ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి 40.00 రూ.ల చందాకు. ఇది అందుబాటులో లేనిచోట, మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 40.00 రూ.లకు అందించవచ్చు (చిన్న సైజు నిరంతరము జీవించగలరు అనే పుస్తకం 20.00 రూ.లు). జనవరి: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూరు 4.00 రూ.ల చందాకు. ఇది అందుబాటులో లేనిచోట, ప్రత్యేక అందింపులోని 192 పేజీల పాత పుస్తకాలను 6.00 రూ.లకు అందించవచ్చు. ఈ శ్రేణిలో ఈ క్రింది పుస్తకాలు మావద్ద అందుబాటులో ఉన్నాయి: ఇంగ్లీషు: డిడ్ మ్యాన్ గెట్ హియర్ బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? మరియు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? గుజరాతి: నిన్ను సంతోషపరచు—సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్” మరియు నిత్యజీవమునకు నడుపు సత్యము; హింది: నిన్ను సంతోషపరచు—సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” కన్నడ: నిన్ను సంతోషపరచు—సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్” మరియు “థింగ్స్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఇంపాజిబుల్ ఫర్ గాడ్ టు లై;” మరాఠి: “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్” మరియు లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్; తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరియు నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము. బెంగాలి లేదా నేపాలి భాషలు తెలిసిన వారికి మన సమస్యలు బ్రోషూరును, ఆలాగే పంజాబి తెలిసినవారికి “ఇదిగో! . . . సమస్తము” బ్రోషూరును అందించవచ్చు. మలయాళంలో యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్! అనే పుస్తకాన్ని 12.00 రూ.ల చందాకు అందించవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందించకూడదని దయచేసి గమనించండి. ఫిబ్రవరి: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం పెద్దసైజు 40.00 రూ.లకు, చిన్నసైజు 20.00 రూ.ల చందాకు అందించవచ్చు. మార్చి: క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ (అది ఇంగ్లీషు, మలయాళము, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది) 20.00 రూ.ల చందాకు. ఇది అందుబాటులో లేనిచోట, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని 40.00 రూ.ల చందాకు అందించవచ్చు. (చిన్నసైజు 20.00 రూ.లు) దానితోపాటు ప్రత్యేక అందింపులోని 192 పేజీల పాత పుస్తకాలు ఒక్కొక్కటి 6.00 రూ.లకు అందించవచ్చు. గమనిక: పైన పేర్కొన్న సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డర్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ ఆర్డర్‌లో (S-14) ఆర్డర్ చేయాలి.
◼ సంఘాధ్యక్షుడు గాని లేదా ఆయన నియమించిన మరొకరుగాని డిశంబరు 1 లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘంలోని జమా లెక్కలను తనిఖీ చేయాలి. ఇది చేసిన తర్వాత సంఘంలో ప్రకటించండి.
◼ ప్రతిదినము లేఖనములను పరిశీలించుట—1994 అనే చిన్న పుస్తకాన్ని హింది, మరాఠి, నేపాలి భాషల్లో ముద్రించడానికి పరిపాలక సభ అనుమతించిందని తెలియజేయడానికి మేము ఆనందిస్తున్నాము. ఒకవేళ సంఘాలు వాటికి ఆర్డరు పెట్టకపోతే, వెంటనే చేయవలెనని మేము కోరుతున్నాము.
◼ జ్ఞాపకార్థ దిన కార్యక్రమం 1995లో ఏప్రిల్ 14 శుక్రవారంనాడు సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ఇలా ముందుగానే 1995లో జరిగే జ్ఞాపకార్థదిన ఆచరణ తేదీ తెలియచేయడంవల్ల సహోదరులు అవసరమైతే అందుబాటులో ఉన్న హాళ్లను బుక్ చేసుకోవచ్చు.
◼ మాకు పంపే అన్ని రకాల రెమిటెన్స్‌లను అకౌంట్స్ పేయీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా, లోనావ్లాలో చెల్లించబడే విధంగా పంపించండి. అలాంటి డ్రాఫ్ట్‌లను అందించే బ్యాంక్‌లేవంటే: ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండాలా శాఖకు ఇవ్వబడిన డిమాండ్ డ్రాఫ్ట్‌లు కూడా అంగీకారమే.
◼ మాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు, మీరు క్వార్టో పేపరును (8 1/2” x 11”) లేదా A4 సైజు పేపరును (8 1/4 x 11 1/2”) ఉపయోగించడం అభినందనీయము. వేరే మాటల్లో చెప్పాలంటే, వాచ్‌టవర్ సొసైటి లెటర్‌హెడ్ లేదా సాధ్యమైతే దానికి కొంచెం సమానమైన సైజు పేపరును మీరు ఉపయోగించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. మాకు వస్తున్న అనేక రకాల సైజుల్లోని ఉత్తరాలను ఫైల్ చేయడంలో మాకు ఎదురయ్యే సమస్యను ఇది తొలగిస్తుంది.
◼ అంతేకాకుండా, సొసైటీకి ఉత్తరాలు పంపించేటప్పుడు దయచేసి గట్టి కవర్లను ఉపయోగించండి. సంఘాలు తరచూ చాలా పల్చని పేపరుతో తయారుచేసిన కవర్లలో ఉత్తరాలను, డిమాండ్ డ్రాఫ్ట్‌లను కూడ పంపుతున్నారు. కాబట్టి అవి లోనావ్లాకు చేరే సరికి బాగా నలిగిపోతున్నాయి. కొన్నిసార్లు కవర్లను మాకు అందించేముందు వాటిలో ఉన్న అన్ని కాగితాలను కలిపి దారంతోకట్టి పోస్టాఫీసువారు దయతో అందిస్తుంటారు.
◼ మరి చివరిగా, దయచేసి తగినన్ని స్టాంపులను అతికించండి. మాకువచ్చే కవర్లమీద తగినన్ని స్టాంపులు లేనందువల్ల లేదా అసలు స్టాంపులే లేనందువల్ల మేము తరచూ రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
◼ ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలకు సంబంధించిన 1992 బౌండ్ వాల్యూమ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, మరి వీటి కొరకు ఆర్డరు చేయవచ్చు. ఒకవేళ సంఘాలు అలాంటి వాల్యూమ్‌ల కొరకు ‘స్టాండింగ్ ఆర్డర్’ను పొందాలని కోరితే, వారు అలా చేయవచ్చు. వాటిని తిరిగి ఆర్డర్ చేయకుండానే వారు ఈ వాల్యూమ్‌లను పొందడానికి ఇది హామీ ఇస్తుంది.
◼ మరలా లభ్యమౌతున్న సాహిత్యాలు:
ఇంగ్లీషు: జెహోవాస్ విట్నెసెస్ ఇన్ ది ట్వంటియత్ సెంచరీ; హింది: జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!
◼ అందుబాటులో ఉన్న క్రొత్త సాహిత్యాలు:
కొంకణి, నేపాలి: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?