కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 11/15 పేజీలు 18-19
  • ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇవ్వండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇవ్వండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఏకహృదయంతో’ ఐక్యంగా దేవుణ్ణి సేవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ‘యెహోవాకు అర్పణను తీసుకెళ్దాం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • ఇచ్చే స్ఫూర్తిని పెంపొందించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 11/15 పేజీలు 18-19

ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇవ్వండి

ఇవ్వడం గురించి అపొస్తలుడైన పౌలు, “ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను” అని అంటూ, “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని చెప్పాడు. (2 కొరిం. 9:7) స్వచ్ఛారాధనకు మద్దతిమ్మని యెహోవా మనలో ఎవరిని బలవంతపెట్టడు. స్వచ్ఛందంగా ఉత్సాహంగా ఇస్తూ తమ భక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయన తన సేవకులకు ఇస్తాడు. గడిచిన కాలమంతటిలో ఆయన ప్రజలు ఉత్సాహంగా ఇచ్చారు. మూడు ఉదాహరణలు చూద్దాం.

ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన తర్వాత, యెహోవా వారికి ఒక ఆలయ గుడారం నిర్మించమని ఆజ్ఞాపించాడు. దానికి అవసరమైన సామగ్రిని విరాళంగా ఇచ్చే అవకాశం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. వారిలో ప్రతీ ఒక్కరు తమ “హృదయం రేపిన” లేక ప్రేరేపించిన దాన్నిబట్టి బంగారం, వెండి, నగలు ఇతర సామగ్రిని విరాళంగా తీసుకొచ్చారు. ప్రజలు ఎంత ఉత్సాహంగా విరాళాలు అందించారంటే, ఇకచాలు, ఇంకేమీ తీసుకురావొద్దని చాటింపు వేయాల్సొచ్చింది.—నిర్గ. 35:5, 21; 36:6, 7.

అది జరిగిన శతాబ్దాల తర్వాత దేవాలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు స్వచ్ఛారాధనకు మద్దతునిచ్చే అవకాశం దేవుని ప్రజలకు మరోసారి వచ్చింది. ఆ నిర్మాణం కోసం దావీదు రాజు తన వంతుగా చాలా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడు, అలా ఇచ్చేందుకు ప్రజలను కూడా ఆహ్వానించాడు. ప్రజలు ఎంత ఉత్సాహంగా ఇచ్చారంటే, వారు విరాళంగా ఇచ్చిన బంగారం, వెండి విలువ ఇప్పటి విలువ ప్రకారం పదివేల కోట్ల డాలర్లు (దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు) ఉంటుంది! యెహోవాకు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చినందుకు ప్రజలు ఎంతో సంతోషించారు.—1 దిన. 29:3-9; 2 దిన. 5:1.

వారిలాగే యేసుక్రీస్తు తొలి అనుచరులు కూడా సంతోషంగా విరాళాలు ఇచ్చారు. సా.శ. 33 పెంతెకొస్తు రోజున దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. వారిలో చాలామంది యెరూషలేముకు వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చారు. అలా వచ్చినవారు తమ కొత్త విశ్వాసం గురించి ఇంకా ఎక్కువ నేర్చుకునేలా కొంతకాలంపాటు యెరూషలేములోనే ఉండాలనుకున్నారు. వారిలో బీదవారికి సహాయం చేయడానికి అక్కడి క్రైస్తవులు విరాళాలు సేకరించారు. వారికి సహాయపడేందుకు ఆ సహోదరులు ఆస్తులు అమ్మి ఆ డబ్బును అపొస్తలులకు తెచ్చి ఇచ్చారు. వారి విశ్వాసాన్ని, ప్రేమను చూసి యెహోవా ఎంత ఆనందించి ఉంటాడో!—అపొ. 2:41-47.

క్రైస్తవులు తమ సమయాన్ని, శక్తిని, డబ్బును వెచ్చిస్తూ ఈ రోజుల్లో కూడా స్వచ్ఛారాధనకు ఉత్సాహంగా, మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నారు. మీరు కూడా అలా ఇవ్వవచ్చు. అలా చేయడానికున్న కొన్ని పద్ధతులు ఈ కింద ఉన్న బాక్సులో ఉన్నాయి.

[18, 19వ పేజీలోని క్యాప్షన్‌]

కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు . . .

ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు

చాలామంది కొంత మొత్తాన్ని పక్కనపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు.

ప్రతీనెలా సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. డబ్బు రూపంలో పంపించే విరాళాలను నేరుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయానికి పంపించవచ్చు. (క్రింద ప్రత్యేకంగా పేర్కొనబడిన వాటికి సంబంధించిన స్వచ్ఛంద విరాళాలను కూడా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపించవచ్చు.) అలా పంపించే చెక్కులను “Watch Tower”a పేరున రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను కూడ విరాళంగా పంపించవచ్చు. అలాంటి వస్తువులను పంపిస్తున్నప్పుడు మీరే వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.

షరతుపై విరాళ ట్రస్టు ఏర్పాటుb

మీ విరాళాలను ప్రపంచవ్యాప్త పని కోసం ఉపయోగించడానికి వాచ్‌టవర్‌ట్రస్టులో జమచేయవచ్చు. అయితే మీరు కావాలనుకున్నప్పుడు డబ్బు తిరిగి తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

దానధర్మ ప్రణాళికc

డబ్బు రూపంలోనేకాక ఇతర పద్ధతుల్లో కూడా ప్రపంచవ్యాప్త రాజ్యసేవ కోసం విరాళాలు ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు ఏమిటంటే:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌పథకానికి లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ఖాతాలకు లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు విరాళంగా ఇవ్వవచ్చు లేదా చట్టబద్ధంగా రాయబడిన వీలునామాలో లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.

స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి వారి తదనంతరం అవి విరాళంగా ఇవ్వబడే ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన ఆధారపత్రాలు రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య ఏర్పాటుతో విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటు కింద ఒక వ్యక్తి డబ్బును లేదా సెక్యూరిటీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న ఒక నిర్దిష్ట కార్పోరేషన్‌కు బదిలీ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యాన్ని పొందుతాడు. దాత వార్షికభత్య విరాళ ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును Watch Tower పేరున చట్టబద్ధంగా వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో Watch Towerనుd లబ్ధిదారుగా సూచించవచ్చు. మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.

“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలంటే దాత ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళికe అనే బ్రోషురు ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. ఆ బ్రోషురును చదివి, తమ న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా మనం మతపరంగానూ, మానవతా దృష్టితోనూ చేస్తున్న పనికి మద్దతునివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందారు.

మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన నంబరుకు ఫోన్‌చేసి లేక క్రింద ఇవ్వబడిన చిరునామాకు ఉత్తరం రాసి యెహోవాసాక్షులను సంప్రదించవచ్చు, లేదా మీ దేశంలోని కార్యకలాపాలను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Jehovah’s Witnesses,

Post Box 6440,

Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 28468072

[అధస్సూచీలు]

a ఇండియాలోనైతే చెక్కులను “The Watch Tower Bible & Tract Society of India” పేరున రాయాలి

b ఇది ఇండియాకు వర్తించదు

c గమనిక: పన్ను నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. పన్ను నిబంధనలు, ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి మీ అకౌంటెంట్‌ను లేక వకీలును సంప్రదించండి. తుది నిర్ణయం తీసుకునే ముందు స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని కూడా సంప్రదించండి.

d ఇండియాలోనైతే, “The Watch Tower Bible & Tract Society of India” పేరున రాయాలి

e ఇండియాలో లభించదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి