఠనాలను ప్రారంభించడంపై దృష్టి కేంద్రీకరించండి.

ఏప్రిల్‌, మే: కావలికోట, తేజరిల్లు!ల కొరకు చందాలు.

◼ మే 4, 1998 వారం మొదలుకొని, సెప్టెంబరు 14, 1998 వారం వరకూ సర్వమానవాళి కొరకైన గ్రంథం, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? మరియు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రొషూర్లు ఒకదాని తర్వాత ఒకటి సంఘ పుస్తక పఠనంలో అధ్యయనం చేయబడతాయి.

◼ క్రమ పయినీర్లందరి కార్యశీలతను సెక్రటరీ, సేవాధ్యక్షుడూ పునఃసమీక్షించాలి. కావలసిన గంటలను చేరుకోవడానికి ఎవరికైనా కష్టంగా ఉన్నట్లైతే, సహాయాన్ని అందించేందుకు పెద్దలు ఏర్పాటు చేయాలి. సలహాల కొరకు అక్టోబరు 1, 1993, అక్టోబరు 1, 1992 తేదీల్లోని సొసైటీ ఉత్తరాల్ని (S-201) పునఃసమీక్షించండి. 1986 మన రాజ్య పరిచర్య (ఆంగ్లం) అనుబంధంలోని 12-20 పేరాలను కూడా చూడండి.

◼ సంఘం స్థానిక సమావేశాలకు హాజరైనప్పుడు ఈ క్రింది సవరింపులు అవసరమౌతాయనే విషయం పెద్దల సభకు తెలిసివుండాలి: ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం పట్టిక వేయబడిన వారంలో, బహిరంగ కూటం, కావలికోట అధ్యయనం మినహాయించి వారపు సంఘ కూటాలన్నీ జరుగుతాయి. మరి ప్రాంతీయ సమావేశానికి హాజరవ్వాలని పట్టిక వేయబడిన వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను మరియు సేవా కూటాన్ని కూడా సంఘం రద్దు చేస్తుంది; ఆ వారంలో స్థానికంగా కేవలం సంఘ పుస్తక పఠనం మాత్రమే జరుపబడుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి