ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: అక్టోబరు: క్రియేషన్ పుస్తకము రూ. 40. (చిన్న సైజు రూ. 20) ఇవి అందుబాటులో లేనట్లయిన నిరంతరము జీవించగలరు లేక బైబిల్ స్టోరీస్ పుస్తకములను ఉపయోగించుము. నవంబరు: అవేక్! లేక/మరియు వాచ్‌టవర్‌ల కొరకు చందాలు. పక్షపత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 60. ఆరునెలల చందా రూ. 30. నెలసరి పత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 30. నెలసరి పత్రికలకు ఆరు నెలల చందా ఏర్పాటు లేదు. డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు మరియు ది బైబిల్ గాడ్స్‌వర్డ్ ఆర్ మ్యాన్స్? (ప్రాంతీయ భాషలో సాహిత్య అందింపు: ప్రత్యేక ధరలో పాత సాహిత్యములు) జనవరి 1993: ది గ్రేటెస్ట్ మ్యాన్ పుస్తకము రూ. 40. అది అందుబాటులో లేనట్లయిన బైబిలు స్టోరీస్ పుస్తకము లేక నిరంతరము జీవించగలరు అనే పుస్తకమును అందించుము. ఫిబ్రవరి: 192-పేజీల పాత పుస్తకముల ప్రత్యేక అందింపు. ఒక్కొక్కటి 6 రూ.
◼ భవిష్యత్తులో సంఘమందు ప్రాంతీయకాపరి దర్శనము అయిన తరువాత S-2b ఫారము పై పెద్దల లేక పరిచారకుల సిఫారసులేగాని లేక తొలగింపులేగాని లేని పక్షంలో ఆ ఫారమును సొసైటి తిరిగి సంఘమునకు పంపదు. సంఘ ఫైల్‌లో తాజాగావున్న ఇటీవలి S-2b ఫారమునుబట్టే సంఘములో సేవచేయువారిని గుర్తించటం జరుగుతుంది. ఏవైనా క్రొత్త సిఫారసులు, లేక తొలగింపులున్నప్పుడే సొసైటి S-2b ఫారమును దాని వెనుకవైపు వాచ్‌టవర్ సొసైటి ముద్ర మరియు తారీఖుతో తిరిగి పంపుతుంది.
◼ సెప్టెంబరు 1, 1992 నుండి, ఇండియాలో మూడు క్రొత్త సర్క్యూట్‌లు ఏర్పాటుచేయబడినవి. కేరళలో క్రొత్తగా ఏడవ సర్క్యూట్ ఏర్పాటుచేయబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటకలలో రెండవ సర్క్యూట్‌లు ఏర్పరచబడినవి. వాటితో ఇప్పుడు దేశములో ఇరవై సర్క్యూట్‌లుండగా, వాటిలో అయిదు ‘A’ మరియు ‘B’ విభాగాలుగా ఉన్నవి. మొత్తం 21 మంది ప్రాంతీయ కాపరులు దాదాపు 375 సంఘాలుగాను 75 ప్రత్యేకంగా ఉన్న ప్రచారకుల గుంపులుగాను రిజిస్టర్ చేయబడియున్న వాటిని దర్శిస్తారు. వీరు ఒక్కొక్క దానిని సంవత్సరమునకు రెండుసార్లు దర్శించులాగున చూతురు. 1993లో జరుగు 26 ప్రాంతీయ సమావేశములలో ఒక పూర్తికాల జిల్లా కాపరి, మరొక పాక్షిక-కాల జిల్లాకాపరి సేవచేసెదరు. ఈ ఏర్పాట్లు సహోదరులకు ప్రయోజనము కలుగజేసి సంఘములను బలపరచగలవని ఆశిస్తున్నాము.—అపొ. 16:5.
◼ నవంబరు మాసములో సహాయ పయినీర్లుగా సేవచేయడానికి ఆలోచించుకొనువారు ముందుగానే తమ దరఖాస్తులు ఇవ్వవలెను. తద్వారా పెద్దలు సాహిత్యములు మరియు క్షేత్రసంబంధంగా అవసరమైన ఏర్పాట్లు చేయవీలగును.
◼ వెలివేయబడి లేక సహవాసం మానివేసి తిరిగిచేర్చుకొనబడుటకు ఇష్టపడువారిని గూర్చి ఏప్రిల్ 15, 1991, వాచ్‌టవర్ 21-3 పేజీలలో ఇవ్వబడిన ఉపదేశానుసారముగా చర్యగైకొనుటకు పెద్దలు జ్ఞాపకము చేయబడుచున్నారు.
◼ ఆర్గనైజ్డ్ టు అకంప్లిష్ అవర్ మినిస్ట్రీ, పుస్తకం 103-4 పేజీలలో మన ప్రాంతీయ సేవా గంటలలో వేటిని కలుప వచ్చుననే విషయంలో సూచన ఇవ్వబడింది. ఈ విషయంలో బహిరంగ ప్రసంగాన్ని అనువదించే వ్యక్తి ఆ సమయాన్ని లెక్కించుకోవచ్చా అనే సందేహం వెలిబుచ్చారు. అవును, ప్రసంగీకుడు, అలాగే అనువాదకుడు వారి ప్రాంతీయ సేవా రిపోర్టులో ఈ సమయాన్ని కలుపవచ్చును.
◼ నవంబరు మాసం నుండి, ఆయా నెలలలో ప్రాంతీయ భాషా మన రాజ్య పరిచర్య లందు వివిధ సాహిత్య అందింపులను మేము సూచించటం జరుగుతుంది. ఇది ఆ భాషలో లభ్యమౌతున్న సాహిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేయబడటం జరుగుతుంది. ఈ అందింపు కార్యక్రమము కొరకు సాహిత్యము ఆర్డరు వేయునట్లు చాలా ముందుగానే ఈ అందింపులు సూచించబడును. ప్రత్యేక అందింపు కార్యక్రమ ఆరంభంలోనే సాహిత్యం లభ్యమగుటకై సేవాధ్యక్షులు వీటిని తగినంత ముందుగా ఆర్డరు చేయునట్లు చూడాలి. ప్రచారకులు వ్యక్తిగతంగా ఆర్డరు చేయకూడదు. మీకేవైనా నిర్దిష్టంగా కావాలంటే వాటిని సంఘంద్వారా ఆర్డరు వేయండి.
◼ సంఘములన్ని దాని ప్రాంతమునకు వేరువేరు పటములను తయారుచేయవలెనని కోరుతున్నాము. ఇందుకుగాను మేము ప్రతి సంఘానికి టెరటరీ మ్యాప్ కార్డులు (S-12) వాటి ప్లాస్టిక్ హోల్డర్లు వాటితోపాటు టెరిటరీ అసైన్‌మెంట్ రికార్డు కార్డు (S-13) పంపుతున్నాము. ఈ ఫారములు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే భవిష్యత్తులో వాటిని మీరు ఆర్డరు చేయవచ్చు. ఈ ఫారములను ఉపయోగించు విధానమును తెలిపే ఒక లెటరు కూడా వాటితోపాటు పంపబడుతుంది. సంఘ సేవా కమిటీలు, ప్రత్యేకంగా సేవాధ్యక్షుడు మరియు క్షేత్ర వ్యవహారములను నిర్వహించు సహోదరుడు వీటిపై వెంటనే పనిచేయవలెను. మొట్టమొదట మీ ప్రాంతపు రోడ్డు మ్యాప్‌ను తీసుకొని, అందులోని పోస్టాఫీసులను వ్రాసుకొనండి. అవసరమైతే మీ పొరుగు సంఘ పెద్దలనైనా సంప్రదించి మీ ప్రాంతపు హద్దులను నిర్ణయించండి. దీనివలన మేము భవిష్యత్తులో పంపే సూచనలను నెరవేర్చటం సులభమవుతుంది.
◼ లభ్యమగు క్రొత్త సాహిత్యములు:
ఒరియా: వాట్ డు జెహోవాస్ విట్‌నెసెస్ బిలీవ్? (ట్రాక్ట్ నెం. 14); లైఫ్ ఇన్ ఎ పీస్‌ఫుల్ న్యూ వరల్డ్ (ట్రాక్ట్ నెం. 15); వాట్ హోప్ ఫర్ డెడ్ లౌవ్డ్ వన్స్? (ట్రాక్ట్ నెం. 16). సింధి: మన సమస్యలు—వాటిని పరిష్కరించుకొనుటకు ఎవరు సహాయ పడుదురు?