విషయసూచిక
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మియన్మార్‌లో
సెప్టెంబరు 3-9, 2018
7 మీరు ఎవరి గుర్తింపు కోరుకుంటారు?
నేడు చాలామంది ఈ దుష్టలోకంలో గుర్తింపు కావాలని కోరుకుంటారు. కానీ అన్నిటికన్నా శ్రేష్ఠమైన గుర్తింపు అంటే యెహోవా దగ్గర గుర్తింపు పొందడానికి కృషిచేయడం ఎందుకు ప్రాముఖ్యమో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అంతేకాదు కొన్నిసార్లు యెహోవా తన నమ్మకమైన సేవకులకు ఊహించని రీతిలో ఎలా గుర్తింపును ఇస్తాడో కూడా చర్చిస్తాం.
సెప్టెంబరు 10-16, 2018
12 మీరు ఎవరివైపు చూస్తున్నారు?
ఎంతో విశ్వాసంగల మోషే వాగ్దాన దేశంలోకి ప్రవేశించే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. అంతేకాదు, మోషే ఎందుకు గంభీరమైన తప్పు చేశాడో, అలాంటి తప్పు మనం చేయకుండా ఎలా జాగ్రత్తపడవచ్చో కూడా పరిశీలిస్తాం.
సెప్టెంబరు 17-23, 2018
17 “యెహోవా పక్షమున” ఎవరు ఉన్నారు?
సెప్టెంబరు 24-30, 2018
మనందరం యెహోవా సొత్తు కాబట్టి మనం తనను మాత్రమే ఆరాధించాలని ఆయన కోరుకుంటాడు. కొంతమంది తాము దేవున్ని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూనే, దేవునికి ఇష్టంలేని పనులు చేస్తారు. కయీను, సొలొమోను, మోషే, అహరోను నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చో మొదటి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మనల్ని తన సొత్తుగా చేసుకున్నందుకు యెహోవాకు ఏయే విధాలుగా కృతజ్ఞత చూపించవచ్చో రెండవ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
27 “అన్నిరకాల ప్రజల” పట్ల కనికరం చూపించండి
30 వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి మరింత ప్రయోజనాన్ని, ఆనందాన్ని ఎలా పొందవచ్చు?