ప్రకటనలు
• సాహిత్య అందింపులు: మార్చి: 192 పేజీల పాతపుస్తకముల ప్రత్యేక అందింపు. రెండు 12 రూ.లకు ఒకటి రూ.లు 6. ఏప్రిల్: లివ్‌ఫరెవర్ పుస్తకమును 35 రూ.లకు. చిన్నసైజు 20 రూ.లకు అందించుము. ఈ ప్రచురణలు అందుబాటులో లేనిచోట ఒక పుస్తకపు వెలకు. 192 పేజీల ప్రత్యేక అందింపు రెండు పాతపుస్తకములను అందించవచ్చును. ప్రాంతీయ భాషలలో సగము ధరకు ఒక ప్రత్యేక అందింపు పుస్తకము. మే మరియు జూన్: ది వాచ్‌టవర్‌కు ఒక సంవత్సరపు చందా 50 రూ.లకు. ఆరునెలల చందాలు మరియు నెలసరి పత్రికలకు సంవత్సరపు చందా 25 రూ.లు. (నెలసరి సంచికలకు ఆరునెలల చందాలులేవు. చందా సేకరించబడనిచోట రెండు పత్రికలు మరియు బ్రోషూరు యొక్క ఒక కాఫీని రూ.లు 8 అందించుము.) జూలై: ట్రూపీస్ పుస్తకము. ఇది లభ్యము కానిచోట కింగ్‌డమ్ కమ్ పుస్తకమును 12 రూ.లకు అందించవచ్చును.
• సెక్రెటరీ మరియు సేవాకాపరి రెగ్యులర్ పయినీర్లందరి యొక్క పనిని పునఃసమీక్షించవలెను. కోరబడిన గంటలను చేరుకొనుటలో ఎవరికైన కష్టముగా నున్నట్లయిన సహాయము అందించబడునట్లు పెద్దలు ఏర్పాటు చేయవలెను. సూచనల కొరకు అక్టోబరు 1, 1989, మరియు అక్టోబరు 1, 1990 నాటి సొసైటి లెటర్స్‌ను (S-201) చూడుము. మరియు 1986 అక్టోబరు మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్ పేరాలు 12-20 చూడుము.
• పయినీరు సేవను గూర్చి ఈ క్రింది జ్ఞాపికలు ఇవ్వబడుచున్నవి:
○ ఒక రెగ్యులర్ పయినీర్ తన పయినీరు సేవను మానుకొనినప్పుడు సంఘములో ప్రకటనను చేయవలెను. ఆ క్లుప్తమైన ప్రకటన ఇట్లుండవచ్చును: “సంఘమునకు తెలియజేయునదేమనగా ఫలానా [పేరు] ఇప్పటినుండి రెగ్యులర్ పయినీరుగా సేవ చేయుటలేదు.”
○ ఇప్పటికిని రెగ్యులర్ పయినీర్లకు సంవత్సరమునకు కోరబడు గంటలు 1,000.
○ ఒక వ్యక్తి న్యాయసంబంధమైన గద్దింపుపొందుట లేక తిరిగి చేర్చుకొనబడుట జరిగిన తరువాత ఆక్సిలరీ లేక రెగ్యులర్ పయినీరుగా పరిశీలించబడుటకు ముందు ఒక సంవత్సరము పూర్తిగా గడువవలెను.—మన రాజ్య పరిచర్య 1986 అక్టోబరు ఇన్సర్ట్ పేరాగ్రాఫ్‌లు 21 మరియు 23 చూడుము.
• జ్ఞాపకార్థ ఆచరణ 1991 మార్చి 30 శనివారము జరుగును. ఒకవేళ ప్రసంగము ముందుగా ప్రారంభమయినను జ్ఞాపకార్థపు రొట్టె మరియు ద్రాక్షారసమును అందించుట సూర్యాస్తమయము జరుగక ముందే ప్రారంభము కాకూడదనుదానిని దయచేసి గుర్తుంచుకొనండి. మీ ప్రాంతములో ఎప్పుడు సూర్యుడు అస్తమించునో నిర్ణయించుటకు స్థానికంగా తెలియజేయగల మూలముద్వారా పరిశీలించి తెలుసుకొనుము. ఆ తేదీన ప్రాంతీయ సేవకొరకైన కూటములు తప్ప ఏమియు జరుపకూడదు. క్రమముగా నిర్ణయించబడియున్న కూటములను శనివారము కలిగియున్న సంఘములు సాధ్యమైతే ఆ కూటములు మరొక రోజున జరుపుకొనునట్లు ఏర్పాటు చేసికొనవలెను. ఆదివారపు కూటముల క్రమములో ఏ మార్పులు ఉండవు.
• ఏప్రిల్ మరియు మే మాసములలో ఆక్సిలరీ పయినీర్లుగా చేయదలచుకొను ప్రచారకులు ఇప్పుడే తమ పథకములను వేసుకొని వారి దరఖాస్తులను ముందే అందజేయవలెను. ఇది అవసరమగు ప్రాంతీయ సేవ ఏర్పాటులను చేయుటకు మరియు తగినన్ని సాహిత్యములు అందుబాటులో నుండుటకు ఏర్పాటు చేయులాగున పెద్దలకు సహాయపడును.
• అందుబాటులో నున్న క్రొత్త ప్రచురణలు:
చర్చనీయ బైబిలు అంశములు—మరాఠి
హౌ కెన్ బ్లడ్ సేవ్ యువర్ లైఫ్?—ఇంగ్లీషు
త్రిత్వమును మీరు నమ్మవలయునా?—కొంకని (కెయన్), కొంకని (కెటి), బెంగాలి
యుకెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ (చిన్నది)—కన్నడ, హింది, మరాఠి
• మరలా లభ్యమగుచున్న ప్రచురణలు:
లెర్న్ టు రీడ్ అండ్ రైట్—ఇంగ్లీషు
“ఈ రాజ్య సువార్త”—మరాఠి
ఎంజాయ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫరెవర్!—మరాఠి