కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/97 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 2/97 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) లేదా నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ప్రత్యామ్నాయంగా, ప్రత్యేకంగా ప్రతిపాందించే 192 పేజీల పాత పుస్తకాలలో దేనినైనా రూ. 10.00 చందాకు ప్రతిపాదించవచ్చు. మార్చి: కుటుంబ సంతోషానికిగల రహస్యం అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. ఏప్రిల్‌, మే: కావలికోట లేక తేజరిల్లు! పత్రికల చందాలు. గమనిక: నిరంతరము జీవించగలరు మరియు కుటుంబ జీవితము అనే పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సంఘాలన్నింటినీ మేము ప్రోత్సహిస్తున్నాము. ప్రచారకులు ఈ పుస్తక ప్రతుల్ని సంవత్సరమంతా అన్నివేళల్లో తమతో ఉంచుకుని, సముచితమైన ప్రతి సందర్భంలోను వాటిని ప్రతిపాదించాలని ప్రోత్సహించబడగలరు. పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంతవరకూ రిక్వెస్ట్‌ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14) నందు రిక్వెస్ట్‌ చేయాలి.

◼ క్రమ పయినీరులందరి కార్యశీలతను సెక్రటరీ మరియు సేవాధ్యక్షుడు పునఃసమీక్ష చేయాలి. కావలసిన గంటలను చేరుకోవడానికి ఎవరికైనా కష్టంగా ఉన్నట్లయితే, సహాయం అందించేందుకు పెద్దలు ఏర్పాటు చేయాలి. దీని విషయంలోని సలహాలకొరకు అక్టోబరు 1, 1993 మరియు అక్టోబరు 1, 1992 తేదీల సంస్థ లేఖలను (S-201) (ఆంగ్లం) పునఃసమీక్షించండి. అక్టోబరు 1986 మన రాజ్య పరిచర్య (ఆంగ్లం) ఇనసర్ట్‌లో ఉన్న 12-20 పేరాలను పునఃసమీక్షించండి.

◼ మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీర్లుగా సేవ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలు వేసుకుని, ముందుగానే తమ అప్లికేషన్‌లను ఇవ్వాలి. అవసరమైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేసేందుకు, కావలసినన్ని పత్రికలను మరియు ఇతర సాహిత్యాలను కలిగి ఉండేందుకు పెద్దలకు ఇది సహాయపడుతుంది. సహాయ పయినీరు సేవను చేసేందుకు ఆమోదాన్ని పొందిన వారి పేర్లను సంఘంలో ప్రకటించాలి.

◼ స్థానిక సమావేశాలకు సంఘం హాజరైనప్పుడు ఈ క్రింది సవరణలు అవసరమని పెద్దల సభ తెలుసుకొని ఉండాలి: ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం జరిగేవారంలో, బహిరంగ ప్రసంగమూ కావలికోట పఠనమూ తప్ప సంఘంలో మామూలుగా జరిగే మిగిలిన కూటాలన్నీ ఆ వారంలో జరగాలి. ప్రాంతీయ సమావేశానికి హాజరు కావల్సినప్పుడు, సంఘంలో దైవపరిపాలనా పాఠశాల అలాగే సేవాకూటాలను కూడా రద్దు చేయడం జరుగుతుంది; కేవలం సంఘపుస్తక పఠనం మాత్రమే ఆ వారంలో స్థానికంగా జరుగుతుంది.

◼ జనవరి 8, 1997 నుండి తేజరిల్లు! మాస పత్రిక నేపాలీలో లభ్యమౌతుంది, దీని సంవత్సర చందా రూ. 45.00.

◼ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:

భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!—అస్సామీ, టిబెట్టన్‌

శాంతియుత నూతన లోకంలో జీవితము (కరపత్రం నెం. 15)—జోంగా

కుటుంబ సంతోషానికిగల రహస్యం—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, మరాఠీ, మలయాళం, హిందీ

(ప్రచారకులకూ ప్రజలకూ ఈ పుస్తకం రూ. 20.00లకు, పయినీర్లకు రూ. 12.00లకు.)

దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?—అస్సామీ, ఆంగ్లం, ఒరియా, కన్నడ, కొంకిణీ (ఇది వేరువేరుగా దేవనాగిరీ, కన్నడ మరియు రోమన్‌ లిపిలలోనూ లభ్యమౌతున్నాయి), ఖాషీ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మణిపురి, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ

(ఈ బ్రోషూరు ప్రచారకులకూ ప్రజలకూ రూ. 6.00లకు, పయినీర్లకు రూ. 4.00లకు.)

మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్నసైజు)—పంజాబీ

◼ అందుబాటులో ఉన్న కొత్త ఆడియో క్యాసెట్లు:

దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? (ఒకే క్యాసెట్లో)—కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

(ఈ ఆడియో క్యాసెట్లు ప్రచారకులకూ ప్రజలకూ రూ. 65.00లకు, పయినీర్లకు రూ. 55.00లకు.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి