బ్రోషూర్ తీసుకున్న వాళ్లందరినీ పునర్దర్శించండి
1 ఫిలిప్పీయులు పౌలును ‘గూర్చి మరల యోచన చేశారు’ గనుక ఆయన వారిని మెచ్చుకున్నాడు. (ఫిలి. 4:10) ప్రాంతీయ సేవలో వాళ్ల ఉదాహరణను మనం మాదిరిగా తీసుకుంటే, మనం ఎవరికి సాక్ష్యమిస్తామో వారి విషయమై ‘మనం మరల యోచన చేస్తాము’ మరి పునర్దర్శించడానికి ప్రోద్బలం చేయబడతాము.
2 “మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?” అనే బ్రోషూర్ను గనుక మీరు ఇచ్చి ఉంటే, మీరిలా చెప్పవచ్చు:
◼ “మొన్న మనం చర్చించుకున్న విషయాన్ని గురించి నేను ఆలోచించాను, నేను ఈ రెండు లేఖనాలను మీకు చూపించాలని అనుకుంటున్నాను. దేవుడు భూపరిపాలనను తన ఆధ్వర్యంలోకి తీసుకునే విషయాన్ని గురించి మనం మాట్లాడిన సంగతి మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. ఇది జరుగుతుందని యెహోవా దేవుడు బైబిలులో వాగ్దానం చేశాడు. [దానియేలు 2:44 చదవండి.] అది వాస్తవంగా జరుగగలదని మీరు నమ్ముతున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] తన వాగ్దానాలను నెరవేర్చగల తన సామర్థ్యాన్ని గురించి దేవుడేమి చెబుతున్నాడో వినండి. [యెషయా 55:11 చదవండి.] దేవుని రాజ్యంలో మన నమ్మకాన్ని ఉంచడానికి అది మనల్ని ప్రోత్సహించదా? అయితే దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడు నెరవేర్చుతాడు?” మీరు మళ్లీ వచ్చినప్పుడు మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారని వివరించండి.
3 “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే బ్రోషూర్ తీసుకున్న వ్యక్తిని పునర్దర్శించేటప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “ఎవరినైనా మరణంలో పోగొట్టుకున్న విషయాన్ని గురించిన మన చర్చ దృష్ట్యా, మళ్లీ రాడానికి నేను ప్రత్యేక ప్రయత్నం చేశాను.” 30వ పేజీలోని బొమ్మను చూపి, మీరిలా చెప్పండి: “ప్రజలు పునరుత్థానమయ్యి తమ ప్రియమైన వారిని కలుసుకునే ఈ సంతోషకరమైన దృశ్యం మీకు జ్ఞాపకముందా? అయితే అది పరలోకంలో జరుగుతుందా లేక భూమిపై జరుగుతుందా అన్న ప్రశ్నను నేను పోయిన వారం మిమ్మల్ని అడిగాను. బహుశా ఈ బ్రోషూర్ 26వ పేజీలో మీరు బైబిలు చెప్పే జవాబును కనుగొని ఉంటారు.” మూడు నుండి ఐదు పేరాల్లోని ముశాలను చర్చించి, యోహాను 5:21, 28, 29 చదవండి. సమయం అనుమతించే కొలది ఆ పేజీలోని మిగతా లేఖనాలను వేటినైనా చదవండి.
4 “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అనే బ్రోషూర్లో మీరు పఠనం ప్రారంభించారా? పునర్దర్శనంలో మీరిలా చెప్పవచ్చు:
◼ 30వ పేజీని మళ్లీ తిప్పి, ప్రశ్నను సూచించండి: “ఏయే విధములుగా బైబిలు అసాధారణమైయున్నది?” మూడు మరియు 4 పేజీలను తిప్పి, 1-4 పేరాలను అలాగే బ్రోషూర్ కవరుపై ఉన్న చిత్రపఠాన్ని పునఃపరిశీలించండి. పేరా 4లో అథఃసూచిలో సూచించబడిన లేఖనాల్లో ఒకటి లేదా రెండు చదవండి. అలాంటి అద్భుతమైన నిరీక్షణను కేవలం బైబిలు మాత్రమే ఇస్తుందని వివరించండి. మీ తర్వాతి దర్శనం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మూడవ దర్శనం తర్వాత, పఠనం కొనసాగే సూచనలు కనిపిస్తే, మీరు ఒక క్రొత్త పఠనాన్ని రిపోర్టు చేయవచ్చు!
5 “నిరంతరము నిలిచే దైవనామము” అనే బ్రోషూర్పై మీరిలా చర్చ కొనసాగించవచ్చు:
◼ “ముందు, నేను మీకు బైబిల్లో దేవుని నామాన్ని చూపగలిగాను. యెహోవా అనే నామాన్ని తెలుసుకోవడం, దాన్ని ఉపయోగించడం మా ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగం.” ముప్పైఒకటవ పేజీ తెరిచి, చివరి నాలుగు పేరాల్లోని ముఖ్య విషయాలను పునఃపరిశీలించి, యోహాను 17:3 మరియు మీకా 4:5 చదవండి. దేవుని నామం సరైన పద్ధతిలో ఎలా పవిత్రపర్చబడుతుంది మరి పరదైసు భూమిపై దీవెనలను మనమెలా అనుభవించగలమనే విషయాలను చూపగల బైబిలు పఠన కార్యక్రమాన్ని మనం అందిస్తున్నామని వివరించండి.
6 మీరు దర్శించిన వారిని గురించి మరల యోచన చేయండి. పట్టుదలతో మళ్లీ వెళ్లండి, పంచుకోడానికి ప్రయోజనకరమైనది ఏదైనా సిద్ధం చేయండి. క్రొత్త శిష్యులను చేయడంలో “సఫలులయ్యే” వారిగా మీరు ఉండగలరు.—మత్త. 13:23.