కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/97 పేజీ 1
  • “మీ శక్తిమేరకు చెయ్యండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీ శక్తిమేరకు చెయ్యండి”
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవా సేవలో పనిరద్దీగా యుండుట
    మన రాజ్య పరిచర్య—1992
  • యెహోవా సేవలో మీరు చేయగలిగిందంతా చేస్తూ సంతోషాన్ని పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 6/97 పేజీ 1

“మీ శక్తిమేరకు చెయ్యండి”

1 యెహోవాకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మనం అతి శ్రేష్ఠమైన దానిని చేస్తామని వాగ్దానం చేశాం. తగిన విధంగానే, తాము యెహోవా ఎదుట నిలబడతామని నిశ్చయపర్చుకొనడంలో తమ శక్తిమేరకు చెయ్యాలని మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని అపొస్తలుడైన పేతురు ప్రోత్సహించాడు. (2 పేతు. 1:10, NW) నేడు యెహోవాను సేవించడంలో ఆయన్ని ప్రీతిపర్చేందుకు మన శక్తిమేరకు చేయాలని, మనం నిశ్చయంగా కోరుకుంటాం. ఇందులో ఏమి చేరివుంది? యెహోవాతో మనకుగల సంబంధం పటిష్ఠమౌతుండగా, ఆయన మనకొరకు చేసిన వాటినన్నిటినీ మనం ధ్యానిస్తుండగా ఆయన సేవలో ఎల్లప్పుడూ శ్రేష్ఠమైనదాన్ని చేసేలా మన హృదయాలు కదిలించబడతాయి. మన సేవానాణ్యతను మెరుగుపర్చుకోవాలనీ, సాధ్యమైతే మన పరిచర్యను విస్తృతపర్చుకోవాలనీ కోరుకుంటాం.—కీర్త. 34:8; 2 తిమో. 2:15.

2 దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయడం, యెహోవా ఎడల తనకుగల ప్రశంసను పెంపొందించి, తనలో గొప్ప ఆసక్తిని రేకెత్తించిందని పరిచర్యలో ఎంతో చెయ్యాలని కోరుకున్న ఓ యౌవన సహోదరుడు గ్రహించాడు. ఇది, పయినీరు సేవకొరకు దరఖాస్తు చేసుకొనేలా ఆయన్ని ప్రేరేపించింది. అపరిచితులతో మాట్లాడ్డానికి ఇబ్బందిపడే ఓ సహోదరి, తర్కించుట (ఆంగ్లం) పుస్తకంలోని కొన్ని అందింపుల్ని అభ్యసించి, త్వరలోనే తన పరిచర్యలో గొప్ప సాఫల్యాన్ని అనుభవించింది. ఆమె, సత్యాన్ని అంగీకరించిన ఓ దంపతులతో బైబిలు పఠనాన్ని నిర్వహించగల్గింది.

3 మీరు చేయగల్గే దానిలోనే ఆనందించండి: అనారోగ్యమూ, కుటుంబ వ్యతిరేకతా, పేదరికమూ, లేక టెరిటరీలో ఉదాసీనవైఖరీ వంటి క్లిష్టమైన పరిస్థితుల్ని మనలో కొందరం అనుభవించాం. ఈ అంత్యదినాల్లో సర్వసామాన్యమైన ఇతర సమస్యలనేకం, మన సేవను ఆటంకపర్చవచ్చు. (లూకా 21:34, అధఃస్సూచి NW; 2 తిమో. 3:1) యెహోవాకు మనం చేసుకున్న సమర్పణ విషయంలో మనం విఫలులయ్యామని దీని భావమా? మన శక్తిమేరకు మనమాయన్ని సేవిస్తుంటే విఫలులంకానట్టే.

4 ఇతరులు సాధించగల్గుతున్నదాన్ని ఆధారంగా చేసుకొని మనల్నిమనం విమర్శించుకోవడం జ్ఞానయుక్తమైన పనికాదు. బదులుగా, “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను” అని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. వ్యక్తిగతంగా సాధ్యమైనంత మేరకు పూర్తిగా మనల్ని మనం అర్పించుకోవడం, యెహోవాను ప్రీతిపరుస్తుంది, అంతేగాక మనం ‘అతిశయించేందుకు’ కారణాన్నిస్తుంది.—గల. 6:4; కొలొ. 3:23, 24.

5 ‘చివరకు శాంతముగలవారమై, దేవుని దృష్టికి నిష్కళంకులుగానూ నిందారహితులుగానూ కనబడేలా మన శక్తిమేరకు చేసేందుకు’ మనం పేతురు మాటల్ని విందుముగాక. (2 పేతు. 3:14) అలాంటి స్ఫూర్తి మనం భద్రంగావున్నామని భావించేలా చేస్తూ, యెహోవా మాత్రమే ఇవ్వగలిగే మనశ్శాంతిని తీసుకువస్తుంది.—కీర్త. 4:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి