ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు నవంబరు: రాజ్య వార్త నెం. 35 పంపకం కొనసాగుతుంది. రాజ్య వార్త నెం. 35 స్టాకు అయిపోయిన తర్వాత జ్ఞానము పుస్తకాన్ని రూ. 20.00కి ప్రతిపాదించవచ్చు. డిశంబరు: ఈ క్రింది మూడు పుస్తకాల్లో దేన్నైనా ఒక్కొక్కటీ రూ. 45.00కు అందజేయాలి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్న సైజు రూ. 25.00), నా బైబిలు కథల పుస్తకం (చిన్న సైజు రూ. 30.00) లేదా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. ప్రత్యామ్నాయంగా, జూలై మన రాజ్య పరిచర్యలో ప్రత్యేక ధరకని చెప్పబడిన ఏ పుస్తకాన్నైనా రూ. 2.50కు ప్రతిపాదించవచ్చు. జనవరి: సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ పట్టిక వేసిన 192 పేజీల పాత పుస్తకాల్లో ఏదైనా. స్థానిక భాషల్లో అలాంటి పుస్తకాలు లభ్యం కానప్పుడు, జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదానికి రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) లేదా సగం ధరకు లేదా ప్రత్యేక ధరకు సొసైటీ లిస్ట్ చేసిన 192 పేజీల పుస్తకాల్లో దేనినైనా ప్రతిపాదించవచ్చు. స్థానిక భాషల్లో ఆ పుస్తకాలు లభించనప్పుడు జ్ఞానము లేదా కుటుంబ సంతోషం పుస్తకాలను ఒక్కొక్కదానికి రూ. 20.00 చొప్పున ప్రతిపాదించవచ్చు.
◼ నవంబరు 16న ప్రత్యేక ప్రచార పని ముగిసిన తర్వాత కూడా రాజ్య వార్త నెం. 35 ప్రతుల సరఫరా ఉన్న సంఘాలు కరపత్రాలను ఇంత వరకు పంచిపెట్టిన రీతిలోనే ఇంటింట గానీ, మరెక్కడైనా కానీ ఇప్పుడు కూడా పంచిపెట్టాలని ప్రచారకులను ప్రోత్సహించవచ్చు. సముచితమైతే, గృహస్థులను కలవని ఒక్కో ఇంట్లో ఒక్కో కరపత్రాన్ని వేసి వెళ్ళవచ్చు. అయితే ఆ దారిన వెళ్ళేవారి కంటబడని విధంగా వేయాలి. ముఖ్యమైన సమాచారాన్ని తెలిపే ఈ కరపత్రం యొక్క ప్రతులనన్నింటినీ పంచిపెట్టేందుకు ప్రయత్నాలు జరగాలి.
◼ 1998 జనవరి మొదలుకొని “రక్షించగల యెహోవా శక్తిలో నమ్మకముంచండి” అనే బహిరంగ ప్రసంగాన్ని ప్రయాణ పైవిచారణకర్తలు ఇస్తారు. వారి సందర్శన కాలాల్లో “యెహోవా భయంలో నడుస్తున్న సంఘములారా—మంచిప్రవర్తనను కొనసాగించండి” అనేది ముగింపు సేవా ప్రసంగమై ఉంటుంది. గురువారం (లేదా శుక్రవారం) రోజున వాళ్ళిచ్చే మొదటి సేవా ప్రసంగ శీర్షిక: “‘ప్రతిచోటా’ దేవుని గూర్చిన పరిమళ జ్ఞానాన్ని వ్యాపింపజేయడం.”