ప్రాంతీయ సేవకు విశేషమైన నెల
1 మీకు ప్రాంతీయ సేవ కొరకు డిశంబరు విశేషమైన నెలగా ఉండగలదా? మీ అనుదిన చర్యలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసిన అవసరముండవచ్చు, కాని దానికి లభించే ప్రతిఫలం అలా చేయడాన్ని అమూల్యంగా చేయదా?
2 బాప్తిస్మం పొందిన కొందరు యువక్రైస్తవులకు, ఈ నెలలో ఎక్కువ సెలవు రోజులు లభిస్తాయి కాబట్టి, సహాయ పయినీరు సేవ చేయడానికి ఇష్టపడవచ్చు. ప్రాంతీయ సేవలో సంఘ పెద్దలతోను, పరిచారకులతోను, ఇతర ప్రచారకులతోను సేవ చేయడం వారిని ఎంతగా ప్రోత్సాహపరుస్తుందో! మీ వ్యక్తిగత పరిస్థితులు మిమ్మల్ని ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేయుటకు అనుమతించనట్లయితే, పయినీరు సేవ చేసేవారితో కలిసి ప్రాంతీయ సేవలో కొన్ని ఎక్కువ గంటలు సేవ చేయడానికి మీకు సాధ్యమౌతుందా? ఇది తప్పకుండా పరస్పరం ప్రోత్సాహాన్నిస్తుంది.
3 ప్రచారకులందరూ గట్టి ప్రయత్నం చేస్తే, సెలవు రోజుల్లో పయినీరు సేవ చేసేవారికి ప్రాంతీయ సేవలో ఎవరో ఒకరు తోడుండే విధంగా ప్రతి రోజు అందరు కలిసి గుంపుగా సాక్ష్యమివ్వడానికి పెద్దలు ఏర్పాట్లు చేయగలరు.
4 వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంలో అందరూ కలిసికట్టుగా డిశంబరు నెలను ప్రాంతీయ సేవకు విశేషమైన నెలగా ఏర్పాటు చేయవలసిన సమయమిదే.