దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
మార్చి 2, నుండి జూన్ 15, 1992 మధ్యవారములలోని నియామకముల సమాచారముపై ఆధారపడి, పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయములోపల, మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోవున్న రెఫరెన్సులు మాత్రమే మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:
1. మోషే ధర్మశాస్త్రము క్రింద పాపములన్నియు, పాపులందరు ఒకేరీతిగా పరిగణించబడిరి. [యస్‌ఐ పే. 29 పేరా 34 (1983 ఎడి. పే. 29 పేరా 34)]
2. సంఖ్యాకాండము అను పేరు సీనాయి పర్వతము దగ్గర, ఆ తదుపరి మోయాబు మైదానములోను ప్రజలను లెక్కించుట సంబంధముగా వచ్చినది. [యస్‌ఐ పే. 30 పేరా 2 (పే. 30 పేరా 2)]
3. విషయములను యథార్థముగా తెలియజేయుటలో సంఖ్యాకాండము మాదిరికరమైనదైనను, మోషే తన పొరపాట్లను బయటపెట్టక దాచియుంచాడు. [యస్‌ఐ పే. 31 పేరా 7 (పే. 31 పేరా 7)]
4. ధర్మశాస్త్రము క్రింద పాపమునకు ఎల్లప్పుడు ప్రాయశ్చిత బలి, ఒప్పుకొనుట, పశ్చాత్తాపము, అవసరమైన మేరకు దిద్దుబాట్లను చేసికొనుట కోరబడినది. [యస్‌ఐ పే. 29 పేరా 32 (పే. 29 పేరా 32)]
5. “బహిరంగముగా శపించుట (NWలో ఉన్న ప్రకారము)” వాస్తవమునకు దైవదూషణయైయున్నది. (లే. కాం. 5:1) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 9/1 పే. 13 చూడుము.]
6. పాపపరిహారార్థ బలిగా ప్రధానయాజకుడు “తన నిమిత్తము తన యింటివారి నిమిత్తము” కోడెను అర్పించుట, యేసు బలి “తన యింటివారైన” ఆయన క్రింది ఉపయాజకులకు అన్వయింపబడుటను సూచిస్తుంది. (లే. కాం. 16:6) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 3/1 పే. 28 చూడుము.]
7. ఒక సహోదరునియొద్ద వడ్డీ తీసుకొనుట ఎన్నటికి తగదు. (లే. కాం. 25:35-37) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 30 చూడుము.]
8. కుష్టరోగుల శుద్ధినిగూర్చిన ఆజ్ఞలు, అలాగే తద్వారా అంటుపడిన యింటిని గూర్చిన ఆజ్ఞలు వ్యాధిని కలుగజేయు క్రిములకు సంబంధించిన జాగరూకతను, వ్యాధి సోకకుండా తీసుకొనబడిన చర్యను ప్రదర్శించుచున్నవి. (లే. కాం. అధ్యా. 14) [వారపు బైబిలు పఠనము: అవేక్! 81 9/22 పే. 25 చూడుము.]
9. నిబంధన మందసము మూతపైయున్న రెండు కెరూబుల మధ్యనుండి లేక వాటిపైనుండి అతిపరిశుద్ధ స్థలములో దేవుని ప్రత్యక్షతకు సూచనగా అద్భుతమైన షెకినా వెలుతురు కనిపించెను. (సంఖ్యా. కాం. 7:89) [వారపు బైబిలు పఠనము; కెజె పే. 165 చూడుము.]
10. మోయాబీయులు, ఐగుప్తీయులు మరియు ఇతరుల పద్ధతికి తగినట్లుండక వారు ప్రత్యేకముగా ఉన్నారని జ్ఞాపకము చేయబడునట్లు ఇశ్రాయేలీయులు తమ బట్టల “అంచులకు కుచ్చులు” చేసికొనవలసియుండిరి. (సంఖ్యా. కాం. 15:38-40) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 83 10/15 పే. 20 చూడుము.]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:
11. లేవీయకాండము యెహోవా నామమును ఎట్లు మహిమపరచుచున్నది? [యస్‌ఐ పే. 26 పేరా 9 (పే. 26 పేరా 9)]
12. ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు మరియు ఆయన క్రింది ఉప యాజకులవలన వెయ్యి సంవత్సరముల పాలనలో ఏ యాజకత్వపు పని నెరవేర్చబడును? [యస్‌ఐ పే. 30 పేరా 39 (పే. 30 పేరా 39)]
13. క్రొవ్వును తినకూడదను నిషేధము ఈనాడు యెహోవా సేవకులకు దేనిని గుర్తుచేయుచున్నది? (లేవీ. కాం. 3:16) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 29 చూడుము.]
14. నాదాబు అబీహుల పాపములో ఏమి ఇమిడియుండవచ్చును? (లేవీ. కాం. 10:1, 2) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 29 చూడుము.]
15. బిడ్డను ప్రసవించినప్పుడు అది స్త్రీని ఎందుకు “అపవిత్రము” చేసినది? (లేవీ. కాం. 12:2, 5) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 29 చూడుము.]
16. తన తలిదండ్రులను దూషించువానికి “మరణ శిక్ష” దండనగా ఎందుకు విధించబడినది? (లేవీ. కాం. 20:9) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 29-30 చూడుము.]
17. ‘పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే ఆహారము వండుట’ అనగా అర్థమేమి? (లేవీ. కాం. 26:26) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 30 చూడుము.]
18. మోషేయొక్క కూషుదేశపు భార్యనుబట్టి మిర్యాము ఆయనకు వ్యతిరేకముగా ఎందుకు మాటలాడినది? (సంఖ్యాకాం. 12:1) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 4/15 పే. 29 చూడుము.]
19. ఏ ప్రాముఖ్యమైన వాస్తవమును కోరహు తృణీకరించెను? (సంఖ్యాకాం. 16:1-3) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 78 11/15 పే. 14 చూడుము.]
ఈ క్రింది వాక్యములను పూరించుటకు అవసరమైన పదములను లేక మాటలను చేర్చండి:
20. లేవీయకాండము మోషేద్వారా సా.శ.పూ. _____________________ వ్రాయబడినది. [యస్‌ఐ పే. 25 పేరా 4 (పే. 25 పేరా 4)]
21. లేవీయకాండమంతటిలో _____________________ ముఖ్యాంశముగా కనిపిస్తుంది. ఇది బైబిలు యొక్క ఏ ఇతర పుస్తకము కంటెను ఎక్కువసార్లు ఈ అవసరతను ప్రస్తావిస్తుంది. [యస్‌ఐ పే. 9 (పే. 26 పేరా 9)]
22. లేవీయకాండములోని అనేక ప్రవచనాత్మక రూపముల నెరవేర్పులు _____________________ పుస్తకములో వర్ణించబడినవి. [యస్‌ఐ పే. 29 పేరా 37 (పే. 29 పేరా 37)]
23. సంఖ్యాకాండము పుస్తకము సా.శ.పూ. _____________________ మధ్యకాలములను గూర్చి వివరించుచున్నది. [యస్‌ఐ పే. 30 పేరా 4 (పే. 30 పేరా 4)]
24. సంఖ్యాకాండము పుస్తకములో ఇశ్రాయేలీయుల అవిధేయత మరియు తిరుగుబాటు విధానము _____________________ ప్రాముఖ్య అవసరతను నొక్కిచూపుచున్నది. [యస్‌ఐ పే. 31 పేరా 9 (పే. 31 పేరా 9)]
25. _____________________ గూర్చి లేవీయకాండములో ఇవ్వబడిన కట్టడలు, వైద్యసంబంధమైన లోక వ్యక్తులచే తరువాత అనేకవేల సంవత్సరముల వరకు గుణగ్రహించబడని వాస్తవముల జ్ఞానమును బయలుపరచుచున్నవి. [యస్‌ఐ పే. 26 పేరా 7 (పే. 26 పేరా 7)]
ఈ క్రింది వాక్యములనుండి సరియైన సమాధానములను ఎన్నుకొనుము:
26. లేవీయకాండ పుస్తకము వివరించు సంగతుల కాలనిడివి (40 సంవత్సరములు; ఒక్క సంవత్సరము; ఒక్క నెల). [యస్‌ఐ పే. 25 పేరా 3 (పే. 25 పేరా 3)]
27. సంఖ్యాకాండము పుస్తకము మోషే వలన పూర్తిచేయబడిన సంవత్సరము సా.శ.పూ. (1513; 1512; 1473). [యస్‌ఐ పే. 30 పేరా 4 (పే. 30 పేరా 4)]
28. ‘మిమ్మును మీరు దుఃఖపరచుకొనుట’ (ఆత్మను దుఃఖపరచుకొనుట NW) అనునది (ఉపవాసమును; తన్నుతాను కొట్టుకొనుటను; ఏ విధమైన వినోద కార్యక్రమములలో పాల్గొనకుండా ఉండుటను) సూచించుచున్నది. (లేవీ. కాం. 16:29) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 2/15 పే. 29 చూడుము.]
29. ‘ఒక స్త్రీకి నడుము (సడుగు NW) పడిపోవటం’ అనగా వాస్తవమునకు దాని భావము (ఆమె యెహోవాను సేవించుట విడిచిపెట్టును; ఆమె కాలు పడిపోవును; ఇక గర్భము ధరించకుండునట్లు ఆమె జననేంద్రియములు పాడైపోవును.) (సంఖ్యాకాం. 5:21) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 4/15 పే. 29 చూడుము.]
30. “యెహోవా యుద్ధముల గ్రంథము” (మతభ్రష్టత్వపు సమాచారము; నమ్మదగిన చారిత్రక వ్రాత; బైబిలు కథలు గల కల్పిత వృత్తాంతము). (సంఖ్యాకాం. 21:14, 15) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 4/15 పే. 30 చూడుము.]
ఈ క్రింద చూపబడిన వాక్యములకు సరైన లేఖనములను జతపర్చుము:
లేవీ. కా. 2:11, 12; లేవీ. కా. 17:10-14; లేవీ. కా. 19:32; సంఖ్యా. కా. 15:30, 31; హెబ్రీ. 13:11
31. రక్తము పవిత్రమైనదైనందున, దానిని ఏ రూపములోను శరీరములోనికి తీసుకొనకూడదు. [యస్‌ఐ పే. 29 పేరా 33 (పే. 29 పేరా 33)]
32. ప్రాయశ్చిత్థార్థ దినమున పాపపరిహార్థమై అర్పించబడిన జంతు కళేబరములు పాళెము వెలుపలికి తీసికొనిపోబడి దహించబడెను. [యస్‌ఐ పే. 29 పేరా 38 (పే. 29 పేరా 38)]
33. పండ్ల రసముతో కూడిన “తేనె,” పులియును గనుక, అది అర్పణకు అంగీకృతమైనది కాదు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 84 4/15 పే. 29 చూడుము.]
34. వృద్ధులైన వారికి గౌరవమిచ్చుట ఇశ్రాయేలీయుల జనాంగపు పద్ధతి. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 6/1 పే. 5 చూడుము.]
35. పశ్చాత్తాపములేక, బుద్ధిపూర్వకంగా దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించువారు మరణశిక్షకు లోనైరి. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 91 4/15 పే. 15 చూడుము.]