కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 సెప్టెంబరు పేజీ 22
  • బైబిలు కాలాల్లో టైం ఎలా చెప్పేవాళ్లు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు కాలాల్లో టైం ఎలా చెప్పేవాళ్లు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మెలకువగా నుండుడి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 సెప్టెంబరు పేజీ 22

బైబిలు కాలాల్లో టైం ఎలా చెప్పేవాళ్లు?

టైం ఎంతైందో తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? బహుశా మీ వాచీని లేదా గడియారాన్ని చూస్తారు. అప్పుడు, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు అయ్యింది అనుకుందాం. ఒకవేళ మీ స్నేహితుడు “టైం ఎంత?” అని అడిగితే, ఏం చెప్తారు?

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చెప్తారు. ఉదాహరణకు, “ఇప్పుడు టైం 1:30” లేదా “ఇప్పుడు టైం 13:30” అని మీరు చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల్లో “ముప్పై నిమిషాలు తక్కువ రెండు గంటలు” అని కూడా చెప్తారు.

బైబిలు కాలాల్లో టైం ఎలా చెప్పేవాళ్లో తెలుసా? వాళ్లు కూడా వేర్వేరు విధాలుగా చెప్పేవాళ్లు. హీబ్రూ లేఖనాల్లో “ఉదయం,” “మధ్యాహ్నం,” “సాయంకాలం” వంటి పదాలు ఉపయోగించారు. (ఆది. 8:11; 19:27; 43:16; 1 రాజు. 18:26) అయితే బైబిలు కొన్నిసార్లు నిర్దిష్టమైన సమయాన్ని కూడా ప్రస్తావించింది.

బైబిలు కాలాల్లో, కావలివాళ్లు ముఖ్యంగా రాత్రి పూట కాపలా కాసేవాళ్లు. ఇశ్రాయేలీయులు రాత్రిని మూడు భాగాలుగా విభాగించారు, వాటిని ‘జాములు’ అని పిలిచేవాళ్లు. (కీర్త. 119:148) న్యాయాధిపతులు 7:19⁠లో “నడిజాము” గురించి చదువుతాం. అయితే యూదులు, యేసు పుట్టే సమయానికి గ్రీకుల, రోమన్ల పద్ధతిని పాటిస్తూ రాత్రిని నాలుగు జాములుగా విభాగించడం మొదలుపెట్టారు.

రాత్రి జాముల గురించి సువార్త వృత్తాంతాల్లో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఉదాహరణకు, యేసు నీళ్ల మీద నడుచుకుంటూ, శిష్యులు ఉన్న పడవ దగ్గరికి “రాత్రి నాలుగో జామున” వెళ్లాడని బైబిలు చెప్తుంది. (మత్త. 14:25) అంతేకాదు యేసు ఒక ఉదాహరణలో ఇలా చెప్పాడు, “యజమాని రెండో జామున వచ్చినా, చివరికి మూడో జామున వచ్చినా ఆ దాసులు సిద్ధంగా ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు!”—లూకా 12:38.

యేసు తన శిష్యులతో, “ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. అతను సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలియదు. అందుకే అప్రమత్తంగా ఉండండి” అని చెప్పినప్పుడు నాలుగు జాముల గురించి ప్రస్తావించాడు. (మార్కు 13:35, అధస్సూచి) మొదటి జాము, “సాయంకాలం” అంటే సూర్యాస్తమయం నుండి దాదాపు రాత్రి తొమ్మిది గంటల వరకు. రెండో జాము, “అర్ధరాత్రి” అంటే దాదాపు రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి వరకు. మూడో జాము, “తెల్లవారుజాము” లేదా ‘కోడి కూసే’ సమయం అంటే మధ్యరాత్రి నుండి దాదాపు ఉదయం మూడు గంటల వరకు. యేసును బంధించిన రాత్రి కోడి కూసింది ఈ జాములోనే అయ్యుంటుంది. (మార్కు 14:72) నాలుగో జాము, “పొద్దున” అంటే దాదాపు ఉదయం మూడు గంటల నుండి సూర్యోదయం వరకు.

కాబట్టి బైబిలు కాలాల్లో మనలా వాచీలు, గడియారాలు లేకపోయినా టైం ఎంతైందో చెప్పే ఒక విధానం ఉండేది.

బైబిలు కాలాల్లో, యూదుల రోజును నాలుగు జాములుగా విభాగించిన చిత్రం
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి