కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/95 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1995
మన రాజ్య పరిచర్య—1995
km 2/95 పేజీ 3

ప్రకటనలు

◼ అందించవలసిన సాహిత్యాలు ఫిబ్రవరి: పరదైసు భూమిపై మీరు నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు అందించగలరు. ఈ పుస్తకాన్ని అందించిన తర్వాత, పునర్దర్శనాలు చేసి, బైబిలు పఠనాలు ఆరంభించడానికి ప్రయత్నాలు చేయాలి. మార్చి: యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు అనే పుస్తకానికి రూ. 25.00 చందా. (ఈ పుస్తకం ఆంగ్లంలోను, మలయాళంలోను, తమిళంలోను లభ్యమవుతుంది.) ఇతర భాషల్లో 192-పుటల ఏ క్రొత్త పుస్తకాన్నైనా రూ. 15.00 సాధారణ చందాకు అందించవచ్చు. ఏప్రిల్‌, మే: కావలికోట లేదా జరిల్లు! పత్రికల చందాలు. పక్ష పత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 70.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్ష పత్రికలకు ఆరు నెలల చందా రూ. 35.00. మాసపత్రికలకు ఆరు నెలల చందాలేదు. సూచన: పైన పేర్కొన్న ఏ సాహిత్యాలనూ ఇంతవరకూ ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్‌ ఆర్డరుఫారమ్‌ (S-AB-14) నందు ఆర్డరు చేయాలి.

◼ సంఘ కార్యదర్శి మరియు సేవాధ్యక్షుడు క్రమ పయినీర్లందరి కార్యక్రమాన్ని పునర్విమర్శ చేయాలి. వారిలో ఎవరైనా ఇవ్వబడిన గంటలను చేరుకోటానికి కష్టపడుతున్నట్లయితే, సంఘ పెద్దలు తగిన సహాయాన్ని అందిస్తూ దానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి. సలహాలకొరకు, (S-201) అక్టోబరు 1, 1993, అక్టోబరు 1, 1992ల సొసైటీయొక్క ఉత్తరాలను పునర్విమర్శ చేయండి. అంతేకాక, అక్టోబరు 1986 మన రాజ్య పరిచర్య అనుబంధంనందలి 12-20 పేరాలను కూడా చూడండి.

◼ జ్ఞాపకార్థ ఆచరణ శుక్రవారము, ఏప్రిల్‌ 14, 1995న జరుగుతుంది. ప్రసంగము త్వరగా మొదలుపెట్టబడినప్పటికీ, సూర్యాస్తమయము అయ్యేవరకు జ్ఞాపకార్థ రొట్టెను మరియు ద్రాక్షారసమును అందించడం ప్రారంభించకూడదు. మీ ప్రాంతములో సూర్యాస్తమయము ఎప్పుడు జరుగుతుందో స్థానిక అధికారులనుండి తెలుసుకోండి. ప్రాంతీయ సేవ కొరకైన కూటం తప్ప, మరే ఇతర కూటములను ఆ తేదీనందు జరపకూడదు. మీ సంఘంలో క్రమముగా జరిగే కూటములు శుక్రవారము నాడు ఉన్నట్లయితే, రాజ్యమందిరం లభ్యమవుతున్న యెడల మీరు వాటిని మరొక రోజున జరుపుకోటానికి మార్చుకోవచ్చు.

◼ ఏప్రిల్‌ 23, 1995న జరిగే సంఘకూటాల ముగింపునందు అలాగే ప్రాంతీయ సమావేశము మరియు ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమములందు సమయోచితమైన వర్తమానంగల నాలుగు పుటల కరపత్రాన్ని విస్తృతంగా పంచిపెట్టడంతో ప్రారంభంకానున్న ఒక విశేషమైన పనిని గూర్చి ప్రకటన చేయబడుతుంది. తాము ఎదుర్కొంటున్న కలవరపర్చే సమస్యలను గూర్చి గంభీరంగా తలంచే మరియు నమ్మదగిన నడిపింపుకొరకు వెదికే వారునైన యథార్థ హృదయుల యెడల ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చాలని ప్రచారకులు ప్రోత్సహించబడతారు. మార్చి, ఏప్రిల్‌ మరియు మే నెలల్లో ప్రకటనా పనిని ప్రారంభించే క్రొత్తవారితో సహా ప్రతి ప్రచారకుడు ఈ ప్రత్యేక ప్రచారమందు పూర్తిగా భాగం వహించి, మద్దతునివ్వడానికి ఇష్టపడతాడు.

◼ ప్రచారకుల్లో ఎవరైనా మార్చి, ఏప్రిల్‌ మరియు మే నెలల్లో సహాయ పయినీర్లుగా చేయటానికి ఇష్టపడితే వారు ఇప్పుడే తమ పథకాలను తయారు చేసుకుని, దరఖాస్తులను ముందుగానే ఇవ్వాలి. ఇది సంఘపెద్దలు ప్రాంతీయసేవలో తగిన ఏర్పాట్లు చేయటానికి, అందరికి సరిపడే అన్ని సాహిత్యాలను కలిగివుండటానికి సహాయం చేయగలదు. ఏప్రిల్‌లో ఈ కార్యక్రమమందు సాధ్యమైనంత ఎక్కువమంది పాల్గొనాలని మేము ప్రోత్సహిస్తున్నాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి