దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
నవంబరు 1, 1993 నుండి ఫిబ్రవరి 14, 1994 మధ్య వారములందలి ప్రసంగముల సమాచారముపై ఆధారపడి, పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష అనుమతించిన సమయములోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధనకై యివ్వబడినవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. ఎజ్రా గ్రంథమందు, హెబ్రీగ్రంథ జాబితా సమకూర్చే కాలం వరకు యెహోవా యూదులతో వ్యవహరించిన విధానం నివేదించబడింది. [ఎస్‌ఐ పుట 85 పేరా 7 (1983 సంపుటి పుట 86 పేరా 7)]
2. మొదట్లో, ఎజ్రా, నెహెమ్యా ఒకే పుస్తకంగా ఉండి అవి ఎజ్రా అని పిలువబడేవి. [ఎస్‌ఐ పుట 88 పేరా 3 (పుట 88 పేరా 3)]
3. ప్రసంగించేటప్పుడు ప్రసంగమంతటిలో అమితోత్సాహాన్ని ప్రదర్శించటం అంత మంచిది కాదు. [ఎస్‌జి పుట 164 పేరా 6]
4. యూదా బొత్తిగా నాశనము చేయబడినప్పటినుండి సా.శ. పూ. 537లో సత్యారాధన పునఃస్థాపించబడే వరకు 70 సంవత్సరములు పూర్తిగా లెక్కించవలెనని రెండవ దినవృత్తాంతములందలి చివరి వచనాలు నిరూపిస్తున్నాయి. [ఎస్‌ఐ పుట 84 పేరా 35 (పుట 84 పేరా 35)]
5. క్రమంగా కూటములలో వ్యాఖ్యానించుట మీరు ఒక గుంపు ముందు మాట్లాడటానికి అలవాటు పడుటకు సహాయం చేస్తుంది. [ఎస్‌జి పుట 183 పేరా 14]
6. “దాను వంశపురాలగు . . . స్త్రీ” దాను గోత్రంలోని పురుషున్ని కూడా వివాహం చేసుకుంది. (2 దిన. 2:14) [వారపు బైబిలు పఠనము; w79 4/15 పుట 31 చూడండి]
7. రాజైన ఆసా శవం దహనం చేయబడిందని రెండవ దినవృత్తాంతములు 16:14 సూచిస్తున్నది. [వారపు బైబిలు పఠనము; w76 పుట 416 చూడండి.]
8. లూకా 11:51 లో, యేసు యెహోయాదా కుమారుడైన జెకర్యాను రాళ్లతో కొట్టుటను సూచిస్తున్నాడు. (2 దిన. 24:20, 21) [వారపు బైబిలు పఠనము; w80 3/1 పుట 31 చూడండి.]
9. యెహోవాసాక్షులలో ఎవరన్నా ఒకరు జ్ఞాపకార్థదినానికి హాజరు కాకపోతే, 30 రోజుల తర్వాత దాన్ని ఆచరించాలి. (2 దిన. 30:2) [వారపు బైబిలు పఠనము; w85 3/1 30 చూడండి.]
10. చెరగా కొనిపోబడిన యూదులు “ఏడవ నెలలో,” లేదా దాదాపు సా.శ.పూ. 537 అక్టోబరు 1వ తారీఖున తమ స్వదేశంలో తిరిగి స్థిరనివాసమేర్పరచుకున్నారు. (ఎజ్రా 3:1) [వారపు బైబిలు పఠనము; ఎస్‌ఐ పుట 283 పేరా 29 (పుట 282 పేరా 30) చూడండి.]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:
11. ప్రసంగాన్ని తగిన సమయమందు ముగించడానికి ప్రాథమికంగా ఏమి అవసరం? [ఎస్‌జి పుట 179 పేరా 25]
12. భూసంబంధమైన ఆలయముకన్నా ఏ ఆలయం అమిత మహిమగలది? [ఎస్‌ఐ పుట 87 పేరా 16 (పుట 87 పేరా 16)]
13. స్వరభేదమంటే ఏమిటి? [ఎస్‌జి పుట 160 పేరా 11]
14. దృష్టాంతపు అన్వయింపును ఎందుకు స్పష్టపరచాలి? [ఎస్‌జి పుట 169 పేరా 10]
15. ఒక ప్రసంగీకుడు ఎక్కువ సమయము తీసుకుంటే, అతని ప్రసంగ ముగింపుపై అదెలా ప్రభావం చూపుతుంది? [ఎస్‌జి పుట 177 పేరా 16]
16. బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు దానిని టేప్ చెయ్యడం ఎందుకు అయుక్తము కాదు? (2 దిన. 33:18) [వారపు బైబిలు పఠనము: w78 1/1 పుట 32 చూడండి.]
17. చరిత్రయందు ఆస్నప్పరుకి ఏ పేరు వాడబడింది? (ఎజ్రా 4:10) [వారపు బైబిలు పఠనము; w89 8/1 30 చూడండి.]
18. పరదేశీ భార్యల పిల్లలు తమ తల్లులతో కూడా ఎందుకు వెళ్లగొట్టబడ్డారు? (ఎజ్రా 10:3, 44) [వారపు బైబిలు పఠనము; w86 2/1 30]
19. “అర్తహషస్త రాజు ఏలుబడిలో ఇరవదియవ సంవత్సరం” ఏది? (నెహె. 2:1) [వారపు బైబిలు పఠనము; w93 4/1 11 చూడండి.]
20. ధర్మశాస్త్రం యొక్క “అర్థం” ఎలా చెప్పబడేది? (నెహె. 8:8) [వారపు బైబిలు పఠనము; w86 3/1 28 చూడండి.]
21. ప్రసంగంలో ఉపయోగించబడే ఏ ఉదాహరణైనా దేనికి తగినదై ఉండాలి? [ఎస్‌ఐ పుట 171 పేరా 20]
ఈ క్రింది వాక్యములను పూరించుటకు అవసరమైన పదాన్ని లేక మాటను చేర్చండి:
22. బబులోను చెర తర్వాత, నమ్మకస్థులైన యూదుల శేషము_________________________లో బలిపీఠము నిర్మించి, బలులనర్పించింది. [ఎస్‌ఐ పుట 85 పేరా 3 (పుట 85 పేరా 3)]
23. ప్రసంగీకునికి తన ప్రేక్షకులపై స్నేహశీలత ఉన్నట్లయితే, అది అతని_________________________లో కనబడాలి. [ఎస్‌జి పుట 166 పేరా 13]
24. మన పరిచర్యలో దైవపరిపాలనా సంబంధమైన పదాలు ఉపయోగించినట్లయితే, మనం వాటిని_________________________ప్రాముఖ్యము. [ఎస్‌జి పుట 173 పేరా 5]
25. ముగింపుయొక్క ముఖ్య ఉద్దేశం_________________________[ఎస్‌జి పుట 175 పేరా 4]
26. ప్రసంగీకుడు స్పీకర్ స్టాండుపై_________________________కూడదు. [ఎస్‌జి పుట 186 పేరా 26]
27. మొదటి తిమోతి 3:1తో పొందికగా సహోదరులు_________________________తమను అందుబాటులో ఉంచుకోగలరు. [ఎస్‌జి పుట 190 పేరా 10]
ఈ క్రింది వాక్యాలనుండి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి:
28. ఎజ్రా దినవృత్తాంతములు వ్రాయడాన్ని పూర్తి చేసిన సంవత్సరము సా.శ.పూ. (c. 515; c. 460; c. 537) [ఎస్‌ఐ పుట 79 పేరా 1 (పుట 79 పేరా 1)]
29. పారశీకరాజైన (కోరేషు, హషస్త, అర్తహషస్త) ఏలుబడి కాలంలో నెహెమ్యా పరిచర్య చేశాడు. [ఎస్‌ఐ పుట 88 పేరా 1 (పుట 88 పేరా 1)]
30. “పండుగ” అని (2 దిన. 7:8లో) సూచింపబడినది (పర్ణశాలల; వారముల; పులియని రొట్టెల) పండుగ. [వారపు బైబిలు పఠనము; పిఎం పుట 53 చూడండి.]
క్రింది ఇవ్వబడిన వాక్యాలతో ఈ లేఖనాలను జతచేయండి: 2 దిన. 9:9; 2 దిన. 19:7; 2 దిన. 28:16, 20, 21; 2 దిన. 36:20, 21; నెహె. 5:7.
31. అనవసరంగా లోకంతో అమితంగా కలిసిపోవడం వినాశకరం కావచ్చు. [వారపు బైబిలు పఠనము; w85 9/1 29 చూడండి.]
32. లంచం విషయంలో సరైన దృష్టి కల్గియుండడానికి దేవుడు సరైన కట్టడనుంచాడు. [వారపు బైబిలు పఠనము; w87 10/1 30 చూడండి.]
33. లేవీయకాండము 25:36, ద్వితీయోపదేశకాండము 23:19లోని యెహోవా ధర్మశాస్త్రాన్ని ఇది సూటిగా ఉల్లంఘించుటయే. [వారపు బైబిలు పఠనము; w86 3/1 27 చూడండి.]
34. ఇది 5,00,00,000 డాలర్ల కన్నా విలువగల కానుకను గురించి చెబుతుంది. [వారపు బైబిలు పఠనము; g87 11/22 పుట 4 చూడండి.]
35. ఇశ్రాయేలీయుల 70 సంవత్సరాలు బబులోను చెరలో నుండుటకు గల కారణాలలో ఒకటి దేవుని విశ్రాంతి నియమములను ఉల్లంఘించుటే. [వారపు బైబిలు పఠనము; g79 9/22 పుట 9 చూడండి.]