నేను మారుతూ ఉండవలసిన అవసరముందా?
మన రాజ్య పరిచర్య ప్రతి సంచిక మనం సాక్ష్యమిచ్చేటప్పుడు ఉపయోగించగల వివిధ లేఖనాల వివరణలను అందిస్తుంది. బాగా చురుకుగా ఉండే అనేకమంది ప్రచారకులు కొత్త భావాలను తెలుసుకొని, వివిధ విధములైన సమాచారాన్ని ఉపయోగించడానికి ఆతురతగా ఉన్నారు. మన రాజ్య పరిచర్య ప్రతి నెల అనేకమైన సలహాలను అందిస్తూ వారిని సంసిద్ధులను చేస్తుంది.
అయినా, మీరు ఉపయోగించేదాన్ని మార్చుతూ ఉండవలసిన అవసరం ఉందని మీరు భావించకపోవచ్చు. ప్రతి నెల ప్రాంతీయ పరిచర్యలో గడపడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మీకు లభ్యం అవుతుండవచ్చు. కొంత కాలం నుండి, మీరు సులభమని భావించే కొన్ని ప్రసంగాలను వాడుతూ ఉండవచ్చు, వాటిని ఉపయోగించడం వలన మీకు మంచి ఫలితాలు లభించివుండవచ్చు. కీర్తన 37:9-11, 2 పేతురు 3:13, ప్రకటన 21:4 లతో సహా తరచూ ఉపయోగించే యితర లేఖనాలపై మీరు ఆధారపడుతూ ఉండవచ్చు. అలాగైతే, తరచూ ఏదో ఒకటి మార్చుతూ ఉండడానికి బద్ధులై ఉన్నారని మీరు భావించనవసరం లేదు. రాజ్య నిరీక్షణను యితరులతో పంచుకోవడం, యెహోవా దీవెనలను పొందడానికి వారు ఏమి చేయాలో నేర్చుకోడానికి వారికి సహాయపడడమే మన ప్రథమ లక్ష్యం. రీజనింగ్ పుస్తకం నుండి మీరు ఉపయోగించడానికి యిష్టపడే సమయోచితమైన, ఆకర్షణీయమైన క్లుప్త ప్రసంగాలను కనుగొని, వాటి వలన మీకు చక్కని ప్రతిస్పందన లభిస్తున్నట్లయితే వాటిని ఉపయోగించడానికి వెనుదీయవద్దు.