ఇన్సర్ట్ గా స్కూల్ గైడ్‌బుక్ లోని సమాచారము
కన్నడ, మరాఠి, మరియు తెలుగు లోని మే, జూన్, మరియు జూలై 1994 మన రాజ్య పరిచర్య సంచికలు అదనపు ఇన్సర్ట్ను కలిగి ఉంటాయి. ఈ మూడు ఇన్సర్ట్లు కూడ కలిసి థియోక్రేటిక్ మినిస్ట్రీ స్కూల్ గైడ్‌బుక్ లోని 21-37 అధ్యాయాలలో ఉన్న విషయాలను కలిగి ఉంటాయి, అవి పైన చెప్పబడిన మూడు భాషలలోనికి అనువదింప బడ్డాయి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నియామకాలను సిద్ధపడే సమయంలో సహాయపడటానికి అవి విలువైన ఉపకరణాలుగా ఉండగలవు అలాగే తమ మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనడానికి కూడ ఉపయోగ పడగలవు గనుక ఈ భాషలను ఉపయోగించే సహోదరులు ఇన్సర్ట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము. ప్రత్యేకంగా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను జరిపే సహోదరులు ఈ విషయాలతో ఎక్కువ పరిచయాన్ని పొంది, మరి ఎక్కువగా ఉపయోగించాలని ఇష్టపడవచ్చు.