విడువక ఇంటింట ప్రకటించుట
1 ప్రాచీన ఇశ్రాయేలునందు, బలులు ప్రతిరోజు అర్పింపబడేవి. (నిర్గ. 29:38-42) బలిపీఠంమీద అగ్ని అలా మండుతుండగా, పైకెగసే “ఇంపైన సువాసనగల హోమము” యెహోవాను ప్రీతిపర్చేది. (నిర్గ. 29:18) ‘దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుడని’ నేడు మనకు ఉద్బోధింపబడింది. (హెబ్రీ. 13:15) ధర్మశాస్త్రమందు సూచింపబడిన బలుల నర్పించుటకు బదులు, మనం విడువక యెహోవాను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తాము.—యెష. 43:21; అపొ. 5:42.
2 ఈ భూమిపై జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప సాక్షియగు యేసుక్రీస్తు, సుత్తియాగము చేయుటద్వారా మనమెలా పరిశుద్ధ ఆరాధనను కొనసాగించాలో బోధించాడు. తన శిష్యులు అత్యవసరంగా వర్తమానం ప్రకటించాలని ఆయన వారికి బోధించాడు. సువార్తను ప్రజలకు చేరవేయడానికి వారి గృహాలయొద్ద వారితో వ్యక్తిగతంగా మాట్లాడుటే అత్యంత ఫలవంతమైన మార్గమని ఆయనకు తెలుసు. (మత్త. 10:7, 12) కాబట్టి ఇంటింట ప్రకటించుడని ఆయనిచ్చిన దైవ ప్రేరేపిత నడిపింపును అపొస్తలులు అనుసరించినట్లు మనం కనుగొంటాము.—అపొ. 20:20.
3 నేటికీ ఆ విషయంలో తేడాలేదు. యేసు శిష్యులుగా, నిజ క్రైస్తవులు ఇంటింట సువార్త ప్రకటించుట ద్వారా ఆయనుంచిన మాదిరి ననుసరిస్తారు. ఆ సేవ చేసినందున మనం విమర్శింపబడినా, హింసింపబడినా ఈ పద్ధతిలోనే యెహోవా తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని రుజువుచేస్తూ, లక్షలాదిమంది సత్యం నేర్చుకున్నారు, వందలవేలమంది క్రొత్త శిష్యులు ప్రతి సంవత్సరము గొప్పసమూహమందు చేరుతున్నారు. అందుకే మన పరిచర్యయందు మనం పట్టుదల కలిగివున్నాము.
4 ఇంటింట ప్రకటించుటలోగల ప్రయోజనాలు: “దేవుడు పక్షపాతి కాడు . . . ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొ. 10:34, 35) క్రమంగా రాజ్య వర్తమానం వినే అవకాశాన్ని ప్రతివారికిస్తూ, మన ప్రాంతమందున్న ప్రతి ఇంటికి నేరుగా వెళ్లుట ఆ నిష్పక్షపాత స్వభావాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తుంది. ఫలితంగా వినేవారు వారివారి అవసరతల ప్రకారం వ్యక్తిగత సహాయం పొందుతారు.
5 దాదాపు ప్రచారకులందరూ అంటే యౌవనులు, వృద్ధులు, ఆలాగే క్రొత్తవారు సహితం, ఈ ఇంటింటి సేవలో భాగం వహించవచ్చును. ఈ విధంగా ప్రతివారు “రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను” వారు కాగలరు. (రోమా. 10:10) ఇంటింటి సేవలో ఇతరులతోపాటు కలిసి పనిచేయుట ప్రేమ, ఐక్యతనే బంధాల్లో మనలను మరింత సన్నిహితుల్ని చేస్తుంది. అదేసమయంలో, ఉపేక్షను లేదా వ్యతిరేకతను మనమెదుర్కొన్నప్పుడు సహనాన్ని కనబరచే అవకాశం మనకివ్వబడుతుంది. విశ్వాసాన్నిలా బాహాటంగా ప్రదర్శించుట మనల్ని ఒక “వేడుకగా” చేస్తుంది, కాగా ఇది బైబిలు బోధించడానికి మనమొక వ్యవస్థీకరించబడిన ఏర్పాటు కలిగియున్నామని, తాము దానినుండి ప్రయోజనం పొందగలమని యథార్థపరులు గ్రహించేలా సహాయం చేస్తుంది. (1 కొరిం. 4:9) యెహోవా ఈ ఇంటింటి సేవను ఆశీర్వదిస్తున్నాడని, తన పరిశుద్ధ ఆరాధనా “మందిరానికి” ఒక గొప్పసమూహమును సమకూర్చుటకు దానిని ఉపయోగిస్తున్నాడని ప్రతివిషయం స్పష్టంగా చూపిస్తోంది.—యెష. 2:2-4.
6 చరిత్రలో క్రితమెన్నటికంటే యిప్పుడు మరెక్కువగా ప్రజలు రాజ్య వర్తమానం వినాలి. ఇకచాలని యెహోవా సెలవిచ్చు పర్యంతం మనం విడువక ఇంటింట ప్రకటించుదము గాక. (యెష. 6:11) అలాచేసినందున, ఈ కాలాంతమందు ప్రాముఖ్యమైన, ప్రయోజనకరమైన ఇంటింటి పరిచర్యలో భాగం వహించుటవలన కలిగే ఆనందభాగ్యం మనదౌతుంది.—1 కొరిం. 15:58.