యెహోవా అసాధారణ శక్తిని ఇస్తున్నాడు
1 అమూల్యమైన పవిత్ర సేవాధిక్యత, అంటే క్రైస్తవ పరిచర్యచేసే ఆధిక్యత యేసు శిష్యులందరికీ అప్పగించబడింది. (మత్త. 24:14; 28:19, 20) కానీ, మానవ అపరిపూర్ణతా, ఈ విధానం తెచ్చే ఒత్తిళ్లూ మనల్ని మనం బొత్తిగా తగనివారంగా దృష్టించుకునేందుకు కొన్నిసార్లు కారణంకావొచ్చు.
2 ఇలా దృష్టించుకున్నప్పుడు, కొరింథులోని అభిషిక్త క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక ద్వారా మనం ఓదార్పును పొందగలం. ఆయనిలా రాశాడు: “మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.” (2 కొరిం. 4:7, NW) పౌలు “మనకీ పరిచర్య ఉన్నందున మనం దీన్ని విడిచిపెట్టం” అనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. (2 కొరిం. 4:1, NW) నిజమే, మనలో ప్రతి ఒక్కరికీ అటు అభిషిక్తులమైనా లేక ఇటు ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన వారమైనా సరే సువార్తను ప్రకటిస్తూ ఉండడమూ, దాన్ని ‘విడిచి పెట్టకుండా’ ఉండడమూ ఒక సవాలే. ‘అసాధారణ శక్తిని’ అనుగ్రహిస్తున్న దేవునినుండి బలం మనకు అవసరం.—యోహా. 10:16; 2 కొరిం. 4:7 బి, NW.
3 తీవ్రమైన వ్యతిరేకతతోనో, ప్రమాదభరితమైన రోగాలతోనో లేక చాలీచాలని ఆదాయాలతోనో పోరాటాన్ని సల్పుతున్నప్పటికీ అనేకమంది సాక్షులు ఆసక్తిగల సువార్తికులై ఉండడం ప్రోత్సాహకరమైన విషయం. మన ప్రకటనా నియామకానికి యెహోవా మద్దతుందనే విషయాన్ని మనమంతా గుర్తించాలి. ప్రకటించాలనే మన తీర్మానాన్ని బలహీనపర్చడానికి నిరుత్సాహాన్నో లేక భయాన్నో అనుమతించక “ప్రభువులో ఆయన బలాధిక్యతలో శక్తిని పొందుతూ ఉందాం.”—ఎఫె. 6:10, NW; సామె. 24:10.
4 దేవుని శక్తిని పొందడం ఎలా: దేవుని సహాయాన్నీ, బలాన్నీ అర్థిస్తూ ప్రార్థనలో పట్టుదల కల్గివుండండి. (రోమా. 12:12; ఫిలి. 4:6, 7) తర్వాత, మీ పూర్ణ హృదయంతో, అసాధారణ శక్తిని ఇచ్చేందుకు యెహోవానందు నమ్మకముంచండి. (సామె. 3:5) శోధనల్ని సహించేందుకు యెహోవా నేడు తన సేవకులకు సహాయం చేస్తున్నాడనడానికి రుజువుని మన పత్రికల్లోని ఆధునికకాల జీవిత గాథలు ఇస్తున్నాయి గనుక వాటిని చదవండి. సంఘంలో ఉన్న సహోదరులతో సన్నిహితంగా సహవసించండి, సంఘకూటాలకు హాజరవ్వడం మానకండి.—రోమా. 1:11, 12; హెబ్రీ. 10:24, 25.
5 యెహోవా శక్తిని అంటే అత్యంత ప్రాముఖ్యమైన రాజ్య ప్రకటనాపనిని మనం విడిచిపెట్టకుండా ఉండేందుకు సహాయపడే అసాధారణ శక్తిని పొందే స్థానంలో మనల్ని మనం ఉంచుకునేందుకు చేయగలిగినంతా మనం చేద్దాం.