ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: జూన్: ది వాచ్‌టవర్ ఒక సంవత్సరపు చందా రూ. 60. ఆరునెలలకును, నెలసరి పత్రికలకును సంవత్సరం చందా రూ. 30. (నెలసరి సంచికలకు ఆరునెలల చందాలు లేవు.) చందా సేకరించనిచోట రెండు పత్రికలు ఒక బ్రోషూరుతో కలిపి రూ. 9 లకు అందించుము. జూలై: ది బైబిలు—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్ రూ. 12. (ప్రాంతీయ భాషలో: 192-పేజీల పాతపుస్తకము ఒకటి రూ. 6 లకు అందించుము.) ఆగస్టు: బ్రోషూరును ఉపయోగించుము. “మన సమస్యలు—వాటిని పరిష్కరించుకొనుటకు ఎవరు సహాయము చేయగలరు?” ఇది అందుబాటులో లేనిచోట ఈ క్రింది 32 పేజీల బ్రొషూర్లలో దేనినైనను ఉపయోగించుము: మీరు త్రిత్వమును నమ్మవలయునా?, ది డివైన్ నేమ్ దట్ విల్ ఎండ్యూర్ ఫరెవర్, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, ఒక్కొక్కటి 3.00 రూ. సెప్టెంబరు: నిరంతరము జీవించుము అనే పుస్తకము 40 రూ.లు. (చిన్నది 20 రూ.లు) అక్టోబరు: క్రియేషన్ పుస్తకము 40 రూ.లకు. (చిన్న సైజు రూ. 20) ఇవి అందుబాటులో లేనట్లయిన నిరంతరము జీవించుము లేక బైబిల్ స్టోరీస్ పుస్తకములను ఉపయోగించుము.
◼ 1993 కేలండర్లు, ఇయర్ బుక్స్, ఎగ్జామినింగ్ ది స్ర్కిప్చ్‌ర్స్ కొరకు జూలై 6 లోపల ఆర్డర్లు పంపమని సంఘములు కోరబడుతున్నవి. వీటికొరకై ప్రత్యేక ఆర్డరు ఫారంలు ఇప్పటికే పంపబడినవి.