విషయసూచిక
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు
ఫిబ్రవరి 27, 2017-మార్చి 5, 2017
7 యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి
కష్టాలు వచ్చినప్పుడు సహాయం కోసం యెహోవా వైపు చూడమని 2017 వార్షిక వచనం మనల్ని ఎలా ప్రోత్సహిస్తుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి చేయగలిగింది చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ, యెహోవా మనకు సహాయం చేస్తాడని ఎలా నమ్మవచ్చో గతంలోని కొంతమంది నమ్మకమైనవాళ్ల గురించి పరిశీలించి తెలుసుకుంటాం.
మార్చి 6-12, 2017
12 స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి
దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన స్వేచ్ఛాచిత్తాన్ని ఆయన్ను సంతోషపెట్టే విధంగా ఉపయోగించడం ద్వారా దాన్ని ఎలా విలువైనదిగా చూడవచ్చో ఈ ఆర్టికల్‌లో నేర్చుకుంటాం. అలాగే ఇతరులు తమ బహుమానమైన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించే విధానాన్ని మనమెలా గౌరవించవచ్చో కూడా తెలుసుకుంటాం.
మార్చి 13-19, 2017
మార్చి 20-26, 2017
22 పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు
మనకు అవసరమైన అణకువ అనే లక్షణాన్ని మరింత బాగా అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్స్ సహాయం చేస్తాయి. అణకువ అంటే ఏమిటో, అణకువ అంటే ఏమి కాదో మొదటి ఆర్టికల్ వివరిస్తుంది. పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువను ఎలా చూపించవచ్చో రెండవ ఆర్టికల్ నేర్పిస్తుంది.
మార్చి 27, 2017-ఏప్రిల్ 2, 2017
27 ‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు’
తరాలు మారుతుండగా వయసుపైబడినవాళ్ల బాధ్యతల్ని యౌవనులు నిర్వహిస్తుంటారు. ఆ మార్పును యౌవనులు, వయసుపైబడినవాళ్లు ఎలా విజయవంతంగా ఎదుర్కోవచ్చో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.