కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/95 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 10/95 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదన అక్టోబరు: తేజరిల్లు! లేక కావలికోట కొరకు చందాలు. పక్షపత్రిక సంచికకు ఒక సంవత్సర చందా రూ 70.00. మాసపత్రికకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికకు ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికకు ఆరునెలల చందా లేదు. చందాలు సేకరించేటప్పుడు, పంజాబి మరియు ఉర్దూ భాషల్లో (ఇవి మాసపత్రికలు) తప్ప కావలికోట ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లోను, నేపాలిలోను పక్షపత్రికగా లభ్యమౌతుందని దయచేసి జ్ఞాపకముంచుకోండి. తేజరిల్లు! తమిళం మరియు మలయాళంలో పక్షపత్రిక కాని కన్నడ, గుజరాతి, తెలుగు భాషల్లో మాసపత్రిక. తేజరిల్లు! పత్రికకు నేపాలి, బెంగాలి, మరాఠీ లేక హిందీ భాషల్లో విడి చందాలు అందుబాటులో లేవు కాని ఈ నాలుగు భాషల్లో త్రైమాసిక పంపిణీదారుల ప్రతులు సంఘాలకు లభ్యమౌతున్నాయి. నవంబరు: సాధ్యమైన చోటెల్లా, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంతోపాటు పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదం (ఆంగ్లం) రూ. 75.00కు ప్రతిపాదించాలి. ప్రత్యామ్నాయంగా, దేవుని కొరకైన మానవుని అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ. 45.00కు ప్రతిపాదించవచ్చు. ఇతర భాషల్లో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై సలహాల కొరకు ఆగస్టు 1995 మన రాజ్య పరిచర్య చూడండి. డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకానికి రూ. 45.00 చందా. దానికి ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అదే చందాకు (నిరంతరము జీవించగలరు అనే పుస్తకం చిన్న సైజు రూ. 25.00కు) అందించవచ్చు. జనవరి: క్రితం మన రాజ్య పరిచర్య నందు ప్రత్యేక అందింపు పుస్తకాల పట్టికలో ఇవ్వబడిన 192 పేజీల ఏ పుస్తకానికైనా రూ. 8.00 చందా. ఇవి అందుబాటులో లేని భాషల్లో, 1995 నవంబరు నెల కొరకు పైన సూచించబడిన అవే ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు.

◼ మన రాజ్య పరిచర్య యొక్క ఈ సంచిక అనుబంధంలో “1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక” ఉంది, దాన్ని 1996వ సంవత్సరమంతా చూసుకోవడానికి ఉంచుకోవాలి.

◼ ఇండియాను గూర్చిన నెలసరి ప్రాంతీయ సేవా రిపోర్టు బ్రూక్లిన్‌కు పంపించవలసిన తేదీ తర్వాత, ప్రతి నెల మేము సంఘ రిపోర్టు (s-1) కార్డులను ఎక్కువ సంఖ్యలో అందుకుంటున్నాము. గనుక, ప్రతి నెలాఖరున సంఘ ప్రచారకులు తమ ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. ప్రచారకులందరూ తమ ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇచ్చేవరకు కార్యదర్శులు సంఘ రిపోర్టును సేకరించకుండా ఉండకూడదు. వాళ్లు s-1 కార్డును మాకు వీలైనంత త్వరగా పోస్టు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోను, తరువాతి నెల ఆరవ తేదీ కంటే ముందే పంపాలి. దాని తర్వాత ఇచ్చిన వ్యక్తుల రిపోర్టులను మాములు పద్ధతిలోనే ఎక్కించి, తర్వాతి నెల సంఘ రిపోర్టుతో జతచేయాలి. సంఘకార్యదర్శి తరువాతి నెల సంఘ రిపోర్టులో, ఆలస్యంగా అందిన రిపోర్టులను జతచేయాలి మరియు తప్పులను సరిదిద్దాలి—సంఘ రిపోర్టులను పంపిన తర్వాత సవరణలు సంస్థకు పంపకూడదు.

◼ అందుబాటులో ఉన్న క్రొత్త ప్రచురణలు:

శాంతియుతమైన నూతన లోకంలో జీవితం (T-15)—టిబెటన్‌

కావలికోట మరియు తేజరిల్లు! 1994 బౌండు సంపుటిలు—ఆంగ్లం

◼ మళ్లీ లభ్యమౌతున్న ప్రచురణలు:

ఒక సురక్షితమైన భవిష్యత్తు—దాన్ని మీరెలా కనుగొనవచ్చు—గుజరాతి, తమిళం, మరాఠి, మలయాళం

దేవునికి నిజమైన విధేయత చూపించవలసిన సమయం (ముస్లిమ్‌ల కొరకు)—ఆంగ్లం

మరణంపై విజయం—ఇది మీకు సాధ్యమేనా?—తమిళం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి