ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: డిశంబరు: న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ తో కలిపి ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? రూ. 60. బెంగాలి, నేపాలి: మన సమస్యలు బ్రోషూరు. ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అనే పుస్తకం అందుబాటులో లేని ఇతర భాషలలో నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ఉపయోగించండి. జనవరి 1993: ఒకటి రూ. 6 చొప్పున 192-పేజీల పాత పుస్తకముల ప్రత్యేక అందింపు. మలయాళము, తమిళములో: ట్రూ పీస్ అండ్ సెక్యూరిటీ—ఫ్రం వాట్ సోర్స్? (పాత సంచిక). గుజరాతిలో: నిత్యజీవమునకు నడుపు సత్యము, జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? హిందీ, కన్నడలో: నిన్ను సంతోషపరచు సువార్త, “లెట్ యువర్ కింగ్‌డం కమ్.” తెలుగులో: “జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? మరాఠీలో: లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్ మరియు జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? బెంగాలి, నేపాలి: మన సమస్యలు బ్రోషూరు. ఫిబ్రవరి: నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 40. (చిన్నసైజు రూ. 20.) మార్చి: యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకం రూ. 20. ఇది లభ్యముకాని భాషలలో నిరంతరము జీవించగలరు పుస్తకం రూ. 40. (చిన్నసైజు రూ. 20.)
గమనిక: పైన సూచింపబడిన సాహిత్య అందింపుల్లో కొన్ని సవరణలు కలవు. ఇది ఎందుకనగా ‘ఇండియా కొరకు’ ఏర్పాటుచేయబడిన మన రాజ్య పరిచర్య లో ఒక సవరణ ఉంది, ఇది తర్వాతి ప్రకటనలో వివరింపబడింది. పైన ప్రస్తావించబడిన సాహిత్యాల కొరకు ఇంకను ఆర్డరుచేయని సంఘములు తమ తదుపరి లిటరేచర్ ఆర్డరు ఫారమును (S–14) పంపినప్పుడు వాటి కొరకు ఆర్డరు చేయవలెను.
◼ తర్వాతి సంచిక, అనగా 1993 జనవరి నుండి, ‘ఇండియా కొరకైన’ మన రాజ్య పరిచర్య కూడ ‘అమెరికా కొరకైన’ సంచికతోపాటు ఏకకాలములో ప్రచురింపబడును. ఇప్పటివరకు మీరు ‘ఇండియా కొరకైన’ మన రాజ్య పరిచర్య లో మీరు కోరిన శీర్షిక కొరకు సొసైటి ఇండెక్సులో చూసినప్పుడు అది ఇండెక్సులో చూపబడిన రెఫరెన్సుకు ఒక నెల తర్వాతి సంచికలో ఉండేది. జనవరి 1993 తర్వాత మీరు కోరిన రెఫరెన్సులు ఇండెక్సులో చూపబడిన రెఫరెన్సు ప్రకారమే మన రాజ్య పరిచర్య లో అదే సంచికలో ఉంటాయి. ఆ విధంగా ప్రపంచములోని అనేకమంది ఇతర సహోదరుల వలెనే మనం కూడ ఏకకాలంలో సమాచారాన్ని, ఉపదేశాన్ని పొందుతాము. దీనిలో ఇమిడియున్న వివిధ డిపార్టుమెంట్లలో చేపట్టిన మార్పుల కారణంగా ఇది సాధ్యమైంది. ఇంగ్లీషులోను ఆలాగే ఈ బ్రాంచి నిర్వహించే వేర్వేరు భాషల్లోను ఏకకాలంలో ఆత్మీయాహారాన్ని సమకూర్చే ఇటువంటి గొప్ప ముందంజ వేయుటకు శక్తిమంతులను చేసిన యెహోవాకు మనం కృతజ్ఞులమై యున్నాము.—ఫిలి. 2:2.
◼ సంవత్సరానికి సరిపడు ఫారమ్స్ ఈ డిశంబరు నెలలో అన్ని సంఘాలకు పంపబడును మరియు వీటి ఖరీదు డిశంబరు స్టేట్‌మెంటులో చార్జి చేయబడును. సంబంధిత సహోదరులకు ఆయా ఫారమ్స్‌ను అందజేయుటకు సంఘ సెక్రెటరీలందరికి ఒక చెక్‌లిస్టు కూడ పంపబడును. చెక్‌లిస్టులో చూపబడిన తేదీలకు సరిపడని మీ దగ్గరున్న ఫారాలన్నింటిని చింపివేయవలెను. జ్ఞాపకార్థ దినంయొక్క ఆహ్వానప్రతులు కూడా మీకు పంపబడును.
◼ ఇయర్ బుక్స్ నేరుగా బ్రూక్లిన్‌నుండి పంపబడతాయి గనుక ఇయర్ బుక్స్ ఆర్డరుచేసే సమయంలో యిచ్చిన చిరునామాకే ఆయాసంఘాలకు అవి పంపబడతాయి. అప్పటినుండి ఒకవేళ మీ చిరునామా మారినట్లయితే, మీరిచ్చిన ఆర్డరు మీకు చేరునట్లు మీ పాత పోస్టాఫీసులో మర్చిపోకుండా మీరు కదిలివెళ్లే క్రొత్త అడ్రసు ఇవ్వండి.
◼ డిశంబరు 7తో ఆరంభమగు వారంతో ప్రారంభించి బెంగాలి, గుజరాతి, హిందీ, నేపాలి, తెలుగు మన రాజ్య పరిచర్య సంచికలందు మొదటి బుక్‌లెట్‌గా విడుదలకు నడుపు దైవిక సత్యమార్గము, రెండవ బుక్‌లెట్‌గా కురుక్షేత్రం నుండి ఆర్మగెద్దోను వరకు—మరియు మీరు జీవముతో తప్పించుకొనుట అను వాటినుండి పుస్తకపఠన పట్టికగా వేయుచున్నాము. ఈ భాషల నుపయోగించు పుస్తక పఠన గుంపులు పట్టికవేయబడిన ప్రకారము ఈ బుక్‌లెట్ల నుండి పఠనము చేయవలెను. ఇతర గుంపులు రెవలేషన్—ఇట్స్ గ్రాండ్ క్లైమాక్స్ అను పుస్తకమునుండి తమ పఠనాన్ని కొనసాగింతురు.
◼ సంఘాధ్యక్షుడు లేక ఆయన నియమించిన మరొకరు సంఘ జమాలెక్కలను డిశంబరు 1 లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా తనిఖీ చేయవలెను. అలాచేసిన తరువాత సంఘమునకు ఒక ప్రకటన చేయండి.
◼ వార్షిక వచనం 1993 సంవత్సరం కొరకు: “యెహోవా . . . నాకు బోధింపుము. . . . నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”—కీర్తన 86:11. సంఘాలన్నీ, 1993 జనవరి 1న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా క్రొత్త వార్షిక వచనం కల్గివుండే బోర్డును ముందే తయారుచేసుకొని వుంటే మంచిది.
◼ లభ్యమగు క్రొత్త సాహిత్యం: సింధి: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను!” (బ్రోషూరు).