కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 జనవరి పేజీ 32
  • మీకిది తెలుసా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకిది తెలుసా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • విశ్వాసానికి పరీక్ష
    నా బైబిలు పుస్తకం
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 జనవరి పేజీ 32
ఇస్సాకు కట్టెల్ని, అబ్రాహాము నిప్పులున్న కుండను మోసుకొని వెళ్తున్నారు

మీకిది తెలుసా?

ప్రాచీన కాలాల్లో ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు మంటను ఎలా తీసుకెళ్లేవాళ్లు?

అబ్రాహాము తన ఇంటి నుండి చాలా దూరం ప్రయాణించి బలి అర్పించాలని యెహోవా చెప్పడాన్ని ఆదికాండము 22వ అధ్యాయంలో చదువుతాం. ‘దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని వెళ్లారు. వాళ్లిద్దరూ కలిసి వెళ్లారు’ అని బైబిలు చెప్తుంది.—ఆది. 22:6.

ప్రాచీన కాలాల్లో ప్రజలు మంటను ఎలా వెలిగించేవాళ్లో బైబిలు చెప్పట్లేదు. అయితే అబ్రాహాము, ఇస్సాకు మంటను వెలిగించి దాన్ని తమతోపాటు తీసుకెళ్లివుంటారా? ఓ బైబిలు వ్యాఖ్యాత ఏమి చెప్తున్నాడంటే, ఒకవేళ వాళ్లు వెలిగించిన మంటను తీసుకెళ్లివుంటే అది “తమ సుదూర ప్రయాణమంతటిలో మండుతూ ఉండకపోవచ్చు.” కాబట్టి అబ్రాహాము, అతని కొడుకు బహుశా మంటను వెలిగించడానికి కావాల్సినవన్నీ తమతోపాటు తీసుకెళ్లివుండవచ్చు.

అయితే ఆ కాలాల్లో మంటను వెలిగించడం అంత సులభం కాదని కొంతమంది చెప్తారు. కాబట్టి వీలైనప్పుడల్లా ప్రజలు అప్పటికే మండుతున్న మంటనుండి, బహుశా ఇరుగుపొరుగు వాళ్ల దగ్గర నుండి నిప్పుల్ని తీసుకుని మంటను వెలిగించేవాళ్లు. అబ్రాహాము తన ప్రయాణాన్ని మొదలుపెట్టకముందే మంటనుండి వేడి నిప్పుల్ని తీసుకెళ్లివుంటాడని చాలామంది విద్వాంసులు నమ్ముతారు. వాటిని అతను ఒక పాత్రలో, బహుశా గొలుసుకు కట్టివున్న కుండలో పెట్టి, ఆ కుండను తమతోపాటు తీసుకెళ్లివుండవచ్చు. (యెష. 30:14) ఆ తర్వాత అవసరమైనప్పుడు మంటను వెలిగించడానికి ఆ నిప్పుల్ని, కట్టెల్ని ఉపయోగించివుంటాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి