ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: సెప్టెంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు. పెద్ద సైజు రూ. 40.00 చిన్న సైజు రూ. 20.00 చందాకు అందజేయవచ్చును. అక్టోబరు: అవేక్! లేక కావలికోటలకు చందా. పక్షపత్రికలకు సంవత్సర చందా రూ. 60.00. పక్షపత్రికలకు ఆరునెలల చందా, మాసపత్రికలకు సంవత్సర చందా రూ. 30.00. మాసపత్రికలకు ఆరునెలల చందా ఏర్పాటు లేదు. చందా చేయుటకు నిరాకరించినచోట రూ. 3.00కు ఒకొక్క పత్రికను అందజేయవచ్చు. తగిన సమయంలో మాన్‌కైండ్స్ సర్చ్ ఫర్ గాడ్ అనే పుస్తకాన్ని రూ. 30.00కి అందజేయవచ్చు. నవంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలి స్క్రిప్చర్స్‌తోపాటు ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మాన్స్? అనే పుస్తకాన్ని రూ. 72.00కు లేదా రూ. 60.00 మరియు రూ. 12.00కు ఒకొక్కటి విడిగా అందజేయవచ్చు. ఇది అంగీకరించని చోట, లేక ఇవి అందుబాటులోలేని భాషలలో, 192 పేజీల పాత పుస్తకాలను ప్రత్యేక అందింపు క్రింద రూ. 6.00కు అందజేయవచ్చు. ఈ శ్రేణిలో ఈ క్రింది పుస్తకాలు మా వద్ద అందుబాటులో వున్నాయి: ఇంగ్లీషు: డిడ్ మాన్ గెట్ హియర్ బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్? జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? గుజరాతి: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్”, నిత్యజీవమునకు నడుపు సత్యము: హింది: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్” కన్నడ: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్”, “ధింగ్స్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఇంపాజిబుల్ ఫర్ గాడ్ టు లై;“మరాఠి: “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్,” లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్, నిత్యజీవమునకు నడుపు సత్యము; తమిళం: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, “లెట్ యువర్ కింగ్‌డమ్ కమ్;” తెలుగు: జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?, బెంగాలి మరియు నేపాలి వచ్చిన వారికి మన సమస్యలు బ్రోషూరును, పంజాబి తెలిసినవారికి “లుక్” బ్రోషూరును అందజేయవచ్చు. మలయాళంలో యువర్ యూత్—గెటింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్! రూ. 12.00కు అందజేయవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రత్యేక ధరకు అందజేయకూడదని గమనించండి. డిశంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని రూ. 40.00లకు అందజేయాలి. ఇది అందుబాటులో లేనట్లైతే, మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ లేక మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాలను రూ. 40.00 చందాకు అందజేయవచ్చును (నిరంతరము జీవించగలరు చిన్నసైజు పుస్తకం రూ. 20.00 చందాకు అందజేయండి). గమనిక: పైన పేర్కొనబడిన సాహిత్యాల కొరకు ఇంకా ఆర్డరు చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ ఆర్డరులో (ఎస్-14) ఆర్డరు చేయాలి.
◼ సంఘాధ్యక్షుడు గాని లేదా ఆయనచే నియమింపబడిన మరొకరుగాని సెప్టెంబరు 1 లేదా తరువాత వీలైనంత త్వరగా సంఘ అకౌంట్సును తనిఖీ చేయవలెను. ఇది చేసిన తరువాత సంఘంలో ప్రకటించండి.
◼ అక్టోబరులో సహాయ పయినీరుగా చేయాలనుకుంటున్న ప్రచారకులు తమ అప్లికేషన్లను త్వరగా ఇవ్వాలి. సాహిత్యం మరియు క్షేత్రం విషయంలో అవసరమైన ఏర్పాట్లు చేయుటకు ఇది పెద్దలకు వీలుకలుగజేస్తుంది.
◼ ఏప్రిల్ 15, 1991 ది వాచ్‌టవర్‌లోని 21-3 పేజీలలో, తిరిగి సంఘంలో సభ్యులగుటకు ఇష్టపడే బహిష్కరింపబడిన లేక సహవసించని వారిని గూర్చి ఇవ్వబడిన సూచనలను గమనించాలని పెద్దలకు గుర్తుచేయబడుతున్నది.
◼ ది వాచ్‌టవర్ యొక్క 1970 నుండి 1979 సంవత్సరాల బౌండు వాల్యూమ్‌లను సంస్థ ఇపుడు పర్మినెంట్ స్టాక్ ఐటమ్స్‌గా తయారుచేస్తున్నది. ఈ బౌండు వాల్యూమ్‌లను పొందాలని ఇష్టపడుతున్నవారు వాటిని సంఘము ద్వారా కోరవచ్చును. బౌండు వాల్యూమ్‌లు ప్రత్యేక—వినతి ఐటమ్సని గుర్తుంచుకోండి.
◼ పూనా 1993 జిల్లా సమావేశ కార్యక్రమము గురువారము మధ్యాహ్నం 12:20 నిమి.లకు ప్రారంభమవుతుంది.
◼ మద్రాసు 1993 జిల్లా సమావేశ కార్యక్రమము నాలుగు రోజులూ మధ్యాహ్నము 1:00కు ప్రారంభమవుతుంది.