కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 4/15 పేజీ 32
  • మీకిది తెలుసా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకిది తెలుసా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమాజంగా కూడడం మానకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా ఈ లోకంలో భాగమయ్యింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • బైబిలు ప్రవచనంలో విశ్వాసం జీవితాన్ని కాపాడుతుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 4/15 పేజీ 32

మీకిది తెలుసా?

సా.శ. 70 తర్వాత యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడైనా కట్టారా?

‘రాతిమీద రాయి ఒకటైనను నిలిచియుండకుండ’ యెరూషలేము దేవాలయం ‘పడద్రోయబడుతుందని’ యేసు ప్రవచించాడు. ఆ ప్రవచనం సా.శ. 70లో టైటస్‌ నేతృత్వంలోని రోమా సైన్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు నెరవేరింది. (మత్త. 24:2) ఆ తర్వాతి కాలంలో జూలియన్‌ చక్రవర్తి ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ప్రణాళిక వేశాడు.

రోముకు జూలియన్‌ చివరి అన్యమత చక్రవర్తి అని ప్రాచుర్యంలో ఉంది. కాన్‌స్టంటైన్‌ సోదరుని కుమారుడైన ఈ జూలియన్‌, నామమాత్రపు క్రైస్తవ విద్యను అభ్యసించాడు. కానీ, సా.శ. 361లో అతను చక్రవర్తి అయ్యాక, అన్యమతాన్ని సమర్థిస్తూ ఆ క్రైస్తవ విద్యను, కలుషితమైపోయిన ఆనాటి క్రైస్తవత్వాన్ని బాహాటంగా తిరస్కరించాడు. చరిత్ర పుస్తకాలు అతణ్ణి “మతభ్రష్టుడు” అని సంబోధిస్తున్నాయి.

జూలియన్‌ క్రైస్తవత్వాన్ని అసహ్యించుకున్నాడు. బహుశా అందుకు గల ఒక కారణమేమిటంటే అతను ఆరేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు, ఆ మత ప్రతినిధులు తన తండ్రిని, తన రక్తసంబంధీకుల్లోని మగవాళ్లను చంపడాన్ని కళ్లారా చూశాడు. చర్చీ చరిత్రకారుల ప్రకారం జూలియన్‌ చక్రవర్తి, యేసు అబద్ధ ప్రవక్త అని నిరూపించడానికి యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టమని యూదుల్ని ప్రోత్సహించాడు.a

జూలియన్‌ ఆ ఆలయాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించాడన్నది వాస్తవమే. జూలియన్‌ అసలు ఆ పనిని ప్రారంభించాడా, ఒకవేళ ప్రారంభిస్తే అది ఎందుకు ఆగిపోయింది అని చరిత్రకారులు వాదులాడుకుంటున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాకముందే జూలియన్‌ హతమయ్యాడు, అతని ప్రణాళిక కూడా అతనితో పాటే అంతరించింది.

[32వ పేజీలోని చిత్రం]

ఇప్పటి ప్రదేశంలో, యేసు కాలంనాటి యెరూషలేము దేవాలయపు ఊహాచిత్రం

a యేసు ఆ ఆలయం నాశనం అవుతుందని చెప్పాడే కానీ దాన్ని ఎన్నటికీ తిరిగి కట్టరని చెప్పలేదు. యెరూషలేము దేవాలయం సా.శ. 70లో నాశనమైంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి