కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp19 No. 2 పేజీ 3
  • జీవితం భారంగా తయారైనప్పుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవితం భారంగా తయారైనప్పుడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • కష్టాలు ఊపిరాడకుండా చేసినప్పుడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • విపత్తు వచ్చినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • జీవితం మీద ఆశ ఎందుకు వదులుకోకూడదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
wp19 No. 2 పేజీ 3
ఉద్యోగ స్థలంలో ఒక యువతి ఏడుస్తోంది

జీవితం భారంగా తయారైనప్పుడు

అసలు ఏ కష్టం లేనప్పుడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సమస్యల వల్ల జీవితం భారంగా తయారైతే?

ఉదాహరణకు, అమెరికాలో ఉంటున్న శాలీa అనే ఆమె తుఫాను వల్ల సర్వం కోల్పోయింది. ఆమె ఇలా అంటోంది: “ఇంతకన్నా ఒత్తిడిని తట్టుకునే శక్తి నాకు లేదని, ఇక సహించడం నావల్ల కాదని అనిపించింది.”

ఒకవేళ మీకు బాగా ఇష్టమైనవాళ్లు చనిపోతే? ఆస్ట్రేలియాలో ఉంటున్న జానస్‌ ఇలా అంటుంది: “మా ఇద్దరు అబ్బాయిలు చనిపోయినప్పుడు నా జీవితం ముక్కలైనట్టు అనిపించింది. నేను దేవునికి ఇలా ప్రార్థించాను: ‘నా గుండె ఇక తట్టుకోలేదు! నాకు చనిపోవాలని ఉంది, ఇక బ్రతకాలని లేదు.’”

డానియెల్‌ విషయానికొస్తే, తన భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు అతను తీవ్రంగా కృంగిపోయాడు. అతనిలా చెప్తున్నాడు: “నా భార్య నమ్మకద్రోహం చేశానని చెప్పినప్పుడు నా గుండెను కత్తితో పొడిచినట్టు అనిపించింది. చాలా నెలలపాటు ఆ విషయం నన్ను పదేపదే బాధించింది.”

కింది పరిస్థితుల్లో జీవితం మీద ఆశ కోల్పోకుండా ఎలా ఉండవచ్చో ఈ కావలికోట పత్రికలో పరిశీలిస్తాం

  • విపత్తు వచ్చినప్పుడు

  • ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు

  • భార్య/భర్త నమ్మకద్రోహం చేసినప్పుడు

  • తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు

  • బ్రతకడం ఇక నావల్ల కాదని అనిపించినప్పుడు

ముందుగా, విపత్తు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవచ్చో చూద్దాం.

a ఈ పత్రికలో ఉన్న కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి