విషయసూచిక
అక్టోబరు 29, 2018-నవంబరు 4, 2018
3 “వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు”
జ్ఞానం ఉంటే సరిపోదుగానీ దాన్ని చక్కగా ఉపయోగించాలి. అయితే మనం నేర్చుకున్నవాటిని పాటించాలంటే, వినయం ఉండాలి. ప్రాచీనకాల సేవకుల్ని ఆదర్శంగా తీసుకుంటూ మనమెలా వినయం చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. వాళ్లు అన్నిరకాల ప్రజలకు ప్రకటించారు, ఇతరుల కోసం ప్రార్థించారు, యెహోవా చర్య తీసుకునే వరకు ఓపిగ్గా ఎదురుచూశారు.
8 వృద్ధ సహోదరులారా—మీ విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడు
నవంబరు 5-11, 2018
12 ఒకరినొకరు ప్రేమతో బలపర్చుకుంటూ ఉండండి
మనం కష్టమైన కాలాల్లో జీవిస్తున్నాం. కాబట్టి త్వరగా నిరుత్సాహపడతాం, కృంగిపోతాం. వాటిని అధిగమించడానికి యెహోవా, యేసు మనకు సహాయం చేస్తారు. కానీ ఒకరినొకరు ఊరటను, ప్రోత్సాహాన్ని ఇచ్చుకునే బాధ్యత మనందరికీ ఉంది. అయితే, ఒకరినొకరం ప్రేమతో ఎలా బలపర్చుకుంటూ ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
నవంబరు 12-18, 2018
17 “సంతోషంగల దేవుణ్ణి” ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు
యెహోవా సంతోషంగల దేవుడు, కాబట్టి తన సేవకులు కూడా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే, సాతాను లోకంలో మనకు కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ సంతోషంగా ఎలా ఉండవచ్చు? మనం కలకాలం ఎలా సంతోషంగా ఉండవచ్చో యేసు కొండమీది ప్రసంగంలో చెప్పాడు.
22 బైబిలు కాలాల్లో టైం ఎలా చెప్పేవాళ్లు?
నవంబరు 19-25, 2018
23 సర్వశక్తిమంతుడే అయినా మనల్ని అర్థంచేసుకుంటాడు
నవంబరు 26, 2018–డిసెంబరు 2, 2018
28 యెహోవాలా ఇతరుల్ని అర్థంచేసుకోండి
ఈరోజుల్లో ప్రజలు చాలా స్వార్థపరులుగా తయారౌతున్నారు. కానీ నిజక్రైస్తవులు వాళ్లకు భిన్నంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్లు ప్రజల్ని నిజంగా ప్రేమిస్తారు. ఇతరులపట్ల ప్రేమ ఉందని చూపించే ఒక మార్గమేమిటంటే, వాళ్లను అర్థంచేసుకోవడం. యెహోవా ఇతరుల్ని అర్థం చేసుకోవడంలో ఎలా అద్భుతమైన ఆదర్శాన్ని ఉంచాడో మొదటి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం? మనం ఆయనలా ఇతరుల్ని ఎలా అర్థంచేసుకోవచ్చో తెలిపే కొన్ని సలహాల్ని రెండవ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.