కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 12/15 పేజీ 3
  • మీకు జ్ఞాపకమున్నాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు జ్ఞాపకమున్నాయా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షులది ప్రొటస్టెంట్‌ మతమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవా సంభాషించే దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా ఆయన్ని ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 12/15 పేజీ 3

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు యేసు ఆయనను కాపాడాడు. ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (మత్త. 14:28-31)

మన సహోదరుడు/సహోదరి విశ్వాసాన్ని కోల్పోతున్నట్లు మనం గమనిస్తే మరింత విశ్వాసాన్ని పెంపొందించుకునేలా ఆయనకు/ఆమెకు మనం చేయందించవచ్చు.—9/15, 8వ పేజీ.

• మనల్ని విమోచించడానికి యెహోవా ఏ త్యాగం చేశాడు?

తన కుమారుడు యాతనపెట్టబడినా, హేళనచేయబడినా యెహోవా వాటిని సహించాడు. అబ్రాహాము వేదనను అనుభవించాల్సి వచ్చినా తన కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడ్డాడు. అలాగే యెహోవా వేదనను అనుభవించాల్సి వచ్చినా తన కుమారుడు అపరాధిగా చంపబడేందుకు అనుమతించాడు.—9/15, 28-29 పేజీలు.

• ‘ఇల్లు కట్టుకునే’ విషయంలో సామెతలు 24:27 నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి దానితోపాటు వచ్చే బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధపడాలి. అంటే, కుటుంబాన్ని పోషించడానికి, ఆధ్యాత్మిక విషయాల్లో కుటుంబానికి నాయకత్వం వహించడానికి ఆయన సిద్ధపడాలి.—10/15, 12వ పేజీ.

• మర్యాద చూపించే విషయంలో యెహోవా, యేసు ఎలా మంచి మాదిరి ఉంచారు?

యెహోవా విశ్వ సర్వాధిపతి అయినప్పటికీ మానవులతో చాలా దయగా, మర్యాదగా వ్యవహరిస్తాడు. అబ్రాహాముకు, మోషేకు ఆజ్ఞ ఇస్తున్నప్పుడు దయచేసి చేయండి అని అర్థమిచ్చే హెబ్రీ పదాన్ని ఉపయోగించాడు. (ఆది. 13:14; నిర్గ. 4:6) దేవుడు మానవులు మాట్లాడుతున్నప్పుడు కూడా వింటాడు. (ఆది. 18:23-32) యేసు కూడా తోటి మానవులతో మర్యాదగా ప్రవర్తించాడు. ఆయన తన చుట్టూవున్న వారికి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉండేవాడు. వారిని తరచూ పేరుపెట్టి మరీ పిలిచేవాడు.—11/15, 25వ పేజీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి