ప్రస్తుతం ఉన్న సాహిత్యం
సంవత్సరాలుగా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ పరిచర్య ప్రాంతంలో ఉపయోగించడానికిగాను చాలా చక్కని సాహిత్యాన్ని మనకు అందజేశాడు. ఇది నిజంగా “తగిన వేళ అన్నము” అని రుజువైంది. ఈ ప్రచురణల ద్వారా సత్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి లక్షలాదిమందికి సహాయం చేయబడుతుంది. (మత్త. 24:45) ప్రతి నెల మన రాజ్య పరిచర్యలో సూచించబడిన ప్రతిపాదనలను అనుసరించడం మంచిదైనప్పటికీ, గృహస్థుని అవసరాలకు తగ్గట్లు ప్రచారకులు ఇతర సాహిత్యాన్ని తమతోపాటు తీసుకెళ్లవచ్చు. మా దగ్గర తగినంత స్టాకులో ఉన్న పుస్తకాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది. వారి స్థానిక ప్రాంతంలో ఉపయోగించే భాషలలోని ఈ క్రింది ఐటమ్‌లలో కనీసం కొన్నింటి కొరకు సహేతుకమైనన్ని రిక్వెస్ట్ చేసుకోవాలని సంఘాలన్నింటినీ మేము ప్రోత్సహిస్తున్నాము. ప్రచారకులు తమ వ్యక్తిగత గ్రంథాలయాల కొరకు, తాము బైబిలు పఠనం చేసే వ్యక్తులకు మరియు పునర్దర్శనాల్లో కలిసేవారికి అందించడానికి, ఆచరణీయమైన చోట ఇంటింటి పరిచర్యలో ప్రతిపాదించడానికి తమతో తీసుకువెళ్లేందుకు వాటిని పొందాలని ప్రోత్సహించబడుతున్నారు.
చర్చనీయ బైబిలు అంశములు, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ; రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం, హిందీ; ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు, ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ; యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు, ఆంగ్లం, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, మరాఠీ, మలయాళం; “నీ రాజ్యము వచ్చుగాక,” ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ; యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు, మీ యౌవనం—దానిని పరిపూర్ణముగా ఆస్వాదించుట, తమిళం, మలయాళం; త్రిత్వమును మీరు నమ్మవలయునా?, ఆంగ్లం, కన్నడ, కొంకణీ (కన్నడ లిపి, రోమన్ లిపి రెండింట్లోను), గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ; అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట, తమిళం, నేపాలీ, మరాఠీ, మలయాళం; మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, ఆంగ్లం (పెద్ద సైజు), గుజరాతీ, బెంగాలీ, మరాఠీ. ఈ నెల కొరకైన ప్రతిపాదన అయిన చాలా భాషల్లో క్రమంగా ఉపయోగించబడే బ్రోషూర్ల మంచి స్టాకు కూడా మా దగ్గర ఉంది.