ప్రశ్నా భాగము
• వ్యక్తిగత లేక వ్యాపార ఉత్తర ప్రత్యుత్తరములకు కావలసిన అడ్రసులకై సొసైటికి గాని లేక దాని బ్రాంచి ఆఫీసులకుగాని వ్రాయుట సరియేనా?
సొసైటీ ఫైళ్లలో గాని సంఘ ఫైళ్లలో గాని ఉన్న అడ్రసులన్నియు గుప్తమైనవి కనుక అవి వ్యక్తిగత ఉపయోగమునకై యివ్వబడవు. కావున అట్లు వ్రాయకూడదు.
సంఘము దాని ఉద్దేశమును గమనించి పూర్ణాత్మతో యెహోవా చిత్తమును చేయుటకే అంకితమైయున్నది. కావున ఇట్టి వ్యాపార సంబంధమైన వాటిని ప్రోత్సహించుట లేక బలపరచుటలో సొసైటీ లేక సంఘము జోక్యము కలుగజేసుకోదు. అవన్నియు వ్యక్తిగతమైనవే. అట్టి అడ్రసులు కావలసిన ప్రచారకులు తమ దేశములోని ఇతర పట్టణములలోగాని లేక ఇతర దేశములలోగాని ఉన్న సహోదరులతో ఉత్తర ప్రత్యుత్తరములకై స్వంతగా ఏర్పాట్లను చేసుకొనవచ్చును.