లివ్ ఫరెవర్ పుస్తకముతో నిజమైన జ్ఞానమును ప్రకటించుము
1 అందమైన భూపరదైసులో పరిపూర్ణతయందు నిత్యజీవము! యెహోవానుండి అది ఎంత ఉదాత్తమైన బహుమానం! యు కెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్, అను పుస్తకమును ఉపయోగించుచు, మన ప్రాంతమందలి ప్రజలతో ఈ నిరీక్షణను పంచుకొనుటకు ఆయన ప్రేమ మనలను ప్రేరేపించవలెను. ఈ పుస్తకము త్వరలోనే మన భారత క్ర్షేతమందు ఉపయోగింపబడు పది భాషలలో లభ్యమగును.
2 భూపరదైసులో నిత్యము జీవించు అంశమును చర్చించుటకు మరియు ఈ పుస్తకము నందించుటకు చక్కగా సంసిద్ధులమై యుండుటకుగాను, మొదట మనమందరము దానియందలి విషయములతో బహుగా పరిచయమున్న వారమైయుండవలెను. నిస్సందేహముగా నీవు సంభాషణ అంశముతో ఉపయోగింపబడగల ఆసక్తికరమైన ప్రాంతీయసేవా అంశములను కలిగియున్నావు. మన ప్రాంతములో ఎలాంటి ప్రజలున్నారని తెలిసికొనుట నిత్యజీవమును గూర్చిన యెహోవాయొక్క వాగ్దానమందు ఆసక్తి రేపుటకు ఏ అధ్యాయములను లేక ప్రత్యేక అంశములను ఉపయోగించవలెనో తీర్మానించుటకు మనకు సహాయము చేయును. సత్యమందు ఇంటియజమాని ఆసక్తిని చూరగొను దృష్టాంతములను గమనించుము. మీ ప్రాంతములో ఈ పుస్తకమునందించునప్పుడు వీటిని మనస్సునందుంచుకొనుము.
3 అద్భుతమైన పఠన పుస్తకము: భవిష్యత్తులో సమకూర్చు పనియందు లివ్ ఫరెవర్ పుస్తకము గొప్పభాగము కలిగియుండు అసాధారణమైన బైబిలుపఠన సహాయకమగునని మనమెందుకు దృఢనిశ్చయత కలిగియుండగలము? ఎందుకనగా “లెట్ గాడ్ బి ట్రూ” మరియు “నిత్యజీవమునకు నడుపు సత్యము” అను బైబిలు పఠన సహాయకములను విజయవంతముగా ఉపయోగించుటద్వారా నేర్చుకొనిన సంగతి ఈ పుస్తకమును తయారుచేయుటలో పొందుపర్చబడినది. ఆ విధముగా ఈ పాతపుస్తకములలో కనుగొనబడు శ్రేష్ఠమైన బోధనా మర్మములతో అవే మౌలిక లేఖన విషయములను అది కలిగియున్నది.
4 వివిధ బైబిలు సిద్ధాంతములను స్పష్టముగా, మరింత సూటిగా ఎట్లు బోధించవచ్చుననుటకు ఎంతో శ్రద్ధ ఇవ్వబడెను. దృశ్యమైన మరియు మాటరూపకమైన, మరింత ప్రభావశీలమైన దృష్టాంతములను, మరింత సోదాచేయు ప్రశ్నలను తయారుచేయుటకు సమయము తీసికొనబడెను. తదేకమైన ఒక గురియేమైయుండెననగా విద్యార్థి హృదయమును చేరుట. ఒక ప్రచారకుడు ఇట్లు వ్రాయుచున్నాడు: “దాని రక్తికట్టించు అందింపు మరియు విస్తారమైన దృష్టాంతములకంటే కూడ ఎక్కువైన సంగతి ఏదనగా, అందు లేఖనములు శక్తివంతముగా ఉపయోగింపబడుట, ప్రశ్నలు మరియు అది—విద్యార్థి యెహోవాతో తనకున్న సంబంధము విషయమై అన్ని సంగతులను చూచుకొనుటకు—వ్యక్తిగతముగా సమీపించుటను నేను ప్రేమింతును. అందున్న స్పష్టమైన విభిన్నతలు వారు నిర్ణయములు చేసికొనుటకు, అవును, తమ నమ్మకములను, నడతను, దృక్పధములను మరియు మతమును మార్చుకొను అవసరతను చూచుటకు ప్రజలకు సహాయము చేయవలెను.”
5 వివిధ అంశముల విస్తృతమైన సమాచారము: బైబిలు సత్యములను అందించుటకు అనువైన ప్రభావశీలతకు, మెరుగుపర్చబడుటకు తోడుగా, ఈ పుస్తకము ఇంతకుముందున్న పఠన సహాయకములకంటే వివిధ అంశముల విస్తృత సమాచారమును కలిగియున్నది. విద్యార్థికి ప్రయోజనకరమగు రీతిలో క్రొత్తవారి కొరకు ఆవశ్యకమైన సమాచారము ఇందు పొందుపర్చబడినది. ఉదాహరణకు, ఇటీవల కాలములో అనేకమంది క్రొత్తవారు సత్యమందు పురోగమించుటకు ఆటంకముగా నైతిక ప్రవర్తన ఒక పెద్ద అభ్యంతరముగా ఉండెను. కావున ఈ విషయమునకు పూర్తి వివరణ ఇవ్వబడెను. ఎలాంటి తప్పిదములను విసర్జించవలెను, ఎలా వాటిని విసర్జించవలెననుటకు సూటియైన సలహాను సమకూర్చుటయే కాకుండా, సరియైనది చేయుటకు ప్రోత్సాహము కూడా ఇవ్వబడెను.
6 ఇంటింటి పరిచర్యలో, వీధి సాక్ష్యమందు, పునర్దర్శనములు చేయుటలో—ప్రతి ప్రచారకుడు తనవెంట ఒకటి లేక రెండు లివ్ ఫరెవర్ పుస్తక ప్రతులను తీసికెళ్లవలెనని సిఫారసు చేయబడుచున్నది. అది లేకుండా ప్రాంతీయసేవకు వెళ్లకుము! పుస్తకము నందించుటలో, దాని విషయములను వివరించుటలో మరియు దానిని ఇచ్చుటలో నీ అననుకూల దృక్పథము అనేక క్రొత్త బైబిలు పఠనములు ప్రారంభించుటకు మార్గము సిద్ధముచేయును.
7 ఈ చివరి దినములలో రాజ్య వర్తమానమును ఎడతెగక ప్రకటించుటలో యెహోవా మనకిచ్చిన ఆధిక్యతనుండి మనము పూర్తి ప్రయోజనము తీసికొనుచుండగా, జనవరిలో మనము ఉత్సాహపూరితముగా లివ్ ఫరెవర్ పుస్తకమును అందించుదము గాక.