కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/92 పేజీ 3
  • ప్రశ్నాభాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగము
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—1994
  • క్రైస్తవ సంఘం ఎలా పనిచేస్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • యెహోవా మార్గంలో నడుస్తూనే ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • పెద్దలు సంఘానికి ఎలా సహాయం చేస్తారు?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
మన రాజ్య పరిచర్య—1992
km 6/92 పేజీ 3

ప్రశ్నాభాగము

◼ సంఘము ముందు తీర్మానములను ప్రవేశపెట్టుటకు ఏ పద్ధతులను అనుసరించవలెను?

సంఘమునకు సంబంధించిన అనేక విషయములను స్థానిక పెద్దల సభ నిర్ణయిస్తుంది. బాధ్యతగల ఈ సహోదరులు నిర్ణయములను చేయుటలో సొసైటినుండి వచ్చు సలహాలు లేక నడిపింపుతోపాటు బైబిలు సూత్రములనుబట్టి నడుచుకొంటారు. అయినను కొన్ని తీర్మానములలో సంఘం కూడ పాల్గొని, తీర్మానం చేయవలసిన అవసరం వుంటుంది. వీటిలో కూటమునకు మంచి స్థలమును సేకరించుట, ఆస్తిని కొనుట, రాజ్యమందిరమును నిర్మించుట లేక నూతనంగా రూపుదిద్దుట, రాజ్యాసక్తులను విస్తరింపజేయుటకై సొసైటికి విరాళములను పంపుట మొదలగునవి ఉండును. సాధారణంగా అవసరమయ్యే నిర్వాహక ఖర్చులకు తీర్మానము అవసరములేదు. కాని, అసాధారణమైన పెద్ద పెద్ద ఖర్చులన్ని తీర్మాన రూపంలో సంఘము ఆమోదించవలెను.

తీర్మానములను ఎలా తయారుచేసి, ప్రవేశపెట్టవలెను? పెద్దల సభ ఆ విషయము సంఘము మరియు రాజ్యపనియొక్క శ్రేష్టమైన ప్రయోజన నిమిత్తమై ఉన్నదా అని పరిశీలిస్తూ దానిని క్షుణ్ణంగా చర్చిస్తారు. వారు ఒక ఒప్పందమునకొచ్చిన తరువాత, ఒక పెద్ద, బహుశా సంఘ సేవా కమిటి సభ్యుడు పెద్దల సిఫారసులను విపులంగా తెలియజేస్తూ ఒక వ్రాతపూర్వకమైన తీర్మానమును తయారు చేస్తాడు. సేవా కూటములో తత్సంబంధమైన వాస్తవాలు, ప్రతిపాదించబడిన తీర్మానము చర్చించబడుతుంది. దీనిని నిర్వహించే పెద్ద, సంఘ సభ్యులకు విషయమేదైనా స్పష్టముకానట్లయిన వారు ప్రశ్నలు అడుగుటకు అవకాశమిస్తాడు. ఒకవేళ ఏదైనా గంభీరమైన తీర్మానము ఇమిడివుంటే, దానిపై ఓటు చేయుటకు ముందుగా దానిని పరిశీలించుటకు ఒక వారము లేక ఎక్కువ సమయమును సంఘ పెద్దలు సంఘమునకు అనుమతించవచ్చును. ప్రవేశపెట్టిన తీర్మానమును సంఘము ఏ ఇతర చర్చ అవసరంలేకుండా అంగీకరించగోరితే, దానిని నిర్వహించు అధ్యక్షుడు తీర్మానమునకు అనుకూలముగా లేక వ్యతిరేకముగా తమ చేతులు ఎత్తి చూపమని కోరుతాడు. సమర్పించుకొని బాప్తిస్మము తీసికొనిన ప్రచారకులలో ఎక్కువమంది ప్రతిపాదనకు అనుకూలముగా వుంటే, ఆమోదించబడిన దానిపై పెద్దలు పనిచేయుటకు ముందుకు వెళ్లవచ్చును.

చట్టపరమైన అవసరతలు వేరుగాకోరే ఏదో ప్రత్యేక సందర్భాలలో తప్ప, సమర్పించుకొని బాప్తిస్మము తీసికొనిన ప్రచారకులందరు తీర్మానములో ప్రవేశపెట్టబడిన విషయములపై ఓటు చేయుటకు అనుమతించబడెదరు.

కార్పోరేషన్‌ మరియు రాజ్యమందిరపు రుణానికి సంబంధించిన విషయములలో చట్టసంబంధమైన అవసరతలు లేక కార్పోరేషన్‌ ఉపచట్టాల కనుగుణ్యంగా పార్లమెంటరీ విధానమును అనుసరించవలసిన అవసరము ఉండవచ్చును. (ఇండియాలో, సంఘములు స్థలమును, లేక రాజ్యమందిరములను సంపాదించుకొనుటకు చట్టబద్ధమైన సొసైటీలుగా ఏర్పడినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.) ఉదాహరణకు, కొన్నిసార్లు ఈ తీర్మానమును ప్రతిపాదించిన సహోదరుని పేరు, దానిని బలపరచిన సహోదరుని పేరు దానికి ఎంతమంది అనుకూలంగా ఓటువేసినది, వ్యతిరేకంగా ఓటువేసినది రికార్డుచేయవలసిన అవసరం వుంటుంది. అటువంటి పార్లమెంటరీ విధానము ప్రత్యక్షంగా అవసరంలేనప్పుడు, సంఘము విషయమును పరిశీలించి తరువాత దానిపై ఓటుచేయమని సంఘమును కోరవచ్చును. ఏ సందర్భములోనైననూ, వ్రాతపూర్వకమైన తీర్మానములను తీసికొన్నప్పుడు, వాటిని సంఘ రికార్డులలో పెట్టుటకు ముందు బాధ్యతగల పెద్దలు దానిపై సంతకముచేసి, తారీఖు వెయ్యాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి