కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/96 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1996
మన రాజ్య పరిచర్య—1996
km 2/96 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 (పెద్ద సైజు 45.00) చందాకు. ప్రత్యామ్నాయంగా, నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం రూ. 15.00 చందాకు. ఈ పుస్తకం యొక్క తెలుగు ప్రతిని రూ. 8.00 ప్రత్యేక ధరకు ప్రతిపాదించ వచ్చునని దయచేసి గుర్తుంచుకోండి. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం రూ. 15.00 చందాకు. ఇది సంఘంలో ఇంకా లభ్యం కానట్లైతే, అప్పుడు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు ఇవ్వవచ్చు. ఏప్రిల్‌ మరియు మే: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికల ఎడిషన్‌లకు ఒక సంవత్సర చందా రూ 90.00. మాసపత్రికల ఎడిషన్‌లకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రిక ఎడిషన్‌లకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికల ఎడిషన్‌లకు ఆరునెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లయితే, విడి పత్రికలను రూ. 4.00కు ప్రతిపాదించాలి. సముచితమైన చోట, కుటుంబ జీవితము పుస్తకాన్ని కూడా ప్రతిపాదించవచ్చు. గమనిక: పత్రికల కాగితాల ధర పెరిగినందువల్ల, మార్చి 1, 1996 నుండి కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల వెలలోను చందాలోను పెరుగుదల ఉంటుంది. క్రొత్త వెలలు ఇలా ఉన్నాయి:

విడి పత్రికలు: పయినీర్లకు: రూ. 2.50; ప్రచారకులకు మరియు ప్రజలకు: రూ. 4.00.

పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా: పయినీర్లకు: రూ. 60.00; ప్రచారకులకు మరియు ప్రజలకు: రూ. 90.00.

మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికలకు ఆరు నెలల చందా: పయినీర్లకు: రూ. 30.00; ప్రచారకులకు మరియు ప్రజలకు: రూ. 45.00.

◼ క్రమ పయినీరులందరి కార్యశీలతను సెక్రటరీ మరియు సేవాధ్యక్షుడు పునఃసమీక్ష చేయాలి. కావలసిన గంటలను చేరుకోవడానికి ఎవరికైనా కష్టంగా ఉన్నట్లయితే, సహాయం లభించేందుకు పెద్దలు ఏర్పాటు చేయాలి. అక్టోబరు 1986 మన రాజ్య పరిచర్య (ఆంగ్లం) అనుబంధంలోని 12-20 పేరాల్లోని విషయాలను పునఃసమీక్షించండి.

◼ జ్ఞాపకార్థ ఆచరణ మంగళవారం, ఏప్రిల్‌ 2, 1996న జరుపబడుతుంది. ప్రసంగం ముందే ఆరంభమైనప్పటికీ, జ్ఞాపకార్థ రొట్టెను, ద్రాక్షారసాన్ని అందించుకోవడం అనేది సూర్యాస్తమయం అయ్యేంతవరకు ఆరంభించకూడదు అని దయచేసి గుర్తుంచుకోండి. మీ ప్రాంతంలో సూర్యాస్తమయం ఎప్పుడౌతుందో నిర్ణయించేందుకు మీ స్థానిక వాతావరణ కేంద్రాన్ని అడిగి తెలుసుకోండి. ఆ తేదీన ప్రాంతీయ పరిచర్య కొరకు తప్ప మరే కూటాన్ని జరుపకూడదు. మామూలుగా మీ సంఘంలో కూటాలు మంగళవారం ఉన్నట్లయితే, రాజ్య మందిరం ఉన్నట్లయితే, వాటిని వారంలోని మరో రోజుకు మార్చాలని మీరు కోరుకోవచ్చు.

◼ మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సహాయ పయినీర్లుగా సేవ చేయాలనుకునే ప్రచారకులు ఇప్పుడే పథకాలు వేసుకుని, ముందుగానే తమ దరఖాస్తులను ఇవ్వాలి. అవసరమైన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేసేందుకు, కావలసినన్ని పత్రికలు మరియు ఇతర సాహిత్యాలు కలిగి ఉండేందుకు పెద్దలకు ఇది సహాయపడుతుంది.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవాసాక్షులు మరియు విద్య—ఆంగ్లం

“ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశంనందు విడుదల అయిన ఈ క్రొత్త బ్రోషూర్‌ పయినీర్లకు రూ. 3.00, ప్రచారకులకు మరియు ప్రజలకు రూ. 5.00. అది ఒక సంపుటిలో ఆంగ్ల బ్రెయిలీలో కూడా లభ్యమవుతుంది.

నిత్యజీవానికి నడిపించే జ్ఞానము—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

“ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశంనందు విడుదల చేసిన ఈ క్రొత్త పుస్తకం పయినీర్లకు రూ. 8.00 ప్రచారకులకు మరియు ప్రజలకు రూ. 15.00. ఇది ఆంగ్ల బ్రెయిలీలో కూడా రెండు సంపుటులలో లభిస్తుంది.

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము—తమిళం

యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు? కరపత్రం సంఖ్య 14—ఉర్దూ

శాంతిపూర్ణమైన నూతనలోకంలో జీవితం కరపత్రం సంఖ్య 15—ఉర్దూ

చనిపోయిన ప్రియమైనవారికి ఏమి నిరీక్షణ? కరపత్రం సంఖ్య 16—ఉర్దూ

జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?—నేపాలీ

◼ మరలా లభ్యమయ్యే ప్రచురణలు:

గొప్ప బోధకుని వినడం —తమిళం, మలయాళం

“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”—ఆంగ్లం, కన్నడ, తమిళం, నేపాలీ, మలయాళం, హిందీ

మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు (చిన్నది)—తమిళం

◼ లభ్యమయ్యే క్రొత్త వీడియో క్యాసెట్లు:

బైబిలు—వాస్తవాల, ప్రవచనాల పుస్తకం సంపుటి I: బైబిలు—కచ్చితమైన చరిత్ర, నమ్మదగిన ప్రవచనం—ఆంగ్లం

బైబిలు—వాస్తవాల, ప్రవచనాల పుస్తకం సంపుటి II: బైబిలు—మానవజాతి యొక్క అతిపురాతనమైన ఆధునిక పుస్తకం—ఆంగ్లం

దైవిక బోధ వలన ఐక్యమవ్వడం—ఆంగ్లం

ఈ వీడియో క్యాసెట్ల కోసం మామూలుగా పంపే లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌ (S-AB-14)లో ఆర్డర్‌ చేయవచ్చు. ప్రతి ఒక్కదానికి చందా పయినీర్లకు రూ. 150.00, ప్రచారకులకు మరియు ప్రజలకు రూ. 200.00.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి