కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 1/1 పేజీ 16
  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
    జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
  • కుటుంబాలకు సహాయం
    తేజరిల్లు!—2018
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
    బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 1/1 పేజీ 16

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీ పిల్లలకు దేవున్ని ప్రేమించడం ఎలా నేర్పించవచ్చు?

సృష్టిని చూపించి కొడుకుకు నేర్పిస్తున్న తండ్రి

సృష్టిని చూపిస్తూ దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

దేవుడు ఉన్నాడని, వాళ్లను ప్రేమిస్తున్నాడని నమ్మితేనే పిల్లలు దేవున్ని ప్రేమించడం నేర్చుకుంటారు. దేవున్ని ప్రేమించాలంటే పిల్లలు ఆయన గురించి తెలుసుకోవాలి. (1 యోహాను 4:8) ఉదాహరణకు, దేవుడు మనుషుల్ని ఎందుకు చేశాడు? దేవుడు కష్టాలను ఎందుకు తీసేయట్లేదు? భవిష్యత్తులో మనుషుల కోసం దేవుడు ఏమి చేస్తాడు? వంటివి వాళ్లు తెలుసుకోవాలి.—ఫిలిప్పీయులు 1:9-11 చదవండి.

మీ పిల్లలు దేవున్ని ప్రేమించడం నేర్చుకోవాలంటే, మీరు కూడా దేవున్ని ప్రేమిస్తున్నారని వాళ్లకు చూపించాలి. అప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు.—ద్వితీయోపదేశకాండము 6:5-7; సామెతలు 22:6 చదవండి.

మీ పిల్లల హృదయాలను ఎలా చేరుకోవచ్చు?

దేవుని వాక్యానికి చాలా బలం ఉంది. (హెబ్రీయులు 4:12) కాబట్టి అందులోని ప్రాథమిక విషయాలు పిల్లలకు నేర్పించండి. ప్రజల హృదయాలను చేరుకోవడానికి యేసు ప్రశ్నలు అడిగాడు, వాళ్లు చెప్పేది విన్నాడు, దేవుని వాక్యాన్ని వివరించాడు. మీరు కూడా మీ పిల్లల హృదయాలను చేరుకోవడానికి యేసు నేర్పించిన విధానాన్ని పాటించవచ్చు.—లూకా 24:15-19, 27, 32 చదవండి.

అంతేకాకుండా, దేవుడు ప్రజలను ఎలా చూసుకున్నాడో చెప్పే బైబిలు వృత్తాంతాలు కూడా దేవున్ని తెలుసుకుని ఆయనను ప్రేమించడానికి పిల్లలకు సహాయం చేస్తాయి. అలా నేర్పించడానికి ఉపయోగపడే ప్రచురణలు www.jw.org/te వెబ్‌సైట్‌లో ఉన్నాయి.—2 తిమోతి 3:16, 17 చదవండి. (w14-E 12/01)

ఇంకా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలో 14వ అధ్యాయం చూడండి

ఈ పుస్తకాన్ని www.jw.org/te నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు లేదా 2వ పేజీలో ఉన్న అడ్రస్‌కు రాసి ఉచితంగా పొందవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి